Movie Releases: నవంబర్‌లో క్రేజీ చిత్రాలు రిలీజ్.. అందులో స్పెషల్ సినిమాలు ఇవే!-maa oori polimera 2 to devil the list of november 2023 theatrical movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Movie Releases: నవంబర్‌లో క్రేజీ చిత్రాలు రిలీజ్.. అందులో స్పెషల్ సినిమాలు ఇవే!

Movie Releases: నవంబర్‌లో క్రేజీ చిత్రాలు రిలీజ్.. అందులో స్పెషల్ సినిమాలు ఇవే!

Sanjiv Kumar HT Telugu
Oct 28, 2023 11:27 AM IST

November 2023 Theatrical Movies: సెప్టెంబర్ ముగిసిపోయింది. ఇక సినిమాలతో సందడి చేసేందుకు నవంబర్ నెల సిద్ధంగా ఉంది. ఈ నెలలో పెద్ద చిత్రాలు ఏం లేనప్పటికీ కొన్ని క్రేజీ చిత్రాలు మాత్రం అలరించేందుకు రెడీగా ఉన్నాయి.

నవంబర్‌లో క్రేజీ చిత్రాలు రిలీజ్.. అందులో స్పెషల్ సినిమాలు ఇవే!
నవంబర్‌లో క్రేజీ చిత్రాలు రిలీజ్.. అందులో స్పెషల్ సినిమాలు ఇవే!

దసరాకు బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీ, ఇళయదళపతి లియో సినిమా, రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్రం సందడి చేశాయి. ఇప్పుడు నవంబర్ వంతు వచ్చింది. నవంబర్ తొలి వారంలో ఆరుకుపైగా సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ అందులో కొన్ని మాత్రమే ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

కీడా కోలా

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలతో మంచి హిట్స్ కొట్టిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తాజాగా నటించి స్వీయ దర్శకత్వం వహించిన సినిమా కీడా కోలా. డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 3న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.

మా ఊరి పొలిమేర 2

ఓటీటీ వేదికపై మా ఊరి పొలిమేర సినిమాతో ఒకరకమైన సక్సెస్ తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ దానికి సీక్వెల్‌గా తెరకెక్కించిన సినిమానే మా ఊరి పొలిమేర 2. సత్యం రాజేష్, కామాక్షి, బాలాదిత్య, గెటప్ శ్రీను తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా కూడా థియేటర్లలో నవంబర్ 3న రిలీజ్ కానుంది.

రెండో వారంలో

పలాస సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరో రక్షిత్ అట్లూరి తాజాగా నటించిన చిత్రం నరకాసుర. ఈ చిత్రం థియేటర్లలో నవంబర్ 3న విడుదల కానుంది. అలాగే నవంబర్ రెండో వారంలో పంజా వైష్ణవ్ తేజ్ ఆది కేశవ, తమిళ హీరో కార్తి నటించిన జపాన్, రాఘవ లారెన్స్, ఎస్ జే సూర్య నటించిన జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

నవంబర్ 10నే

లవ్ అండ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ చిత్రం ఆది కేశవ. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ నవంబర్ 10న విడుదల కానుంది. ఇక కార్తీ నటించిన జపాన్ సినిమా కూడా నవంబర్ 10నే విడుదలకు రెడీగా ఉంది. అలాగే రాఘవ లారెన్స్ జిగర్తాండ డబుల్ ఎక్స్ సైతం ఇదే రోజున రిలీజ్ కానుంది.

బిగ్ బాలీవుడ్ మూవీ

వీటితోపాటు కొన్ని బాలీవుడ్ చిత్రాలు సైతం నవంబర్‌లో సందడి చేయనున్నాయి. నవంబర్ 12న సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ టైగర్ 3 సినిమా విడుదల కానుంది. ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి మరోసారి పాయల్ రాజ్‌పుత్‌తో తెరకెక్కిన మంగళవారం సినిమా నవంబర్ 17న రిలీజ్ కానుంది. విక్రాంత్, మెహ్రీన్, రుక్సార్ జంటగా నటించిన స్పార్క్ మూవీ నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నెలాఖరులో డెవిల్

కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగారులు దాటి సినిమా నవంబర్ 17న విడుదల కానుంది. నవంబర్ నెలాఖరులన అంటే 24వ తేదీన నందమూరి కల్యాణ్ రామ్ డెవిల్ మూవీ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో మొదటిసారిగా కల్యాణ్ రామ్ గూఢచారి పాత్ర చేయడం విశేషం.