Longest Run Time Movie: ఈ సినిమా రన్‌టైమ్ 720 గంటలు.. ట్రైలర్ 7 గంటలు.. రిలీజ్ కాకుండానే..-longest run time movie in the world ambiance with 720 hours runtime and 7 hours of trailer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Longest Run Time Movie: ఈ సినిమా రన్‌టైమ్ 720 గంటలు.. ట్రైలర్ 7 గంటలు.. రిలీజ్ కాకుండానే..

Longest Run Time Movie: ఈ సినిమా రన్‌టైమ్ 720 గంటలు.. ట్రైలర్ 7 గంటలు.. రిలీజ్ కాకుండానే..

Hari Prasad S HT Telugu
Oct 08, 2024 11:55 AM IST

Longest Run Time Movie: ఓ సినిమా రన్ టైమ్ ఏకంగా 720 గంటలు అంటే నమ్మగలరా? అంటే నెల రోజులు. అంతేకాదు కేవలం ట్రైలరే 7 గంటలకుపైగా ఉందంటే నమ్మశక్యం కాదు. కానీ ఈ మూవీ ఎప్పుడూ థియేటర్లలో రిలీజ్ కానే లేదు.

ఈ సినిమా రన్‌టైమ్ 720 గంటలు.. ట్రైలర్ 7 గంటలు.. రిలీజ్ కాకుండానే..
ఈ సినిమా రన్‌టైమ్ 720 గంటలు.. ట్రైలర్ 7 గంటలు.. రిలీజ్ కాకుండానే..

Longest Run Time Movie: ఓ సినిమా రన్ టైమ్ ఎంత ఉంటుంది? సాధారణంగా అయితే సగటును రెండున్నర గంటలు. మూడు అంతకంటే ఎక్కువ ఉంటే ఎక్కువ రన్ టైమ్ తో వస్తున్న సినిమా అంటుంటాం. కానీ ఈ మూవీ రన్ టైమ్ ఏకంగా 720 గంటలు. అంటే ఓ నెలంతా థియేటర్లో కూర్చొంటేగానీ సినిమా అయిపోదు. మరి ఆ సినిమా ఏది? ఎందుకు ఇది థియేటర్లలో రిలీజ్ కాలేదు లాంటి విషయాలు తెలుసుకోండి.

720 గంటల మూవీ ఇదే..

బాలీవుడ్ మూవీ సింగం అగైన్ ట్రైలర్ సోమవారం (అక్టోబర్ 7) రిలీజై రికార్డులు తిరగరాసిన విషయం తెలుసు కదా. 4 నిమిషాల 58 సెకన్ల నిడివి కలిగిన ఈ ట్రైలర్ బాలీవుడ్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన ట్రైలర్ గా నిలిచింది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ట్రైలరే ఏకంగా మన మూడు సినిమాల నిడివంత అంటే నమ్మగలరా?

ఈ మూవీ పేరు ఆంబియన్స్(Ambiance). 720 గంటలు.. అంటే 30 రోజుల నిడివి గల మూవీ ఇది. స్వీడిష్ డైరెక్టర్ ఆండర్స్ వీబెర్గ్ డైరెక్ట్ చేశాడు. నిజానికి ఈ సినిమా డిసెంబర్ 21, 2020లో థియేటర్లలో రిలీజ్ కావాల్సింది. కానీ ఈ మొత్తాన్ని చూసిన డైరెక్టర్.. తర్వాత ఆ కాపీని ధ్వంసం చేసేశాడు. ఆ సినిమాకు సంబంధించిన ఏకైక కాపీ అదే. దీంతో ప్రపంచంలోని అత్యంత సుదీర్ఘ రన్ టైమ్ కలిగిన మూవీ అసలు రిలీజ్ కాకుండానే వెళ్లిపోయింది.

ఏంటీ ఆంబియన్స్ మూవీ?

ఆంబియన్స్ మూవీ స్వీడిష్ డైరెక్టర్ ఆండర్స్ వీబెర్గ్ తీసిన ఓ ప్రయోగాత్మక మూవీ. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను 2014లో తొలిసారి రిలీజ్ చేశాడు. ఆ ట్రైలర్ నిడివి 72 నిమిషాలు. ఆ తర్వాత 2016లో ఏకంగా 439 నిమిషాలు అంటే 7 గంటల 19 నిమిషాల నిడివి ఉన్న మరో ట్రైలర్ కూడా రిలీజ్ చేశాడు. అది కూడా ఒక్క కట్ కూడా లేకుండా సింగిల్ టేక్ లో చేసిన ట్రైలర్ కావడం విశేషం.

ఈ ప్రయోగాత్మక సినిమాను డైరెక్టర్ తొలిసారి చూశాడు. తర్వాత రిలీజ్ చేయకుండానే ఆ ఒరిజినల్ కాపీని ధ్వంసం చేసేశాడు. సుదీర్ఘ రన్ టైమ్ కలిగిన సినిమా అసలు ఉనికిలోనే లేదు అని ఈ మూవీ గురించి డైరెక్టర్ వీబెర్గ్ కామెంట్ చేశాడు. పాత, క్లాసిక్ సినిమాల రీక్రియేషన్ ను నిరసిస్తూ తాను ఈ సినిమా తీసినట్లు అతడు చెప్పాడు. ఈ సినిమాను తాను ధ్వంసం చేసినట్లు జనవరి 3, 2021న ఎక్స్ అకౌంట్ ద్వారా అతడు వెల్లడించాడు.

ఆండర్స్ వీబెర్గ్ పాపులర్ స్వీడిష్ డైరెక్టర్. తన కెరీర్లో 300కుపైగా సినిమాలు తీసిన ఘనత అతని సొంతం. ఈ ఆంబియన్స్ మూవీయే అతని కెరీర్లో చివరిది. కానీ ఆ మూవీ ప్రేక్షకుల ముందుకు రాకముందే కాలగర్భంలో కలిసిపోయింది.

Whats_app_banner