Longest Kissing Scene: ఇండియన్ సినిమాలో ఎక్కువసేపు ముద్దు సీన్లో నటించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?-longest kissing scene in indian cinema devika rani acted in this scene which lasted about four minutes ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Longest Kissing Scene: ఇండియన్ సినిమాలో ఎక్కువసేపు ముద్దు సీన్లో నటించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?

Longest Kissing Scene: ఇండియన్ సినిమాలో ఎక్కువసేపు ముద్దు సీన్లో నటించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?

Hari Prasad S HT Telugu
Feb 13, 2024 04:43 PM IST

Longest Kissing Scene: ఇండియన్ సినిమాలో ఓ కిస్సింగ్ సీన్లో ఎక్కువసేపు నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె తర్వాతి కాలంలో భర్తను వదిలేసి సహచర నటుడితో పారిపోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఇండియన్ సినిమాలో తొలి, లాంగెస్ట్ కిస్సింగ్ సీన్ లో హీరోయిన్ దేవికా రాణి
ఇండియన్ సినిమాలో తొలి, లాంగెస్ట్ కిస్సింగ్ సీన్ లో హీరోయిన్ దేవికా రాణి

Longest Kissing Scene: ఇండియన్ సినిమాలో అందులోనూ హిందీ సినిమాల్లో హాట్ కిస్సింగ్ సీన్స్ ఈ మధ్య చాలా సాధారణమైపోయాయి. కానీ ఒకప్పుడు కూడా ఇలాంటి సీన్లు తరచూ స్క్రీన్ పై కనిపిస్తూనే ఉండేవి. ముఖ్యంగా 1930, 40ల్లో ఇలాంటి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన ఓ కిస్సింగ్ సీన్ ఇప్పటికీ లాంగెస్ట్ కిస్సింగ్ సీన్ గా నిలిచిపోయింది. అందులో దేవికా రాణి అనే నటి తన భర్తతోనే నటించడం విశేషం.

కిస్ డే.. కిస్సింగ్ సీన్

వాలెంటైన్స్ వీక్ లో భాగంగా ఫిబ్రవరి 13న కిస్ డేగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా సిల్వర్ స్క్రీన్ పై కిస్సింగ్ సీన్స్ గురించి మాట్లాడుకుంటే.. 1933లో కర్మ అనే సినిమా రిలీజైంది. అందులో హిమాన్షు రాయ్, దేవికా రాణి లీడ్ రోల్స్ లో నటించారు. ఈ ఇద్దరూ భార్యాభర్తలు. వీళ్లు లండన్ నుంచి ఇక్కడికి వచ్చి ఆ సినిమా తీశారు. ఇందులో ఈ ఇద్దరి మధ్య ఏకంగా 4 నిమిషాల కిస్సింగ్ సీన్ ఉండటం విశేషం.

ఇండియన్ సినిమాలో ఇదే తొలి కిస్ కాగా.. ఇప్పటికీ ఇదే లాంగెస్ట్ కిస్ సీన్ అంటే నమ్మగలరా? ఒక రకంగా ఇండియన్ సినిమాలోనే కాదు వరల్డ్ సినిమాలోనూ ఆ కాలంలో ఇలాంటి కిస్ సీన్ ఓ సంచలనమే. భార్యభర్తలే లీడ్ రోల్స్ లో నటించడంతో వీళ్లు ఈ సీన్ ను సులువుగా చేసేశారు. ఈ మధ్యే ఈ ఇద్దరి కథను పోలిన జూబ్లీ అనే వెబ్ సిరీస్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది.

భర్తను వదిలేసి.. పారిపోయి..

ఇండియన్ సినిమాలో లాంగెస్ట్ కిస్సింగ్ సీన్ లో నటించిన హీరోయిన్ గానే కాకుండా ఆ తర్వాతి కాలంలో దేవికా రాణి మరో వివాదంలోనూ చిక్కుకుంది. 1930ల్లో టాప్ నటిగా ఎదిగిన ఆమె.. తన భర్త ప్రొడక్షన్స్ లోనే నటించేది. 1936లో తన సహ నటుడు నజ్ముల్ హసన్ తో ప్రేమలో పడి తర్వాత అతనితో కలిసి పారిపోయింది. రాయ్ కి చెందిన బాంబే టాకీస్ తెరకెక్కించిన జీవన్ నైయా మూవీ షూటింగ్ సమయంలోనే వీళ్లు ప్రేమలో పడ్డారు.

సినిమాను మధ్యలోనే వదిలేసి ఈ ఇద్దరూ పారిపోయారు. ఆ సమయంలో హిమాన్షు రాయ్ తన స్టూడియోలో సౌండ్ ఇంజినీర్ గా పని చేసే సాషధర్ ముఖర్జీని వాళ్లను వెతకడానికి పంపిస్తాడు. ఆ ఇద్దరూ తిరిగి వచ్చిన తర్వాత నజ్ముల్ ను పంపిచేస్తాడు. అతని స్థానంలో సాషధర్ బావ కుముద్‌లాల్ గంగూలీని హీరోని చేస్తాడు. అప్పటికి అతడు ఆ స్టూడియోలో ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేస్తుంటాడు. ఆ కుముద్‌లాల్ ఎవరో కాదు.. తర్వాతి కాలంలో అశోక్ కుమార్ పేరుతో పెద్ద స్టార్ గా మారిన బాలీవుడ్ నటుడు.

గతేడాది అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూబ్లీ పేరుతో వచ్చిన వెబ్ సిరీస్ వీళ్ల కథను కళ్లకు కట్టింది. ఈ సిరీస్ కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Whats_app_banner