OTT Releases: ఓటీటీలో ఫ్రైడే ఫెస్టివల్.. 30 సినిమాలు రిలీజ్.. అందరి ఫోకస్ వాటిపైనే!-list ott releases movies and web series on september 15 friday and 3rd week 2023 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases: ఓటీటీలో ఫ్రైడే ఫెస్టివల్.. 30 సినిమాలు రిలీజ్.. అందరి ఫోకస్ వాటిపైనే!

OTT Releases: ఓటీటీలో ఫ్రైడే ఫెస్టివల్.. 30 సినిమాలు రిలీజ్.. అందరి ఫోకస్ వాటిపైనే!

Sanjiv Kumar HT Telugu
Sep 14, 2023 10:39 AM IST

Friday OTT Releases Movies: నేటి కాలంలో థియేటర్లలోకి వెళ్లేవారి కంటే ఓటీటీల్లో ఇంటిల్లిపాది సినిమాలు చూసే వారే ఎక్కువయ్యారు. అందుకే ఓటీటీ సంస్థలు గంపగుత్తగా సినిమాలు, వెబ్ సిరీసులను ప్రతివారం విడుదల చేస్తుంటాయి. అలా ఈవారం శుక్రవారం ఎన్ని రిలీజ్ అవుతున్నాయంటే?

ఓటీటీలో ఫ్రైడే ఫెస్టివల్.. 30 సినిమాలు రిలీజ్
ఓటీటీలో ఫ్రైడే ఫెస్టివల్.. 30 సినిమాలు రిలీజ్

OTT Releases Of September 3rd Week: ప్రతీ వారంలాగే ఈ వారం (సెప్టెంబర్ 3వ వారం) సరికొత్త సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీల్లో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వీకెండ్ కూడా ఎంటర్టైన్ చేయడానికి మేమున్నాం ప్రేక్షకుల్లారా అంటూ ముందుకు వస్తున్నాయి. ఇందులో అప్పటికే థియేటర్లలో విడుదలైన సూపర్ హిట్ సాధించిన సినిమాలు, బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా పడిన చిత్రాలతోపాటు నేరుగా ఓటీటీల్లోనే రిలీజయ్యే వెబ్ సిరీసులు సైతం ఉన్నాయి. మరి ఏ ఓటీటీ వేదికపై ఎలాంటి సినిమాలు, వెబ్ సిరీసులు వస్తున్నాయో చూద్దాం.

నెట్‍ఫ్లిక్స్

చిరంజీవి భోళా శంకర్- సెప్టెంబర్ 15

ఎల్ కొండే (స్పానిష్ మూవీ)- సెప్టెంబర్ 15

ఇన్‌సైడ్ ది వరల్డ్స్ టఫస్టే ప్రిజన్స్: సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్)- సెప్టెంబర్ 15

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ (హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 15

మిస్ ఎడ్యుకేషన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 15

సర్వైవింగ్ సమ్మర్: సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 15

ది క్లబ్: పార్ట్ 2 (టర్కిష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 15

రామబాణం (తెలుగు మూవీ)- ఆల్రెడీ స్ట్రీమింగ్

డైరీస్ సీజన్ 2: పార్ట్ 1 (ఇటాలియన్ సిరీస్) ఆల్రెడీ స్ట్రీమింగ్

థర్స్ డేస్ విడోస్ (స్పానిష్ వెబ్ సిరీస్)- ఆల్రెడీ స్ట్రీమింగ్

వన్స్ అపాన్ ఏ క్రైమ్ (జపనీస్ మూవీ)- ఆల్రెడీ స్ట్రీమింగ్

ఎరంగార్డ్: ది ఆర్ట్ ఆఫ్ సెడక్సన్ (డానిష్ మూవీ) ఆల్రెడీ స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్‍స్టార్

హన్సిక మోత్వానీ Myత్రి (తెలుగు డబ్బింగ్ మూవీ)- సెప్టెంబర్ 15

కాలా (హిందీ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 15

ల్యాంగ్ ల్యాంగ్ ప్లేస్ డిస్నీ (ఇంగ్లీష్ మూవీ)- సెప్టెంబర్ 15

ది అదర్ బ్లాక్ గర్ల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 15

అమెజాన్ ప్రైమ్ వీడియో

అనీతి (తెలుగు డబ్బింగ్ మూవీ)- సెప్టెంబర్ 15

డిజిటల్ విలేజ్ (మలయాళ సినిమా)- సెప్టెంబర్ 15

మిలియన్ మైవ్ల్ అవే (ఇంగ్లీష్ చిత్రం)- సెప్టెంబర్ 15

సుబేదార్ (మరాఠీ చిత్రం)- సెప్టెంబర్ 15

వైల్డర్‍నెస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 15

ది ఫెర్రాగ్నెజ్: సన్రేమో స్పెషల్- ఆల్రెడీ స్ట్రీమింగ్

బంబై మేరీ జాన్ (హిందీ వెబ్ సిరీస్)- ఆల్రెడీ స్ట్రీమింగ్

మరిన్ని ఓటీటీల్లో

మాయపేటిక (తెలుగు మూవీ)- ఆహా- సెప్టెంబర్ 15

హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే (కన్నడ చిత్రం)- జీ5- సెప్టెంబర్ 15

జర్నీ ఆఫ్ లవ్ 18+ (మలయాళ చిత్రం)- సోనీ లివ్- సెప్టెంబర్ 15

ఏ హనీమూన్ టూ రిమెంబర్ (ఇంగ్లీష్ సినిమా)- బుక్ మై షో- సెప్టెంబర్ 15

మోర్టల్ కంబాట్ లెజెండ్స్: కేజ్ మ్యాచ్ (ఇంగ్లీష్ మూవీ)- బుక్ మై షో- సెప్టెంబర్ 15

పప్పచన్ ఒలివిలాన్ (మలయాళ చిత్రం)- సైనా ప్లే- ఆల్రెడీ స్ట్రీమింగ్

దిల్ సే (తెలుగు సినిమా)- ఈటీవీ విన్- సెప్టెంబర్ 16

ఏకంగా 30 సినిమాలు

ఇలా సెప్టెంబర్ మూడో వారం ఏకంగా 30 సినిమాలు, వెబ్ సిరీసులు విడుదల కానుండగా కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక శుక్రవారం (సెప్టెంబర్ 15)న 24 సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటన్నింటిలో భోళా శంకర్, రామబాణం, మాయపేటిక, Myత్రి, దిల్ సే, హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే చిత్రాలు ఆసక్తిగా మారాయి.