Kushi Day 1 Collection: బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్మురేపిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ఖుషి - ఫ‌స్ట్ డే రికార్డ్ క‌లెక్ష‌న్స్‌!-kushi day 1 collection kushi record highest collection movie on the first day in vijay deverakonda career ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kushi Day 1 Collection: బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్మురేపిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ఖుషి - ఫ‌స్ట్ డే రికార్డ్ క‌లెక్ష‌న్స్‌!

Kushi Day 1 Collection: బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్మురేపిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ఖుషి - ఫ‌స్ట్ డే రికార్డ్ క‌లెక్ష‌న్స్‌!

HT Telugu Desk HT Telugu
Sep 02, 2023 12:19 PM IST

Kushi Day 1 Collection: ఖుషి తొలిరోజు విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీగా నిలిచింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఫ‌స్ట్ డే ఈ మూవీకి వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఎంతంటే...

ఖుషి మూవీ
ఖుషి మూవీ

Kushi Day 1 Collection: విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన ఖుషి మూవీ ఫ‌స్ట్ డే రికార్డ్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లో తొలి రోజు అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది. శుక్ర‌వారం రిలీజైన ఈ మూవీ ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్‌గా 27 కోట్ల గ్రాస్‌ను 16 కోట్ల షేర్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల 90 ల‌క్ష‌ల గ్రాస్‌ను, 10 కోట్ల‌కు వ‌ర‌కు షేర్‌ కలెక్షన్స్ ను ఖుషి మూవీ ద‌క్కించుకున్నది. తొలి రోజు అత్య‌ధికంగా నైజాం ఏరియాలో ఖుషి మూవీకి ఐదున్న‌ర కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి.

ఓవ‌ర్‌సీస్‌లో ఫ‌స్ట్ డే ఖుషి ప్ర‌భంజ‌నం సృష్టించింది. నాలుగున్న‌ర కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ మూవీ ఫ‌స్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది కోట్ల అర‌వై ల‌క్ష‌ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. లైగ‌ర్ రికార్డ్‌ను ఖుషి బ్రేక్ చేసింది. టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన టాప్ టెన్ మూవీస్‌లో ఒక‌టిగా ఖుషి నిలిచింది.

ఓవ‌రాల్‌గా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 52 కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. 53 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉంది. ఫ‌స్ట్ డేనే 16 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లు రావ‌డంతో నిర్మాత‌లు, ఎగ్జిబిట‌ర్లు ఖుషి అవుతోన్నారు. శని, ఆది వారాల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

విజ‌య్‌, సామ్ కెమిస్ట్రీ...

కుటుంబ సిద్ధాంతాల్ని, ఆచారాల్ని ఎదురించి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట క‌థ‌తో ఖుషి మూవీని ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ తెర‌కెక్కించాడు. సైన్స్‌, న‌మ్మ‌కాల‌కంటే ప్రేమే గొప్ప‌ద‌ని ఈ జంట ఎలా నిరూపించార‌న్న‌ది రొమాన్స్‌, ఎమోష‌న్స్‌తో పాటు ఎంట‌ర్‌టైనింగ్‌గా శివ నిర్వాణ ఈ సినిమాలో చూపించారు.

ఖుషి సినిమాకు విజ‌య్‌, స‌మంత కెమిస్ట్రీ హైలైట్‌గా నిలుస్తోంది. ఖుషి మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించింది. హీష‌మ్ అబ్దుల్ వ‌హాబ్ సంగీతాన్ని అందించాడు.

టీ20 వరల్డ్ కప్ 2024