Krishna Vamsi on Rangamarthanda: రంగమార్తండ చిత్రానికి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు.. కృష్ణవంశీ స్పష్టం
Krishna Vamsi on Rangamarthanda: కృష్ణవంశీ తను తెరకెక్కించిన రంగమార్తండ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమాకు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతారని స్పష్టం చేశారు.
Krishna Vamsi on Rangamarthanda: చాలా కాలం గ్యాప్ తర్వాత క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రంగమార్తండ. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలయ్యాయి. ఈ టీజర్ ఆద్యంత ఆసక్తికరంగా సాగుతుంది. అంతేకాకుండా ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేసింది. మరాఠి ఎమోషనల్ డ్రామా నటసామ్రాట్‌కు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం ఉగాది సందర్భంగా మార్చి 22న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణవంశీ, నటుడు రాహుల్ సిప్లీగంజ్ మీడియా సమావేశం నిర్వహించారు.
"రంగమార్తాండ సినిమా ఉగాది సందర్భంగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాను చూసిన అందరూ పాజిటీవ్ గా మాట్లాడుతున్నారు. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులకు కూడా సినిమా బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాకు ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ నటన ఇళయరాజా సంగీతం, సీతారామశాస్త్రి గారి సాహిత్యం ఇలా సినిమాకు అన్ని కుదిరాయి. ఈ సినిమను చూసిన ఒక చిన్నారి "నేను మా అమ్మా నాన్నలను బాగా చూసుకుంటాను అని చెప్పడం విశేషం". ఇలా ప్రతి ఒక్కరూ బాగా కనెక్ట్ అయ్యారు." అని కృష్ణవంశీ స్పష్టం చేశారు.
తన భార్య రమ్య కృష్ణపై సన్నివేశాలు తీసేటప్పుడు బాధపడ్డానని కృష్ణవంశీ తెలిపారు. "చిత్రం చివర్లో రమ్య మీద సన్నివేశాలు షూట్ చేసేటప్పుడు చాలా బాధ పడ్డాను. నిజానికి రమ్యకృష్ణ పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశాను. రమ్య కళ్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. దీంతో ఎలాంటి పెద్ద డైలాగులు లేకుండా కళ్లతోనే నటించాలని రమ్యకు చెప్పినప్పుడు సరేనని చెప్పింది. ఈ పాత్ర కోసం మేకప్, హెయిర్ స్టైల్ కూడా తనే చేసుకుంది. దాదాపు 36 గంటల పాటు క్లైమాక్స్ సీన్స్ తీశాను. అప్పుడు నాకు సెంటిమెంట్ అడ్డొచ్చింది. షూట్ చేస్తుంటే కంట్లో నుంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి" అని తెలిపారు.
ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, బ్రహ్మానందం ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు రాహుల్ సిప్లీగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు పోషించారు. మార్చి 22న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కృష్ణ వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, హౌస్ ఫుల్ మూవీస్ పతాకంపై కలిపు మధు, ఎస్ వెంకట రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు.
టాపిక్