Most Expensive Handbag : ఆ నటి హ్యాండ్ బ్యాగ్ ధర రూ.3 కోట్లు.. ఏముంది మేడమ్ అందులో?-kim kardashian spotted with world most expensive handbag heres how much it costs ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Most Expensive Handbag : ఆ నటి హ్యాండ్ బ్యాగ్ ధర రూ.3 కోట్లు.. ఏముంది మేడమ్ అందులో?

Most Expensive Handbag : ఆ నటి హ్యాండ్ బ్యాగ్ ధర రూ.3 కోట్లు.. ఏముంది మేడమ్ అందులో?

Anand Sai HT Telugu
Jul 31, 2023 10:08 AM IST

Expensive Handbag : కొన్ని కొన్ని వస్తులు చాలా కాస్ట్లీగా ఉంటాయి. కానీ ఒక్కసారి ఆ వస్తువును చూసి.. దీని ధర ఇంతనా.. అని నోరు తెరుస్తాం. తాజాగా ఓ నటి హ్యాండ్ బ్యాగ్ చూసి.. అందరూ అలానే అనుకుంటున్నారు. ఆమె హ్యాండ్ బ్యాగ్ ధర.. అక్షరాలా మూడు కోట్లు.

కిమ్ కర్దాషియాన్ హ్యాండ్ బ్యాగ్
కిమ్ కర్దాషియాన్ హ్యాండ్ బ్యాగ్

అమెరికాకు చెందిన ప్రముఖ నటి, మోడల్, వ్యాపారవేత్త కిమ్ కర్దాషియాన్(Kim Kardashian) తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా, కిమ్ ఫ్యాషన్, బాయ్‌ఫ్రెండ్ సమస్యపై గురించి అందరికీ తెలిసింది. ఎప్పుడూ తన బాయ్‌ఫ్రెండ్‌తో కనిపించే కిమ్ కర్దాషియాన్ ఏం వేసుకుంటుంది? ఆమె కలెక్షన్ ఏంటో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఉంటారు. ఫ్యాషన్ విషయంలో ఎన్నో ప్రయోగాలు చేస్తోంది ఆమె. బోల్డ్ గా కనిపించే కిమ్ కర్దాషియాన్ ఖరీదైన బ్యాగ్ తో వార్తల్లోకెక్కింది. విశేషమేమిటంటే ఈ బ్యాగ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్. దీని ధర 3 కోట్ల రూపాయల కంటే ఎక్కువ.

ఇటీవల కిమ్ కర్దాషియాన్ జపాన్(Japan) వెళ్లారు. ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన కిమ్.. ఓ బ్యాగ్ తీసుకుని వెళ్లింది. సిల్వర్ కలర్ లో మెరిసే ఆ హ్యాండ్ బ్యాగ్ ఫోటో వైరల్‌గా మారింది. దీని ధర 3 కోట్ల 12 లక్షల 61 వేల రూపాయలు. దీని ధర విని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆ చిన్న బ్యాగ్‌కి ఇంత చెల్లించిందా అని ప్రశ్నిస్తున్నారు. నటి సంపదను చూసి జనాలు షాక్ అవుతున్నారు. ఇది ఎలాంటి బ్యాగ్? దీని ప్రత్యేకత ఏంటని ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు.

ఇది ప్రతిష్టాత్మక హీర్మేస్ కంపెనీ నుండి వచ్చిన బ్యాగ్. బంగారం, డైమండ్ తో కలిపి డిజైన్‌ ఉంటుంది. ప్రపంచంలో కొంతమంది మాత్రమే ఈ బ్యాగ్‌ని కలిగి ఉన్నారు. ఇది ప్రత్యేకమైన కస్టమర్ల కోసం మాత్రమే తయారు చేశారు. ఈ హ్యాండ్‌బ్యాగ్‌ని సొంతం చేసుకోవడం ప్రతిష్టకు సంబంధించిన అంశంగా చూస్తారు బాగా డబ్బు ఉన్నవాళ్లు. అందుకే కొందరు సెలబ్రిటీలు కొనుగోలు చేస్తారు. ఈ బ్యాగులన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయి. కావాలనుకున్నా మార్కెట్‌లో దొరకడం లేదు.

సెలబ్రిటీలు ఎల్లప్పుడూ ఏదైనా ప్రత్యేకమైనవి, అత్యంత ఖరీదైన వస్తువులను కలిగి ఉండటానికి ఇష్టపడతారు. వారితో ప్రత్యేకంగా ఉండాలన్నారు. కిమ్ కర్దాషియాన్‌కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో చాలా మిలియన్లకు పైగా ప్రజలు ఆమెను అనుసరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను కలిగి ఉన్న కిమ్ బాగ్(kim handbag) ఇప్పుడు అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.