Star OTT: థియేటర్లలో హిట్టు - అయినా నెలలోపే ఓటీటీలోకి వచ్చిన కోలీవుడ్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Star OTT: లేటెస్ట్ తమిళ్ బ్లాక్‌బస్టర్ మూవీ స్టార్ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. కెవిన్ హీరోగా నటించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Star OTT: కెవిన్ హీరోగా నటించిన స్టార్ మూవీ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ హిట్‌గా నిలిచింది. సినిమా హీరో కావాలని కలలు కనే ఓ యువకుడి జర్నీని ఆవిష్కరిస్తూ దర్శకుడు ఎలాన్ ఈ మూవీని తెరకెక్కించాడు. మే 10న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. దాదాపు పన్నెండు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన స్టార్ మూవీ 20 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి నిర్మాతలకు లాభాలను మిగిల్చింది.
నెలలోపే ఓటీటీలోకి...
థియేటర్లలో హిట్టైన స్టార్ మూవీ నెలలోపే ఓటీటీలోకి వచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. తమిళంతో పాటు తెలుగులోనూ స్టార్ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. తెలుగు వెర్షన్ ను థియేటర్లలో విడుదలచేయాలని అనుకున్నారు. కానీ డైరెక్ట్ గా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ వచ్చింది.
ఇద్దరు హీరోయిన్లు...
స్టార్ మూవీలో ప్రీతీ ముకుందన్, అదితి పొన్నకర్ హీరోయిన్లుగా నటించారు. మలయాళ సీనియర్ నటుడు లాల్ కీలక పాత్ర పోషించారు.
స్టార్ కథ ఇదే...
పాండియన్ (లాల్) ఓ ఫొటోగ్రాఫర్. కొడుకు కలై(కెవిన్)ని సినిమా యాక్టర్ చేయాలని కలలు కంటాడు. తండ్రి ఎంకరేజ్‌మెంట్‌తో చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చితోనే పెరుగుతాడు కలై. ఇంజినీరింగ్ కాలేజీలో కలైకి మీరా (పీతీ ముకుందన్) పరిచయం అవుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు.
ఎన్నో కష్టాలు పడి ముంబైలో యాక్సింగ్ కోర్సు పూర్తిచేస్తాడు కలై. సినిమా హీరోగా అవకాశం వస్తోంది. షూటింగ్ కోసం వెళుతోండగా జరిగిన యాక్సిడెంట్‌లో కలై ముఖానికి బాగా దెబ్బలు తగలడంతో అందవికారంగా మారిపోతాడు. అతడి ముఖాన్ని చూసి బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా కూడా ఎవరూ సినిమాల్లో అవకాశాలు ఇవ్వరు.
ఆ తర్వాత ఏమైంది. కష్టసమయంలో కలై జీవితంలోకి వచ్చిన సురభి (అదితి పొన్నకర్) ఎవరు? సురభిని పెళ్లిచేసుకున్న కలై ఆమెకు ఎందుకు దూరమయ్యాడు? నటుడవ్వాలనే కలై కల నె రవేరిందా? లేదా అన్నదే స్టార్ మూవీ కథ.
నాచురల్ యాక్టింగ్...
ఈ మూవీలో కలై పాత్రలో కెవిన్ నాచురల్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. సినిమాలపై మోజుతో ఎన్నో కష్టాలను, కన్నీళ్లను అనుభవించే యువకుడి పాత్రలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. కెవిన్, లాల్ కాంబినేషన్‌లోని సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఈ మూవీతోనే టాలీవుడ్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కెవిన్ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించాడు. స్టార్ మూవీ కథ గమనం నెమ్మదిగా సాగడం, ఆశించిన స్థాయిలో ఎమోషన్స్ పండకపోవడంతో సినిమా మోస్తారు హిట్‌తోనే సరిపెట్టుకున్నది.
లిఫ్ట్...దాదా...
బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా కెవిన్ జర్నీ మొదలైంది. అతడు హీరోగా నటించిన లిఫ్ట్, దాదా సినిమాలు తమిళంలో పెద్ద హిట్‌గా నిలవడంతో యూత్ సెన్సేషనల్‌గా కెవిన్ మారిపోయాడు. దాంతో స్టార్‌పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం తమిళంలో హీరోగా నాలుగు సినిమాలు చేస్తోన్నాడు. ఓ సినిమాలో బిచ్చగాడిగా కనిపించబోతున్నాడు.
టాపిక్