Web Series: ఇంట్రెస్టింగ్‌గా నివేతా పేతురాజ్ పరువు వెబ్‌సిరీస్ ట్రైలర్ - విలన్ పాత్రలో బిగ్‌బాస్ లేడీ విన్నర్
Paruvu Web Series Trailer: నివేతా పేతురాజ్ తెలుగులో పరువు పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది. క్రైమ్ డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్‌ను ఆదివారం మెగాహీరో వరుణ్ తేజ్ రిలీజ్ చేశాడు.
Paruvu Web Series Trailer: నివేతా పేతురాజ్ తెలుగులో ఫస్ట్ టైమ్ ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది. పరువు పేరుతో తెరకెక్కుతోన్న ఈ సిరీస్‌కు సిద్ధార్థ్ నాయుడు, రాజశేఖర్ వడ్లపాటి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రైమ్ డ్రామా సిరీస్‌కు డైరెక్టర్ పవన్ సాదినేని షో రన్నర్‌గా వ్యవహరిస్తోన్నాడు.
పరువు వెబ్‌సిరీస్‌లో నరేష్ అగస్త్య, నాగబాబుతో పాటు బిగ్‌బాస్ ఓటీటీ విన్నర్ బిందుమాధవి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్నారు. పరువు వెబ్‌సిరీస్ జూన్ 14 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
వరుణ్ తేజ్ రిలీజ్...
ఆదివారం పరువు వెబ్‌సిరీస్ ట్రైలర్‌ను మెగా హీరో వరుణ్ తేజ్ రిలీజ్ చేశాడు. పెద్దలకు తెలియకుండా ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లిచేసుకోవాలని అనుకున్న జాహ్నవి, విక్రమ్ అనే ప్రేమ జంటకు ఎదురైన సంఘటనలతో ట్రైలర్ ఉత్కంఠను పంచుతోంది. ఏదైనా కానీ నీతో లైఫ్ బాగుంటుంది అనిపిస్తుందని నరేష్ అగస్త్యతో నివేతా పేతురాజ్ చెప్పినడైలాగ్ ట్రైలర్‌లో ఆకట్టుకుంటోంది.
మీ అమ్మాయి విషయం నేను చూసుకుంటానని నాగబాబు అనడం ఆసక్తిని పంచుతోంది. ప్రేమ జంటను చంపడానికి కొందరు కిల్లర్స్ ఎందుకు ప్రయత్నించారు? ఈ కిల్లర్స్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వారు ఎలా హంతకులుగా మారారు? శవాన్ని దాచిపెట్టే ప్రయత్నంలో వారు పడిన కష్టాల్లో ట్రైలర్ థ్రిల్లింగ్‌ను పంచింది. ట్రైలర్ చివరలో బిందుమాధవి కనిపించింది. ట్రైలర్‌లోని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటోంది.
చిరంజీవి కూతురు...
పరువు వెబ్‌సిరీస్‌ను గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేస్తోంది. ఏడు ఎపిసోడ్స్‌తో ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ సాగనున్నట్లు చెబుతోన్నారు. తెలుగులో సుస్మిత కొణిదెల నిర్మిస్తోన్న రెండో వెబ్‌సిరీస్ ఇది. గతంలో షూట్ అవుట్ ఎట్ ఆలేర్ వెబ్‌సిరీస్‌ను నిర్మించింది సుస్మితా కొణిదెల. 2020లో రిలీజైన ఈ వెబ్‌సిరీస్‌లో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.
శ్రీవిష్ణు మూవీతో ఎంట్రీ...
తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా పలు సినిమాలు చేసింది నివేతా పేతురాజ్. శ్రీవిష్ణు హీరోగా నటించిన మెంటల్ మదిలో సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. చిత్రలహరి, బ్రోచేవారెవరురా సినిమాలతో విజయాల్ని అందుకున్నది. ఆ తర్వాత ఆమెకు సరైన విజయాలు దక్కలేదు. విశ్వక్‌సేన్‌తో పాగల్, దాస్ కా ధమ్కీ, రామ్‌తో రెడ్ సినిమాలు చేసింది.
ఓటీటీలో...
ఓటీటీలోనూ బ్లడ్ మేరీ, బూ సినిమాల్లో నటించింది. హిందీలో కాలా అనే వెబ్‌సిరీస్‌లో కనిపించింది. ధాస్ కా ధమ్కీ తర్వాత టాలీవుడ్‌కు దూరమైంది. దాదాపు ఏడాది తర్వాత పరువు వెబ్‌సిరీస్‌తో మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. తమిళంలో నివేతా పేతురాజ్ సంగతామిజన్, టిక్ టిక్ టిక్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేసింది.