Shehzada Day 1 Collection: తెలుగులో 85 కోట్లు - హిందీలో 7 కోట్లు - అలా వైకుంఠ‌పుర‌ములో రీమేక్‌కు షాకింగ్ క‌లెక్ష‌న్స్‌-kartik aaryan shehzada movie day 1 collection worldwide ala vaikunthapurramuloo vs shehzada
Telugu News  /  Entertainment  /  Kartik Aaryan Shehzada Movie Day 1 Collection Worldwide Ala Vaikunthapurramuloo Vs Shehzada
కార్తిక్ ఆర్య‌న్‌, కృతిస‌న‌న్
కార్తిక్ ఆర్య‌న్‌, కృతిస‌న‌న్

Shehzada Day 1 Collection: తెలుగులో 85 కోట్లు - హిందీలో 7 కోట్లు - అలా వైకుంఠ‌పుర‌ములో రీమేక్‌కు షాకింగ్ క‌లెక్ష‌న్స్‌

18 February 2023, 10:21 ISTNelki Naresh Kumar
18 February 2023, 10:21 IST

Shehzada Day 1 Collection: కార్తిక్ ఆర్య‌న్‌, కృతిస‌న‌న్ జంట‌గా న‌టించిన బాలీవుడ్ చిత్రం షెహ‌జాదా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అల వైకుంఠ‌పుర‌ములో మూవీకి రీమేక్‌గా తెర‌కెక్కిన షెహ‌జాదాకు ఫ‌స్ట్ డే వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఎంతంటే...

Shehzada Day 1 Collection: అల్లు అర్జున్ హీరోగా న‌టించిన అల వైకుంఠ‌పుర‌ములో సినిమా హిందీలో షెహ‌జాదా పేరుతో రీమేక్ అయిన సంగ‌తి తెలిసిందే. కార్తిక్ ఆర్య‌న్‌, కృతిస‌న‌న్ జంట‌గా న‌టించిన ఈ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. తొలిరోజు ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా కేవ‌లం ఏడు కోట్ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే రాబ‌ట్టింది.

మ‌ల్టీప్లెక్స్‌ల‌లో నేష‌న‌ల్ వైడ్‌గా 2.92 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు తెలిపాయి. అల వైకుంఠ‌పుర‌ములో సినిమా తొలిరోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా 85 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌డితే హిందీ రీమేక్‌ మాత్రం కేవ‌లం 7 కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకోవ‌డం హాట్‌టాపిక్‌గా మారింది.

రెండు సినిమాల క‌లెక్ష‌న్స్ కంపేర్ చేస్తూ నెటిజ‌న్లు చేస్తోన్న ట్వీట్స్ వైర‌ల్‌గా మారాయి. ద‌క్షిణాది సినిమాల‌కు బాలీవుడ్ పోటీ కాదంటూ చెబుతున్నారు. అయితే షెహ‌జాదా కార్తిక్ ఆర్య‌న్ కెరీర్‌లో తొలిరోజు అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఈ జాబితాలో భూల్ భూల‌య్య 14 కోట్ల‌తో తొలి స్థానంలో నిలిచింది.

షెహ‌జాదా సినిమాకు రోహిత్ ధావ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో హీరోగా న‌టిస్తూనే కో ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు కార్తిక్ ఆర్య‌న్‌. హిందీ రీమేక్‌లో అల్లు అర‌వింద్‌, ఎస్ రాధాకృష్ణ భాగ‌స్వాములుగా వ్య‌వ‌హ‌రించారు. కాగా 2020లో రిలీజైన అల వైకుంఠ‌పుర‌ములో సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ల‌లో ఒక‌టిగా నిలిచింది. 300 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.