Kriti Sanon: బోల్డ్ సీన్స్ వ‌ద్ద‌ని హీరోయిన్ త‌ల్లి కండీష‌న్స్ పెట్టింద‌న్న క‌ర‌ణ్ జోహార్‌-karan johar reveals the reason behind kriti sanon rejected of lust stories movie
Telugu News  /  Entertainment  /  Karan Johar Reveals The Reason Behind Kriti Sanon Rejected Of Lust Stories Movie
కృతిసనన్
కృతిసనన్ (instagram)

Kriti Sanon: బోల్డ్ సీన్స్ వ‌ద్ద‌ని హీరోయిన్ త‌ల్లి కండీష‌న్స్ పెట్టింద‌న్న క‌ర‌ణ్ జోహార్‌

26 August 2022, 12:59 ISTHT Telugu Desk
26 August 2022, 12:59 IST

తాను దర్శకత్వం వహించిన లస్ట్ స్టోరీస్ లో తొలుత కృతిసనన్ ను హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నానని అన్నాడు కరణ్ జోహార్. కానీ బోల్డ్ క్యారెక్టర్స్ చేయడం తన మదర్ కు నచ్చదంటూ కృతి ఈ ఆఫర్ ను తిరస్కరించిందని కరణ్ జోహార్ పేర్కొన్నాడు.

మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో కథానాయికగా పరిచయమైంది కృతిసనన్. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టిన ఆమె హీరో పంటి, లుకా చుప్పి, హౌస్ ఫుల్ 4 సినిమాలతో స్టార్ ఇమేజ్ ను దక్కించుకున్నది. గత ఏడాది విడుదలైన మిమి సినిమాలో సరోగసి విధానం వలన ఇబ్బందులు పడే యువతిగా యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్రలో కనిపించింది. కెరీర్ ఆరంభం నుండి హద్దులు దాటని అందాల ప్రదర్శనతో ముందుకు సాగుతోంది.

బాలీవుడ్ లో బోల్డ్ క్యారెక్టర్స్ తో కూడిన పాత్రలు వరించినా వాటిలో నటించడం ఇష్టం లేక తిరస్కరిస్తోంది. 2018లో అంథాలజీ సినిమాగా తెరకెక్కిన లస్ట్ స్టోరీస్ లో కరణ్ జోహార్ రూపొందిన షార్ట్ స్టోరీలో కృతిసనన్ హీరోయిన్ గా నటించాల్సింది. బోల్డ్ సీన్స్ తో కూడిన ఈ క్యారెక్టర్ లో కృతిసనన్ నటించడానికి ఆమె తల్లి అంగీకరించకపోవడంతో ఆ పాత్ర కియారా అద్వాణీని వరించిందట.

ఈ విషయాన్ని కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ జోహార్ వెల్లడించారు. వైవాహిక జీవితం పట్ల అసంతృప్తితో ఉండే ఓ యువతి క్యారెక్టర్ ను పోషించే హీరోయిన్ కోసం చాలా రోజుల పాటు వెతికానని కరణ్ అన్నాడు. కృతి సనన్ ను కలిసి ఈ కథను వినించానని కరణ్ జోహార్ చెప్పాడు. కానీ ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి మా అమ్మ అంగీకరించదని కృతి ఆ ఆఫర్ ను తిరస్కరించినట్లు తెలిపాడు. ఆ తర్వాత మనీష్ మల్హోత్రా ద్వారా కియారాను కలిశానని అన్నాడు.

తన క్యారెక్టర్ తో పాటు తాను డైరెక్ట్ చేస్తున్న విషయం తెలియగానే ఫస్ట్ మీటింగ్ లోనే కియారా ఈ సినిమాను అంగీకరించినట్లు కరణ్ జోహార్ చెప్పాడు. కాఫీ విత్ కరణ్ షో తాజా ఎపిసోడ్ లో షాహిద్ కపూర్, కియారా అద్వాణీ గెస్ట్ లుగా హాజరయ్యారు. కియారాతో తన ఫస్ట్ మీటింగ్ గురించి వెల్లడిస్తూ లస్ట్ స్టోరీస్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీని కరణ్ వెల్లడించాడు.