Vikram Highest Grossed Movie: అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా విక్రమ్.. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన కమల్ సినిమా-kamal haasan vikram finishes theatrical run as highest grossing film ever in tamil nadu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vikram Highest Grossed Movie: అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా విక్రమ్.. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన కమల్ సినిమా

Vikram Highest Grossed Movie: అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా విక్రమ్.. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన కమల్ సినిమా

HT Telugu Desk HT Telugu
Sep 22, 2022 12:18 PM IST

Vikram Highest grossed Movie: కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా అరుదైన ఘనత సాధించింది. తమిళ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇటీవలే వందరోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయ్యే సరికి రూ.500 కోట్లు వసూలు చేసింది.

<p>కమల్ హాసన్ విక్రమ్ చిత్రం</p>
కమల్ హాసన్ విక్రమ్ చిత్రం (PTI)

Vikram highest collections: లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా రోజుల తర్వాత కమల్ ఖాతాలో అదిరిపోయే హిట్ పడే సరికి ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా థియేటర్లలో వంద రోజులు పూర్తి చేసుకుంది. పలితంగా కమల్ కెరీర్‌లోనే కాదు.. తమిళ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా విక్రమ్ రికార్డు సృష్టించింది.

విక్రమ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్ల పైచిలుకు కలెక్షన్లతో రికార్డు బద్దలు కొట్టింది. ఇంత వరకు ఏ తమిళ సినిమా ఇంత భారీ వసూళ్లను సాధించలేదు. ఇప్పటికే తమిళనాడులో.. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 వసూళ్లను అధిగమించింది. థియేటర్లలో 113 రోజుల పాటు ఆడిన ఈ సినిమా కోలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లను సాధించిన తమిళ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.

ఈ ఏడాది జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్ సినిమా తొలి వారంలోనే రూ.164.75 కోట్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళంలోనూ విడుదలైన ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపించింది.

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్‌ ప్రధాన పాత్ర పోషించారు. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలో మెప్పించారు. చివర్లో సూర్య రోలెక్స్ అనే పాత్రలో కనిపించి అభిమానులను అలరించారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కమల్‌తో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ విక్రమ్‌కు సీక్వెల్ కూడా తెరకెక్కించే పనిలో పడ్డాడు. 2023లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశముంది. ఈ సినిమాలో కమల్ పాత్రను.. 1986లో ఆయన నటించిన విక్రమ్ సినిమాకు అనుసంధానం చేసి దర్శకుడు రాసుకున్న తీరు అమోఘం.

Whats_app_banner

సంబంధిత కథనం