Vikram sequel | విక్ర‌మ్ సీక్వెల్‌లో సూర్య‌, కార్తి?-kamal haasan suriya karthi to be join in vikram sequel ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vikram Sequel | విక్ర‌మ్ సీక్వెల్‌లో సూర్య‌, కార్తి?

Vikram sequel | విక్ర‌మ్ సీక్వెల్‌లో సూర్య‌, కార్తి?

HT Telugu Desk HT Telugu
Jun 03, 2022 04:50 PM IST

రియ‌ల్ లైఫ్ బ్ర‌ద‌ర్స్ సూర్య,కార్తి ల‌ను ఒకే ఫ్రేమ్‌లో ప్రేక్ష‌కులు చూడ‌బోతున్నారా? వారిద్ద‌రూక‌లిసి సినిమా చేయనున్నారా అంటే ఔన‌నే అంటున్నాయి కోలీవుడ్ వ‌ర్గాలు. క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన విక్ర‌మ్ సినిమా శుక్ర‌వారం(నేడు)ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్ లో విక్ర‌మ్ సీక్వెల్ ఉంటుంద‌ని లోకేష్ క‌న‌క‌రాజ్ ప్ర‌క‌టించారు. ఈ సీక్వెల్ సూర్య‌,కార్తితో పాటు క‌మ‌ల్‌హాస‌న్,ఫ‌హాద్ ఫాజిల్ న‌టించ‌నున్న‌ట్లుగా చూపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

సూర్య, కార్తి
సూర్య, కార్తి (twitter)

క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన విక్ర‌మ్ చిత్రం నేడు(శుక్ర‌వారం)ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.  త‌మిళంతో పాటు తెలుగులో ఈ సినిమా పాజిటివ్ మౌత్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. క‌మ‌ల్‌హాస‌న్‌తో పాటు సినిమాలో కీల‌క పాత్ర‌ల‌ను పోషించిన ఫ‌హాద్ ఫాజిల్‌, విజ‌య్ సేతుప‌తి న‌ట‌న‌కు మంచి పేరు ల‌భిస్తోంది. యాక్ష‌న్ ఎంటర్‌టైన‌ర్‌గా డిఫ‌రెంట్ స్ర్కీన్‌ప్లేతో లోకేష్ క‌న‌క‌రాజ్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. 

కార్తి హీరోగా రూపొందిన ఖైదీ సినిమా క‌థ‌, అందులోని పాత్ర‌ల‌ను కొన‌సాగిస్తూ విక్ర‌మ్ చిత్రాన్ని తెర‌కెక్కించారు లోకేష్ క‌న‌క‌రాజ్‌. విక్ర‌మ్ క్లైమాక్స్ లో హీరో సూర్య అతిథి పాత్ర‌లో క‌నిపించారు. రోలెక్స్ అనే నెగెటివ్ షేడ్స్ తో కూడిన  క్యారెక్టర్ లో ఐదు నిమిషాల పాటు త‌ళుక్కున మెరిసారు. అత‌డి పాత్ర నేప‌థ్యంలో వ‌చ్చే డైలాగ్స్ తో విక్ర‌మ్ సినిమాకు సీక్వెల్ ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ ప్ర‌క‌టించారు. సూర్య చెప్పిన డైలాగ్స్‌ను బ‌ట్టి చూస్తే సీక్వెల్‌లో సూర్య‌తో పాటు కార్తి, క‌మ‌ల్‌హాస‌న్‌, ఫ‌హాద్ ఫాజిల్ క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. 

విక్ర‌మ్ 3 పేరుతో ఈ సీక్వెల్ రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం. విక్ర‌మ్ ప్ర‌చార వేడుక‌ల్లో క‌మ‌ల్‌హాస‌న్ కూడా సీక్వెల్ ఉంటుంద‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. సూర్య‌, కార్తి ఇప్ప‌టివ‌ర‌కు క‌లిసి సినిమా చేయ‌లేదు. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే విక్ర‌మ్ సీక్వెల్ వారిద్ద‌రూ కలిసి న‌టించే తొలి సినిమా అవుతుంది. ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో ఈ సీక్వెల్ కు సంబంధించిన వార్త‌లు హాట్‌టాపిక్‌గా మారాయి. 

IPL_Entry_Point

సంబంధిత కథనం