Jawan@1000 Crores: జవాన్ బ్లాక్‌బస్టర్.. 1000 కోట్ల కలెక్షన్ల మార్క్ అందుకున్న మూవీ
Jawan@1000 Crores: జవాన్ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత అరుదైన రూ.1000 కోట్ల కలెక్షన్ల మార్క్ అందుకుంది. దీంతో ఒకే ఏడాది రూ.వెయ్యి కోట్ల సినిమాలు రెండు అందించిన తొలి హీరోగా షారుక్ ఖాన్ నిలిచాడు.
Jawan@1000 Crores: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. అతడు నటించిన లేటెస్ట్ మూవీ జవాన్ కూడా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల కలెక్షన్ల మార్క్ దాటింది. ఒకే ఏడాది ఇలా రూ. వెయ్యి కోట్ల కలెక్షన్ల మార్క్ దాటిన రెండు సినిమాలు అందించిన తొలి హీరోగా షారుక్ నిలిచాడు. జవాన్ 18వ రోజు ఈ ఘనత అందుకోవడం విశేషం.
జవాన్ రూ.వెయ్యి కోట్ల కలెక్షన్ల మార్క్ అందుకున్నట్లు సోమవారం (సెప్టెంబర్ 25) మూవీ మేకర్స్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా వెల్లడించింది. జవాన్ 18 రోజుల్లో మొత్తం రూ.1004.92 కోట్లు వసూలు చేయడం విశేషం. ఇందులో కేవలం ఇండియాలోనే ఈ సినిమా రూ.560 కోట్లకుపైగా వసూలు చేసింది.
అట్లీ కుమార్ డైరెక్ట్ చేసిన జవాన్ మూవీ తొలి రోజు నుంచే సంచలనాలు క్రియేట్ చేయడం మొదలుపెట్టింది. ఈ ఏడాది జనవరిలో రిలీజైన షారుక్ ఖాన్ మూవీ పఠాన్ కూడా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకుపైగా వసూలు చేసిన విషయం తెలిసిందే. నాలుగేళ్ల తర్వాత ఈ ఏడాది పఠాన్ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన షారుక్.. తాను బాక్సీఫీస్ సుల్తాన్ అని మరోసారి నిరూపించుకున్నాడు.
జవాన్ మూవీలో షారుక్ సరసన నయనతార నటించింది. దీపికా పదుకోన్, ప్రియమణి, సాన్యా మల్హోత్రాలాంటి వాళ్లు కూడా ఈ సినిమాలో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. షారుక్ సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ ఈ సినిమాను తెరకెక్కించింది.
షారుఖ్‌ఖాన్ వన్ మెన్ షోగా జవాన్ సినిమా నిలిచింది. విక్రమ్ రాథోడ్‌గా, ఆజాద్‌గా డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో చెలరేగిపోయాడు. కామెడీ టైమింగ్, యాక్షన్, ఎమోషన్స్ అన్నింటిలో తన మార్కును చూపించాడు.
యాక్షన్ ప్రధాన పాత్రలో నయనతార ఇంటెన్స్ యాక్టింగ్ తో మెప్పించింది. దీపికా పడుకోణ్, సంజయ్‌దత్ పాత్రల నిడివి తక్కువే అయినా ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తాయి. విలన్‌గా విజయ్ సేతుపతి లుక్ కొత్తగా ఉంది. షారుఖ్‌కు ధీటుగా నటించాడు.
షారుఖ్‌ఖాన్ అభిమానులతో పాటు యాక్షన్ లవర్స్ కు జవాన్ సినిమా విందుభోజనంలా ఉంటుంది. లాజిక్స్ పక్కనపెట్టి మంచి కమర్షియల్ సినిమా చూడాలనుకుంటే జవాన్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు.