Hardik Pandya ex-wife: సింగర్‌తో హార్దిక్ పాండ్య డేటింగ్.. మళ్లీ ముంబయికి వచ్చేసిన మాజీ భార్య నటాషా
Natasa Stankovik: సెర్బియా నటి నటాషాతో విడాకులు తీసుకున్న తర్వాత యూకేకు చెందిన జాస్మిన్ వాలియాతో హార్దిక్ పాండ్య డేటింగ్ చేస్తున్నాడు. మరోవైపు ఇటీవల సెర్బియాకి వెళ్లిన నటాషా మళ్లీ ముంబయికి తిరిగొచ్చేసింది.
Hardik Pandya ex wife Natasa Stankovik: భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో విడాకుల తర్వాత తన స్వదేశం సెర్బియాకి వెళ్లిపోయిన నటి, మోడల్ నటాషా స్టాంకోవిచ్ నెల రోజుల వ్యవధిలోనే మళ్లీ భారత్‌కి వచ్చేసింది. మనస్పర్థల కారణంగా హార్దిక్‌తో గత జూలైలో నటాషా విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కొడుకు అగస్త్యతో కలిసి సెర్బియాకు వెళ్లిపోయిన నటాషా అక్కడే అతని 4వ పుట్టిన రోజు వేడుకులు కూడా చేసినట్లు సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది.
విడాకుల తర్వాత రోజుల వ్యవధిలోనే హార్దిక్ పాండ్య.. బ్రిటీష్ సింగర్, టెలివిజన్ పర్సనాలిటీ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్ వినిపించాయి. ఇద్దరూ కలిసి గ్రీస్‌కి హాలిడేకి వెళ్లినట్లు వాళ్లు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లను బట్టి అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ ముంబయికి నటాషా తిరిగిరావడం ఆసక్తిగా మారింది. అయితే కొడుకుతో కలిసి వచ్చిందా లేదా ఒంటరిగా వచ్చిందా అనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు.
నటాషా, హార్దిక్ విడాకులు
నటాషా, హార్దిక్ పాండ్య 2020 మే 31న వివాహం చేసుకోగా.. వారికి అదే ఏడాదిలో అగస్త్య పుట్టాడు. అయితే వివాహమైన కొన్నాళ్లకే వీరి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. నటాషాతో కలిసి ఉన్న ఫొటోలను హార్దిక్ పాండ్య డిలీట్ చేయడంతో ఈ రూమర్స్‌కి బలం చేకూరింది. అయితే.. ఎట్టకేలకి ‘‘తాము విడిపోవాలని పరస్పరం నిర్ణయించుకున్నాము’’ అంటూ ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
“నటాషా నేను దాదాపు 4 ఏళ్లు కలిసి ఉన్న తర్వాత ఇప్పుడు విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మనస్పర్థలు వచ్చిన తర్వాత కూడా కలిసి ఉండేందుకు చాలా ప్రయత్నించాం. కానీ కుదరలేదు. అందుకే విడిపోతేనే మంచిదని ఓ నిర్ణయానికి వచ్చాం. ఒక బిడ్డకు తల్లిదండ్రులుగా ఈ నిర్ణయం తీసుకోవడం కష్టంగానే ఉంది. కో-పేరెంట్స్‌గా మేము చేయాల్సిందంతా అగస్త్యకి చేస్తాం’’అని హార్దిక్ పాండ్య సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.
ఈ ఏడాది ఐపీఎల్ 2024లో తీవ్ర విమర్శలను హార్దిక్ పాండ్య ఎదుర్కొన్నాడు. ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా విఫలమైన హార్దిక్.. బ్యాటర్, బౌలర్‌గా కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దానికి తోడు రోహిత్ శర్మ ప్లేస్‌లో హార్దిక్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడాన్ని ముంబయి ఇండియన్స్ అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు. దాంతో సీజన్ సాంతం హార్దిక్‌ను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు గుప్పిస్తూనే వచ్చారు.
ఐపీఎల్ 2024లో ఫెయిలైనా.. ఆ తర్వాత జరిగిన టీ20 వరల్డ్‌కప్-2024లో హార్దిక్ పాండ్య అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. ఫైనల్ మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమిస్తూ భారత్ జట్టుని విజేతగా నిలపడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. దాంతో హార్దిక్‌పై విమర్శల వేడి తగ్గింది. ప్రస్తుతం భారత్ జట్టు మ్యాచ్‌లు ఏవీ లేకపోవడంతో హార్దిక్ పాండ్య రిలాక్స్ అవుతున్నాడు.