Hardik Pandya Girlfriend: మళ్లీ ప్రేమలో పడిన హార్దిక్ పాండ్యా.. ఆమె ఎవరో కనిపెట్టిన నెటిజన్లు
Hardik Pandya Girlfriend: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్లీ ప్రేమలో పడ్డాడా? నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న రెండు ఫొటోలు చూపిస్తూ.. ఓ బ్రిటీష్ సింగర్ తో అతడు డేటింగ్ చేస్తున్నట్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
Hardik Pandya Girlfriend: హార్దిక్ పాండ్యా అప్పుడే మరోసారి డేటింగ్ మొదలుపెట్టాడు. నటి, మోడల్ నటాషా స్టాంకోవిచ్ తో విడిపోతున్నట్లు గత నెలలో అతడు చెప్పిన విషయం తెలుసు కదా. అయితే ఇప్పుడతడు జాస్మిన్ వాలియా అనే అమ్మాయితో రొమాన్స్ చేస్తున్నాడని రెడిట్ యూజర్లు అభిప్రాయపడుతున్నారు. వీరిద్దరూ కలిసి విహారయాత్రకు వెళ్తున్నట్లు పేర్కొంటూ గ్రీస్ లోని ఒకే ప్రాంతానికి చెందిన వేర్వేరు ఫొటోలను కూడా పలువురు పోస్ట్ చేశారు.
ఎవరీ జాస్మిన్ వాలియా?
హార్దిక్ పాండ్యా డేటింగ్ చేస్తున్న జాస్మిన్ వాలియా ఎవరు అన్న ఆసక్తి అతని అభిమానుల్లో కనిపిస్తోంది. బ్రిటీష్ సింగర్, టెలివిజన్ పర్సనాలిటీ అయిన జాస్మిన్.. ఇంగ్లీష్, పంజాబీ, హిందీ భాషల్లో పాటలను రిలీజ్ చేసింది. ఆమె మొదట ది ఓన్లీ వే ఈజ్ ఎసెక్స్ (2010) అనే రియాలిటీ టీవీ సిరీస్ లో నటించింది. ఇక ఫిబ్రవరి, 2014లో ఒక యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది.
జాస్మిన్ వాలియా దేశీ రాస్కెల్స్ 2 (2015)లో కనిపించింది. ఇందులో ఆమె అప్పటి ప్రియుడు రాస్ వర్స్విక్ కూడా నటించాడు. జాస్మిన్ తన మొదటి సింగిల్, దమ్ డీ డీ దమ్ ను 2016లో జాక్ నైట్ సహకారంతో విడుదల చేసింది. ఆమె రెండో సింగిల్ గర్ల్ లైక్ మీ 2016లో తన యూట్యూబ్ ఛానెల్లో విడుదలైంది. 2017లో ఆమె తన మూడవ పాట టెంపుల్ ను రిలీజ్ చేసింది. 2018లో వచ్చిన సోనూ కే టీటు కీ స్వీటీ చిత్రంలోని బోమ్ డిగ్గీ పాటతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది.
నెటిజన్లు ఏమంటున్నారంటే?
'హార్దిక్ పాండ్యా కొత్త లవర్?' అనే క్యాప్షన్ తో ఓ పోస్ట్ ను ఓ యూజర్ షేర్ చేశారు. 'హార్దిక్ ఇప్పుడు జాస్మిన్ వాలియాతో ప్రేమాయణం సాగిస్తున్నాడా? జాస్మిన్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లు చూస్తుంటే, నేను కచ్చితంగా అదే విషయాన్ని నమ్ముతున్నాను. శ్రీలంక సిరీస్ తర్వాత వీరిద్దరూ కలిసి గ్రీస్ లో హాలిడే ట్రిప్ కు వెళ్లారు. జాస్మిన్ ఇన్‌స్టాలో చేసిన వరుస పోస్టులను హార్దిక్ లైక్ చేయడంతో ఇది మొదలైంది' అని మరో యూజర్ అనడం విశేషం.
'భారత్-శ్రీలంక సిరీస్ సందర్భంగా ఆమె శ్రీలంకలో ఉండటం నేను చూశాను. ప్రతి మ్యాచ్ కు ఆమె స్టేడియంలోనే ఉంది. హార్దిక్ పచ్చబొట్టును పోలిన టాటూ ఉన్న చేతి చిత్రాలను ఆమె పోస్ట్ చేసింది. ఆ తర్వాత విడివిడిగా ఇద్దరూ గ్రీస్ నుంచి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు' అని మరో యూజర్ అన్నారు.
పెళ్లి చేసుకొని నాలుగేళ్లుగా కలిసి ఉన్న హార్దిక్ పాండ్యా, నటాషా గత నెలలో విడిపోయిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరికీ ఓ బాబు అగస్త్య కూడా ఉన్నాడు. కొన్నాళ్ల పాటు నటాషాతో డేటింగ్ చేసిన హార్దిక్.. 2020లో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెకు విడాకులు ఇచ్చిన నెల రోజుల్లోనే మరో అమ్మాయితో డేటింగ్ మొదలుపెట్టడం విశేషం.