Indian 2 Box Office Day 9: వావ్.. పెరిగిన ఇండియన్ 2 కలెక్షన్స్.. నిర్మాతలకు ఊరట.. వంద కోట్ల వైపుగా మూవీ
Indian 2 Worldwide Box Office Collection Day 9: కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 సినిమాకు 9వ రోజున వసూళ్లు పెరిగాయి. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న ఈ వసూళ్లు 9వ రోజు పెరిగాయి. దీంతో ఈ చిత్రం నెమ్మదిగా భారతదేశంలో రూ .100 కోట్ల క్లబ్ వైపుకు పయనిస్తోంది.
Indian 2 9 Days Box Office Collection: 1996లో వచ్చిన 'భారతీయుడు' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఇండియన్ 2 మూవీకి కలెక్షన్స్ కాస్తా ఊరటనిచ్చాయి. బాక్సాఫీస్ వద్ద ఇండియన్ 2 కలెక్షన్లు రెండో శనివారం పెరిగాయి. గత రెండు మూడు రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్న ఈ కలెక్షన్స్ 9వ రోజు పెరగడం నిర్మాతలకు ఊరటనిచ్చినట్లే అని చెప్పుకోవచ్చు.
ట్రేడ్ వర్గాల ప్రకారం భారతీయుడు 2 సినిమాకు 9వ రోజున ఇండియాలో రూ. 2 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అయితే, సినిమాకు 8వ రోజున రూ. 1.3 కోట్లు, 7వ రోజున రూ. 1.95 కలెక్షన్స్ వచ్చాయి. ఈ రెండు రోజులతో పోలిస్తే 9వ రోజు 2 కోట్లతో మెరుగైన వసూళ్లు సాధించింది భారతీయుడు 2 మూవీ. కానీ, ఆరో రోజున మాత్రం ఇండియన్ 2 సినిమాకు రూ. 3.3 కోట్లు వచ్చాయి. దాంతో పోల్చుకుంటే ఈ డే 9 కలెక్షన్స్ 1.3 కోట్లు తక్కువే.
ఇక ఇండియన్ 2 సినిమా భారతదేశంలో ఇప్పటివరకు అంటే 9 రోజుల్లో రూ. 73.70 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. అంటే, ఇండియాలో వంద కోట్ల క్లబ్ వైపుకు పయనిస్తోంది భారతీయుడు 2 సినిమా. జూలై 12న విడుదలైన ఇండియన్ 2కు మిశ్రమ స్పందన వచ్చింది. దాంతో సినిమాపై కలెక్షన్ల ప్రభావం చాలా గట్టిగా పడింది. దాంతో కలెక్షన్స్ చాలా తక్కువగా నమోదు అవుతూ వచ్చాయి.
ఇండియన్ 2 సినిమాకు మొదటి వారం వసూళ్లు రూ. 70.4 కోట్లు వచ్చాయి. వాటిలో తమిళం నుంచి రూ.48.7 కోట్లు, హిందీ వెర్షన్‌కు రూ. 5.4 కోట్లు, తెలుగులో రూ. 16.3 కోట్లుగా వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా 8వ రోజున వచ్చిన రూ.1.3 కోట్ల వసూళ్లలో తమిళం రూ.92 లక్షలు, హిందీ రూ. 3 లక్షలు, తెలుగు రూ.35 లక్షలుగా ఉన్నాయి. తొమ్మిదో రోజు ఇండియన్ 2 అన్ని భాషలకు కలిపి ఇండియాలో రూ. 2 కోట్లు రాబట్టింది.
ఇక వరల్డ్ వైడ్‌గా ఇండియన్ 2 చిత్రానికి 9 డేస్‌లో సుమారుగా రూ. 150 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, భారతీయుడు 2 సినిమాలో కమల్ హాసన్ ఎప్పటిలాగే తన స్ట్రాంగ్ పర్ఫామెన్స్ ఇచ్చాడని, కానీ, ఆయన పాత్ర కంటే సిద్ధార్థ్ రోల్ చాలా బాగుందని ప్రశంసలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో వీళ్లద్దరితోపాటు రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఆర్జే సూర్య, బాబీ సింహా ఇతరులు కీలక పాత్రలు పోషించారు.
అయితే, వీళ్లలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్‌లకు స్క్రీన్ టైమ్ పెద్దగా లేకపోయినా కొన్ని ఇంపాక్టివ్ డైలాగులు ఉన్నాయని రివ్యూలు వచ్చాయి. కాగా ఇటీవల 'భారతీయుడు 2' రన్ టైంను 12 నిమిషాలు తగ్గించి రిలీజ్ చేశారు.