Ileana boyfriend: ఇలియానా బిడ్డకు తండ్రి ఇతడే.. ఫైనల్‌గా తన బాయ్‌ఫ్రెండ్‌ను రివీల్ చేసిన గోవా బ్యూటీ
Ileana boyfriend: ఇలియానా బిడ్డకు తండ్రి ఇతడే. ఫైనల్‌గా తన బాయ్‌ఫ్రెండ్‌ను రివీల్ చేసిందీ గోవా బ్యూటీ. ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయిన ఇల్లీ బేబీ.. చాలా రోజులుగా కనిపించీ కనిపించనట్లుగా తన బాయ్‌ఫ్రెండ్ ఫొటోలను షేర్ చేస్తూ వస్తోంది.
Ileana boyfriend: టాలీవుడ్, బాలీవుడ్ నటి ఇలియానా తన బాయ్‌ఫ్రెండ్ ఎవరో రివీల్ చేసింది. తన ప్రెగ్నెన్సీ అనౌన్స్‌మెంట్ నుంచీ అతని గురించి టీజ్ చేస్తూ వచ్చినా.. ఎప్పుడూ స్పష్టమైన ఫొటోను షేర్ చేయలేదు. గత నెలలో బ్లర్‌గా ఉన్న ఓ ఫొటోను, ఆ తర్వాత అతని చేతిలో చేయి వేసి ఉన్న ఫొటో, ఈ మధ్యే తమ పెంపుడు కుక్కతో అతడు ఆడుకుంటున్న ఫొటోలను ఆమె షేర్ చేసింది.
ఈ ఫొటోల్లో అతడు ఎవరన్నది తెలియలేదు. అయితే తాజాగా సోమవారం (జులై 17) ఇల్లీ బేబీ అతని ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో రివీల్ చేసింది. తన బాయ్‌ఫ్రెండ్ తో డేట్ నైట్ ఫొటో అంటూ ఇలియానా దీనిని షేర్ చేసుకుంది. ఇన్నాళ్లూ తమకు కనిపించీ కనిపించనట్లుగా ఉన్న ఆ వ్యక్తి ఇతడే అని ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు. ఇలియానా బిడ్డకు తండ్రి ఇతడే అని తేలిపోయింది.
ఇలియానా పార్ట్‌నర్ పేరు ఏంటన్నది మాత్రం తెలియలేదు. ఈ ఏడాది ఏప్రిల్ లో తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన ఈ గోవా బ్యూటీ.. అప్పటి నుంచీ అప్పుడప్పుడూ తన బేబీ బంప్ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ వస్తోంది. తన ప్రెగ్నెన్సీ అనౌన్స్‌మెంట్ సందర్భంగా ఆమె ఓ పెద్ద నోట్ కూడా రాసింది. తన జీవితంలో తాను మాతృత్వపు ఆనందాన్ని పొందుతానని అనుకోలేదని, ఇప్పుడా కల నెరవేరడంతో తానెంతో అదృష్టవంతురాలినని భావిస్తున్నట్లు చెప్పింది.
ఇలియానా గతేడాది కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అతనితోపాటు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తో కలిసి ఇలియానా మాల్దీవ్స్ టూర్ కు కూడా వెళ్లింది. ఆ ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే తాము రిలేషన్‌షిప్ లో ఉన్నట్లు ఇటు ఇలియానా కానీ, అటు సెబాస్టియన్ గానీ ఎప్పుడూ చెప్పలేదు.