Ileana D’Cruz Son: ‘అప్పుడే రెండు నెలలైంది’: సంతోషంతో ఫొటో షేర్ చేసిన ఇలియానా
Ileana D’Cruz Son: హీరోయిన్ ఇలియానా తన కుమారుడితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. అప్పుడే రెండు నెలలైందంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఆ వివరాలివే.
Ileana D’Cruz Son: స్టార్ హీరోయిన్ ఇలియానా మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. రెండు నెలల క్రితం మగబిడ్డకు ఆమె జన్మనిచ్చారు. తన ప్రెగ్నెన్సీ గురించి ఈ ఏడాది ఏప్రిల్‌లో సోషల్ మీడియాలో ఇలియానా వెల్లడించాడు. తాను గర్భంతో ఉన్న ఫొటోలను చాలాసార్లు పోస్ట్ చేశారు. తన పార్ట్నర్ ఎవరో చెప్పకుండా చాలా కాలం అలాగే ఉన్నారు ఇలియానా. అయితే, కొన్నాళ్ల తన బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. తాను కష్టకాలంలో ఉన్న సమయంలో అతడు తోడుగా నిలిచాడని సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. అనంతరం కూడా కొన్ని ఫొటోలను షేర్ చేశారు. ఆ తర్వాత, ఆగస్టు 1వ తేదీన మగబిడ్డకు ఆమె జన్మనిచ్చారు.
ఇలియానా కుమారుడు కొయా ఫొనిక్స్ డోలాన్కు నేటితో (అక్టోబర్ 1) రెండు నెలలు నిండాయి. ఈ సందర్భంగా తన కుమారుడితో దిగిన ఫొటోను ఇలియానా షేర్ చేశారు. తన భుజంపై కుమారుడు సేద తీరుతుండగా.. ఆమె సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలియానా షేర్ చేశారు. తన కుమారుడి ముఖాన్ని చూపించారు. “అప్పుడే రెండు నెలలు అయింది” అని ఇలియానా ఈ ఫొటోకు క్యాప్షన్ పెట్టారు.
మగ బిడ్డ కొయా ఫొనిక్స్ డోలాన్కు ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన ఇలియానా జన్మనిచ్చారు. అయితే, ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా ఆగస్టు 5న పంచుకున్నారు. డోలాన్ను పరిచయం చేస్తున్నానంటూ ఫొటోను షేర్ చేశారు. “ఈ ప్రపంచంలోకి మా డార్లింగ్ బాయ్‌ను ఆహ్వానించడం పట్ల ఎంత సంతోషంగా ఉన్నామో వివరించేందుకు ఏ మాటలు కూడా సరిపోవు” అని ఇలియానా అప్పట్లో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు డోలాన్ను రెండు నెలలు నిండటంతో మరో ఫొటోను పంచుకున్నారు.
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన ఇలియానా.. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లారు. పదేళ్లుగా ఎక్కువగా బాలీవుడ్ సినిమాలే చేస్తున్నారు. ఇలియానా తదుపరి విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓ చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఇంకా అఫీషియల్ టైటిల్ పెట్టలేదు మేకర్స్. అయితే, లవర్స్ అనే టైటిల్ ఉంటుందని టాక్ వస్తోంది.