Mahesh Babu Birthday: క్లాస్ లుక్స్.. మాస్‌కు కేరాఫ్ అడ్రెస్.. మన మహేశ్-here the unknown facts of superstar mahesh babu on his birthday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Here The Unknown Facts Of Superstar Mahesh Babu On His Birthday

Mahesh Babu Birthday: క్లాస్ లుక్స్.. మాస్‌కు కేరాఫ్ అడ్రెస్.. మన మహేశ్

Maragani Govardhan HT Telugu
Aug 09, 2022 10:28 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు నేడు. 1975 ఆగస్టు 9న జన్మించిన ఆయన.. నేటితో 47 ఏళ్లు పూర్తి చేసుకుని 48వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు చూద్దాం.

మహేశ్ బాబు
మహేశ్ బాబు (Twitter)

చూసేందుకు క్లాస్‌లా కనిపిస్తూ.. మాస్ డైలాగులను అవలీలగా చెప్పే హీరో ఎవరైనా ఉన్నారా? అంటే కళ్లు మూసుకుని మహేశ్ బాబు(Mahesh Babu) పేరు చెప్పేస్తారు. అందానికి కెరాఫ్ అడ్రెస్‌గా మారిన సూపర్ స్టార్‌ అమ్మాయిలకు కలల రాకుమారుడు. అబ్బాయిలకు ఇన్స్పిరేషన్. రీల్ లైఫ్‌లో పాటలు, ఫైట్లతో పాటు రియల్ లైఫ్‌లోనూ తనదైన శైలిలో సామాజిక సేవ చేస్తూ ఆకట్టుకుంటున్న హీరో. తన సంపాదన 30 శాతం సమాజ సేవకు వెచ్చిస్తున్న ఏకైక హీరో మన సూపర్‌స్టార్. ఈ రోజు మహేశ్ పుట్టిన రోజు. 47 ఏళ్లు పూర్తి చేసుకుని 48వ పడిలోకి అడుగుపెడుతున్న మహేశ్ బాబు గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం.

- టాలీవుడ్ హీరోల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వారిలో మహేశ్ ముందు వరుసలో ఉంటారు. ఒక్కో సినిమాకు రూ.65 కోట్ల వరకు తీసుకుంటారని ఫిల్మ్ వర్గాల సమాచారం. అయితే ఇటీవలే ఆయన తన రెమ్యూనరేషన్‌ను పెంచారు. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ.80 కోట్ల వరకు తీసుకుంటున్నారట. ఇవి కాకుండా ఇతర ప్రకటనల ద్వారాగా అత్యధికంగా ఆర్జిస్తున్న తెలుగు హీరోల్లో సూపర్ స్టార్ ముందువరుసలో ఉంటారు. అయితే తన సంపాదనలో 30 శాతం వరకు సమాజ సేవకు వెచ్చిస్తున్నారు మన ప్రిన్స్.

- అత్యంత క్రమశిక్షణగా ఉండే మహేశ్ బాబు.. షూటింగ్స్‌కు ఆలస్యంగా వెళ్లడాన్ని అస్సలు ఇష్టపడరు. అందుకే తన చిత్రాల చిత్రీకరణ కోసం తనకంటూ ప్రత్యేకంగా ఓ క్యారేవ్యాన్(Vanity Van). దీన్ని రూ.6 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. ఇందులో అన్నీ లగ్జరీ సదుపాయాలు ఉన్నాయి. బాత్రూం, టీవీ, స్టైలిష్ సిట్టింగ్ ఏరియా, కిచెన్ తదితర సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.

- కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే మహేశ్ బాబు.. ఏ మాత్రం ఖాళీ దొరికినా సరే ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్తుంటారు. లేకుంటే ఇంట్లోనే ఉండి వారితో సమయాన్ని గడిపేస్తుంటారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఏరియాలో ఆయన ఇల్లు ఉంది. ఆయన హౌస్‌లో సకల సౌకర్యాలు, విలసావంతమైన సదుపాయాలు ఉన్నాయి. ఇంట్లోనే ప్రత్యేకంగా జిమ్, మినీ థియేటర్, ఇండోర్ స్విమ్మింగ్ పూల్, మల్టిపుల్ బెడ్రూమ్స్‌తో కూడిన అందమైన బ్యాక్ యార్డ్ ఉన్నాయి. ఇది కాకుండా బెంగళూరులోనూ ఆయనకు కోట్ల విలువ చేసే ఇల్లు ఉంది.

- మహేశ్ బాబుకు లగ్జరీ కార్లంటే అమితమైన ఇష్టం. ఫిల్మ్ వర్గాల సమచారం ప్రకారం ఆయన వద్ద బీఎండబ్ల్యూ 730ఎల్‌డీ, మెర్సెడెస్ జీఎల్ క్లాస్, రూ.2.26 కోట్లు విలువ చేసే రేంజ్ రోవర్ వోగ్, రూ.1.19 కోట్లు విలువ చేసే ఆడీ ఈ-ట్రాన్ ఎలక్ట్రిక్ కారు కూడా ఉంది.

- మహేశ్ బాబు గొప్ప మానవతా వాది. ఆయన తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బుర్రిపాలెం, తెలంగాణలో సిద్ధాపురం అనే గ్రామాలను దత్తత తీసుకుని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. బుర్రిపాలెం గ్రామం మహేశ్ బాబు తండ్రి కృష్ణ పుట్టిన సొంతూరు.

- మహేశ్ తెలుగు ఎంత బాగా మాట్లాడతారో, ఎంత బాగా డైలాగులు చెబుతారో మనందరికీ తెలుసు. కానీ ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఆయనకు తెలుగు చదవడం, రాయడం రాదు. చెన్నైలో పుట్టి పెరగడం వల్ల తెలుగు చదవడం, రాయం ఆయనకు రాదు. తెలుగు అర్థం చేసుకుని, స్పష్టంగా మాట్లాడగలుగుతారు. సినిమాల్లో కూడా స్క్రిప్టు, డైలాగులు చదవలేరు. అసిస్టెంట్ డైరెక్టర్లు చెప్పిన డైలాగులను గుర్తు పెట్టుకుని వాటిని తనదైన శైలిలో అదరగొడతారు.

- కొన్ని నివేదికల ప్రకారం మహేశ్ బాబు ఏడాదికి సంపాదించే ఆదాయం(Net Income) వచ్చేసి 32 మిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో దీని విలువ రూ.254 కోట్లు.

ఈ రోజు మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా సెలబ్రెటీలు కూడా సామాజిక మాధ్యమాల వేదికగా విషెస్ చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా ప్రిన్స్‌కు శుభాకాంక్షలు చెప్పారు. "ఎందరో చిన్నారులకు, గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేశ్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తిని, సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకంటూ మహేశ్ నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు." అని చిరు పోస్ట్ పెట్టారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్