Harom Hara Teaser: సుధీర్ బాబు మాస్ అవతార్.. ప్రభాస్ రిలీజ్ చేసిన హరోం హర టీజర్-harom hara teaser launched by prabhas today november 27th sudheer babu in mass avatar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Harom Hara Teaser Launched By Prabhas Today November 27th Sudheer Babu In Mass Avatar

Harom Hara Teaser: సుధీర్ బాబు మాస్ అవతార్.. ప్రభాస్ రిలీజ్ చేసిన హరోం హర టీజర్

Hari Prasad S HT Telugu
Nov 27, 2023 03:43 PM IST

Harom Hara Teaser: సుధీర్ బాబు మాస్ అవతారంలో కనిపిస్తున్న హరోం హర టీజర్ సోమవారం (నవంబర్ 27) రిలీజైంది. రెబల్ స్టార్ ప్రభాస్ ఈ టీజర్ రిలీజ్ చేయడం విశేషం.

హరోమ్ హర టీజర్ లో సుధీర్ బాబు
హరోమ్ హర టీజర్ లో సుధీర్ బాబు

Harom Hara Teaser: సుధీర్ బాబు నటిస్తున్న హరోం హర మూవీ టీజర్ సోమవారం (నవంబర్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అతని తొలి పాన్ ఇండియా మూవీ అయిన ఈ సినిమాలో సుధీర్ పక్కా మాస్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. టీజర్ కూడా ఎంతో ఆసక్తి రేపేలా ఉంది. అతని మేకోవర్, డైలాగ్ డెలివరీ ఈ సినిమా కోసం పూర్తిగా మారిపోయాయి.

ట్రెండింగ్ వార్తలు

ఈ పాన్ ఇండియా సినిమా టీజర్ ను తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేయగా.. మలయాళంలో మమ్ముట్టి, హిందీలో టైగర్ ష్రాఫ్, తమిళంలో విజయ్ సేతుపతి, కన్నడలో కిచ్చా సుదీప్ రిలీజ్ చేయడం విశేషం. పక్కా మాస్ ఎలిమెంట్స్ తో టీజర్ కొత్తగా ఉంది. సుధీర్ బాబును ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా మాస్ అవతార్ లో చూపించారు.

పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ ఆకట్టుకుంటున్నాయి. ఓ క్లాస్ గా ఉండే వ్యక్తి మాస్ గా మారిపోయి గన్ను, కత్తి పట్టుకొని ఊచకోత కోయడం ఈ టీజర్ లో చూడొచ్చు. అందరూ పవర్ కోసం గన్ను పట్టుకుంటారు.. కానీ ఇది మాత్రం యాడాడో తిరిగి నన్ను పట్టుకుంది అనే సుధీర్ డైలాగ్ బాగుంది. "భయపడితే సింగాన్ని కూడా సేద్యానికి వాడుకుంటారు.. అది భయపెడితేనే అడవి రాజని ఒళ్లు దగ్గర పెట్టుకుంటారు" అనే మరో పవర్ ఫుల్ డైలాగ్ కూడా ఈ టీజర్ లో ఉంది.

ఈ సినిమాలో సుధీర్ సరసన మాళవిక శర్మ నటిస్తోంది. మంచి నడుచుకోవాలనుకునే హీరోని ఈ కాలంలో మంచిగా ఉంటే ముంచేస్తారని చెప్పి కత్తి పట్టేలా చేస్తుంది హీరోయిన్ పాత్ర. మొత్తంగా టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటడానికి సుధీర్ బాబు ఓ మాస్ కథను ఎంపిక చేసుకోవడం విశేషం.

ఈ హరోం హర సినిమాను జ్ఞానశేఖర్ ద్వారక డైరెక్ట్ చేశాడు. కథ కూడా అతనిదే. ముఖ్యంగా ఈ టీజర్ లోని డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు. వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందించాడు. సుమంత్ జీ నాయుడు ఈ సినిమాను నిర్మించాడు.

WhatsApp channel

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.