Balagam: ప్రభాస్ మాత్రమే కాదు 70 ఏళ్ల వ్యక్తి అయినా ఓకే.. బలగం నటి రూప లక్ష్మీ కామెంట్స్
Roopa Lakshmi About Prabhas: బలగం సినిమాతో ఎంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు సీనియర్ నటి రూప లక్ష్మీ. అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌పై రూప లక్ష్మీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Balagam Actress VS Roopa Lakshmi: తెలుగు చిత్ర పరిశ్రమలో బలగం సినిమా ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసుకుందో తెలిసిందే. మార్చి 3న విడుదలైన ఈ సినిమాకు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కూడా థియేటర్లలో వీక్షించారు ప్రేక్షకులు. కుటుంబ పెద్ద దిక్కు, దశ దిన కర్మ, కుటుంబ విలువలు, తెలంగాణ గ్రామీణ ప్రాంత కథతో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రజలు నీరాజనం పట్టారు.
ప్రభాస్‌పై కామెంట్స్
జబర్దస్త్ కమెడయిన్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని ప్రతి ఒక్కరి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందులో కొమురయ్య కూతురిగా, హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్‌కు తల్లిగా రూప లక్ష్మీ చక్కటి నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా తండ్రి చనిపోయినప్పుడు ఆమె పండించిన ఎమోషన్ అందరిని కన్నీళ్లు పెట్టించింది. ఇదిలా ఉంటే సినిమా ప్రమోషన్స్ సమయంలో ప్రభాస్‌పై రూప లక్ష్మీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
నాకు సమస్య లేదు
"చిన్న వయసులోనే తల్లి పాత్రను పోషించారు కదా. రేపు ప్రభాస్ వంటి స్టార్ హీరోలకు తల్లిగా చేయమని అడిగితే ఏం చేస్తారు" అని రూపలక్ష్మీని యాంకర్ ప్రశ్నించారు. "మహిళ జీవితంలో సంతృప్తిగా ఉండేది ఏదంటే అమ్మ స్థానం. కాబట్టి అలాంటి పాత్రలు వస్తే నటించడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. ప్రభాస్ అనే కాదు 70 ఏళ్ల వ్యక్తికి కూడా అమ్మగా నటించమంటే నటిస్తా. నాకు ఎలాంటి సమస్య లేదు. స్టార్ హీరోలకు అమ్మ పాత్రలో నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు" అని రూపలక్ష్మీ తెలిపారు.
హీరోలకు తల్లిగా
కాగా ఎంతోకాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రూప లక్ష్మీ. నీది నాది ఒకే కథ సినిమాలో హీరో శ్రీవిష్ణుకు తల్లిగా నటించి ఆకట్టుకున్నారు. అలాగే జాంబీ రెడ్డి, సరిలేరు నీకెవ్వరు, మహర్షి, నర్తన శాల, టెన్త్ క్లాస్ డైరీస్ వంటి పలు చిత్రాల్లో నటించి అలరించారు సీనియర్ నటి రూప లక్ష్మీ.