Hari Teja: హరితేజ డ్రెస్సింగ్‌పై నెటిజన్ల ట్రోలింగ్ – కారణం ఏమిటంటే..
ప్రస్తుతం బెల్జియంలోఉన్న బిగ్‌బాస్ బ్యూటీ హరితేజ ఈ టూర్లో శివరాజ్‌కుమార్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఆ డ్యాన్స్ తాలూకు వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇందులో ఆమె ధరించిన డ్రెస్‌పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
సీరియల్స్ తో కెరీర్ ను ప్రారంభించి బిగ్‌బాస్ సీజన్ 1 తో వెలుగులోకి వచ్చింది హరితేజ. ఈ రియాలిటీ షోలో ట్రెడిషనల్ దుస్తుల్లోనే ఎక్కువగా కనిపించింది. మోడ్రన్ డ్రెస్‌లను తనకు నచ్చవంటూ,అందాల ప్రదర్శన చేయనంటూ హరితేజ చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. బిగ్‌బాస్‌తో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హరితేజ ఆ తర్వాత యూటర్న్,ఎఫ్-2,హిట్‌తో పాటు చాలా సినిమాల్లో కనిపించింది. పలు షోలోకు హోస్ట్‌గా వ్యవహరించింది.
ప్రస్తుతం హరితేజ బెల్జియం టూర్లో ఉంది. ఈ టూర్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్న ఆమె బెల్జియం రోడ్‌పై శివరాజ్ కుమార్ నటించిన భైరాగి సినిమాలోని రిథమ్ ఆఫ్ శివప్ప పాటకు డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇందులో బుల్లి గౌనులో అందాలను ఆరబోస్తూ మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్నది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో హరితేజ డ్రెస్సింగ్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
బిగ్‌బాస్ షోలో స్లీవ్ లెస్ వేసుకోవడానికి చాలా ఫీల్ అయ్యి సీన్ చేశావు ఇప్పుడు పొట్టి గౌనులో కనిపించావు చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యావు హరితేజ అంటూ ఓ నెటిజన్ విమర్శించాడు. పిల్లను వదిలేసి దేశాటన చేస్తున్నావా హరితేజ అంటూ మరో నెటిజన్ పేర్కొన్నాడు. హరితేజ పాంట్ వేసుకోవడం మర్చిపోయిందంటూ చాలా మంది నెటిజన్లు ఆమె డ్యాన్స్ వీడియోను ఉద్దేశించి కామెంట్స్ పెడుతున్నారు. డ్రెస్ సెన్స్ మెయింటెన్ చేయడం నేర్చుకుంటే బాగుంటుందని కొందరు పేర్కొంటున్నారు.
సంబంధిత కథనం