Guppedantha Manasu November 21st Episode: రిషిపై అనుపమ ప్రశ్నల వర్షం - శైలేంద్రను చితకబాదిన భార్య - వసు డౌట్!
Guppedantha Manasu November 21st Episode: జగతి మరణానికి మహేంద్ర, రిషి కారణమని పొరపడుతుంది అనుపమ. వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అనుపమ ప్రశ్నలకు రిషి బాధపడతాడు. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Guppedantha Manasu November 21st Episode: జగతి మర్డర్ గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెడుతుంది అనుపమ. రిషి, వసుధార వల్లే జగతి చనిపోయిందని అనుపమను నమ్మిస్తారు శైలేంద్ర, దేవయాని. జగతిని అమ్మ అని పిలవకుండా రిషి క్షోభపెట్టాడని అబద్ధం ఆడుతుంది. మహేంద్ర కూడా జగతిని పట్టించుకోలేదని చెబుతారు. వారి మాటలు నిజమని నమ్ముతుంది అనుపమ.
మరోవైపు జగతి గురించి ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పడంతో నిజానిజాలేమిటో తానే తెలుసుకోవాలని అనుకుంటుంది. శైలేంద్ర, దేవయాని దగ్గర నుంచి నేరుగా మహేంద్ర దగ్గరకు వెళుతుంది అనుపమ. ఆమెకు సీక్రెట్‌గా శైలేంద్ర ఫాలో అవుతాడు. శైలేంద్ర, దేవయానిలను అనుపమ కలిసిన విషయం ధరణి ద్వారా వసుధార తెలుసుకుంటుంది. వాళ్లు మళ్లీ ఏదో కుట్ర పన్నుతున్నారని అనుమానిస్తుంది.
మహేంద్రపై ఫైర్...
మహేంద్రను కలిసిన అనుపమ వచ్చిరావడంతోనే అతడిపై ఫైర్ అవుతుంది. నిన్ను నమ్మి జగతిని నీ చేతిలో పెడితే ఆమెను నడిరోడ్డు మీద ఎందుకు వదిలేశావు అంటూ కోప్పడుతుంది. పెళ్లైన తర్వాత జగతిని దూరం పెట్టావు. ఆమె మనసు అర్థం చేసుకోకుండా కష్టపెట్టావని మహేంద్రతో అంటుంది అనుపమ, మహేంద్ర మాటల్ని చాటునుంచి శైలేంద్ర వింటుంటాడు.
అనుపమ మాటలతో మహేంద్ర కోపంతో ఎగిరిపడతాడు. ప్రేమించిన జగతిని ఎలా దూరం పెట్టావని నిలదీస్తుంది. జగతిని ఎందుకు వేధించావని మహేంద్రను అడుగుతుంది అనుపమ. జగతి కలల్ని చిదిమివేసి ఆమె చచ్చిపోయేలా చేశావని మహేంద్రపై ఫైర్ అవుతుంది అనుపమ.
రిషి, వసుధార ఎంట్రీ...
అప్పుడే రిషి, వసుధార ఇంటికి వస్తారు. వారిని చూసి శైలేంద్ర దాక్కుంటాడు. అనుపమ మాటల్ని విని తట్టుకోలేకపపోతున్నానని, ఇంకా ఎందుకు బతికి ఉన్నానా అనిపిస్తుందని రిషితో చెబుతూ బాధపడతాడు మహేంద్ర. జగతి, మహేంద్ర హ్యాపీగా ఉండాలని తానే వాళ్ల పెళ్లిని చేసినట్లు రిషి, వసుధారలతో అనుపమ చెబుతుంది.
ఇద్దరు విడిపోయారని తెలిసి చాలా బాధపడ్డానని, వాళ్లను కలపాలని అనుకున్నానని రిషితో అంటుంది అనుపమ. మహేంద్రను మాట అనోద్దని జగతి తనతో ఒట్టు వేయించుకుందని, అందుకే ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉండిపోయానని అనుపమ అంటుంది. జగతి లేనప్పుడు ఆ ఒట్టుకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతుంది.
దొంగలా పారిపోయిన శైలేంద్ర...
వారి మాటల్ని చాటుగా వింటున్న శైలేంద్ర ఫోన్ మోగుతుంది. తాను దొరికిపోకుండా ఉండటం కోసం పక్కనే ఉన్న నల్ల రంగు ముఖానికి పూసుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తాడు శైలేంద్ర. కానీ అతడి బైక్ స్టార్ట్ కాదు.
దాంతో తోసుకుంటూ వసుధార ఇంటి నుంచి పారిపోతాడు. శైలేంద్రను వసుధార గుర్తుపట్టేస్తుంది. క్లారిఫై చేసుకోవడం కోసం ధరణికి ఫోన్ చేసి కనుక్కుంటుంది. ఈ మధ్య శైలేంద్ర మారిపోయాడని వసుధారతో అంటుంది ధరణి. తనను బాగా చూసుకుంటున్నాడని చెబుతుంది.
శైలేంద్ర మోసం..
బైక్ స్టార్ట్ కాకపోవడంతో తోసుకుంటూ రోడ్డుపై నడుస్తుంటాడు శైలేంద్ర. అతడికి మెకానిక్ ఎదురవుతాడు.బైక్ బాగు చేస్తానంటూ శైలేంద్ర వద్ద వెయ్యి రూపాయలు తీసుకుంటాడు.డబ్బులు తీసుకున్న తర్వాత కీ ఆన్ చేసి స్టార్ట్ చేయమని చెప్పి వెళ్లిపోతాడు. వసుధార పెట్టిన టెన్షన్‌లో తాను కీ ఆన్ చేయలేదనే విషయం గుర్తొచ్చి శైలేంద్ర సహించలేకపోతాడు. వసుధారకు వెంటనే ముగింపు పలకాలని నిర్ణయించుకుంటాడు.
రిషిపై ప్రశ్నల వర్షం...
ఆ తర్వాత అనుపమతో మాట్లాడుతాడు రిషి. నా కంటే మా డాడ్ గురించి మీకే బాగా తెలుసునని, కానీ మీరు అలా మాట్లాడటంతో ఆయన చాలా హార్ట్ అయ్యాడని అనుపమతో చెబుతాడు రిషి. కొన్ని పరిస్థితుల వల్ల తల్లికి తన తండ్రి దూరమయ్యాడని అనుపమతో చెబుతాడు రిషి.
జగతి గురించి ప్రతి క్షణం మహేంద్ర ఆలోచించేవాడని, తండ్రి బాధ చూడలేకే తాను జగతిని తిరిగి ఇంటికి తీసుకొచ్చినట్లు చెబుతాడు రిషి. జగతిని రిషి మేడమ్ అని పిలిచేవాడని దేవయాని చెప్పిన విషయం అనుపమకు గుర్తొస్తుంది. ఇదే విషయం రిషిని అడుగుతుంది. అనుపమ మాటలను నిజమేనని రిషి ఒప్పుకుంటాడు. తాను తప్పు చేశానని అంగీకరిస్తాడు.
రిషి షాక్...
కన్న కొడుకుతో మేడమ్ అని పిలిపించుకుంటే భరించలేనంతా బాధగా ఉంటుందని రిషితో అంటుంది అనుపమ. నేను చేసింది తప్పే...అన్ని అర్థమై హ్యాపీగా ఉందమని అనుకునేలోపు మా అమ్మ నన్ను వదిలేసివెళ్లిపోయింది అనుపమకు బదులిస్తాడు రిషి. తప్పు చేయడం నీకు బాగా అలవాటు అనుకుంటా...జగతి విషయంలో ఇదొక్కటే తప్పు చేశావా...ఇంకా ఏమైనా చేశావా రిషిని నిలదీస్తుంది అనుపమ.
ఆమె ప్రశ్నలకు రిషి షాకవుతాడు. మీ ప్రశ్నలు చాలా కఠినంగా ఉన్నాయని, మీ ప్రశ్నలతో మా నాన్న చాలా బాధపడి ఉంటాడని అనుపమతో అంటాడు రిషి. మా నాన్న గురించి తప్పుగా మాట్లాడొద్దని, అవసరమైతే ఆయన్ని బాధ నుంచి బయటకు తీసుకురమ్మని అనుపమకు చెబుతాడు రిషి. మీరు నన్ను కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దని అనుపమను కోరుతాడు రిషి. తాను ఎప్పుడు జగతిని మర్చిపోనని, తన జ్ఞాపకాలు ప్రతి క్షణం నా గుండెల్లో కదలాడుతాయని అనుపమకు చెబుతాడు రిషి.
శైలేంద్రకు తన్నులు
ముఖానికి రంగు పూసుకొని ఇంటికొచ్చిన శైలేంద్రను గుర్తుపట్టదు ధరణి. అతడు ఇంట్లోకి వస్తుంటే అడ్డుకుంటుంది. కానీ ధరణిని తోసేసి ఇంటి లోపలికి వస్తాడు శైలేంద్ర. అతడిని దొంగ అనుకొని పొరపడిన ధరణి ఇళ్లు తుడిచే కర్రతో చావబాదుతుంది. భార్య కొడుతున్న దెబ్బలను భరించలేక లబోదిబో మంటాడు శైలేంద్ర. కొట్టడం ఆపమని ధరణిని బతిమిలాడుతాడు.
శైలేంద్ర గొంతు గుర్తుపట్టి కొట్టడం ఆపేస్తుంది ధరణి. తప్పైందని అంటుంది. మీరే సమాధానం చెప్పకుండా లోపలికి రావడంతో దొంగ అనుకొని కొట్టానని శైలేంద్రతో చెబుతుంది ధరణి. ఇన్ని రోజులు నిన్ను మాటలను మనసులో పెట్టుకొని కొట్టావా అని ధరణిని అడుగుతాడు శైలేంద్ర. మీరు మారిపోయిన తర్వాత అలా ఎందుకు చేస్తానని భర్తతో అంటుంది ధరణి. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.