Guntur Kaaram second song: గుంటూరు కారం రెండో పాటకు డేట్ ఖరారు.. ఈసారి రొమాంటిక్ మెలోడీ
Guntur Kaaram second song: గుంటూరు కారం సినిమా నుంచి రెండో పాట వచ్చేస్తోంది. ఈ సాంగ్ రిలీజ్ డేట్, టైమ్‍ను మూవీ యూనిట్ అధికారికంగా వెల్లడించింది. వివరాలివే..
Guntur Kaaram second song: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం నుంచి సూపర్ అప్‍డేట్ వచ్చేసింది. రెండో పాట రిలీజ్ డేట్‍ను మూవీ యూనిట్ ప్రకటించింది. అలాగే, సాంగ్ ప్రోమో వచ్చే తేదీ, టైమ్‍ను కూడా వెల్లడించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న గుంటూరు కారం చిత్రంలో మహేశ్ సరసన శ్రీలీల హీరోయిన్‍గా నటిస్తున్నారు. ‘ఓ మై బేబీ’ పేరుతో ఈ మూవీ నుంచి రెండో పాట రానుంది. ఆ వివరాలివే..
గుంటూరు కారం సినిమా నుంచి రెండో సాంగ్ ‘ఓ మై బేబీ’ పాట గురించి మూవీ యూనిట్ అధికారంగా ప్రకటించింది. ఈ పాట ప్రోమోను రెండు రోజుల్లో అంటే డిసెంబర్ 11వ తేదీన సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు తీసుకురానున్నట్టు చేయనున్నట్టు హారిక, హాసినీ క్రియేషన్స్ వెల్లడించింది. ఓ మై బేబీ పూర్తి పాటను డిసెంబర్ 13వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది.
“అద్భుతమైన మెలోడీతో కాఫీని ఎంజాయ్ చేయండి. రొమాంటిక్ సాంగ్ ఓ మై బేబితో ఓలలాడండి. గుంటూరు కారం రెండో పాట ప్రోమో 11వ తేదీ సాయంత్రం 4.05 గంటలకు రానుంది. పూర్తి పాట డిసెంబర్ 13వ తేదీ” అని హారిక, హాసినీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది. గుంటూరు కారం సినిమాకు ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.
గుంటూరు కారం నుంచి వచ్చిన తొలి పాట ‘దమ్ మసాలా’ మాస్ బీట్‍తో అదిరిపోయేలా ఉంది. బాగా పాపులర్ అయింది. అయితే, ఇప్పుడు రానున్న రెండో సాంగ్ ‘ఓ మై బేబి’ మెలోడీగా ఉండనుంది. మహేశ్ బాబు, శ్రీలీల మధ్య రొమాంటిక్ డ్యూయెట్‍గా ఉండనుంది. మహేశ్‍కు శ్రీలీల ముద్దు పెట్టినట్టుగా పోస్టర్‌ను కూడా ఈ పాట కోసం రిలీజ్ చేసింది మూవీ యూనిట్.
గుంటూరు కారం సినిమా సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కూడా మరో హీరోయిన్‍గా చేస్తున్నారు. జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
అతడు, ఖలేజా తర్వాత మహేశ్ - త్రివిక్రమ్ కాంబినేషన్‍లో మూడో మూవీగా గుంటూరు కారం తెరకెక్కుతోంది. హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) ఈ మూవీని నిర్మిస్తున్నారు.
టాపిక్