Gautham Menon Movie with Ram: రామ్‌తో గౌతమ్ మీనన్ సినిమా.. ఎప్పుడొస్తుందంటే?
Gautham Menon Movie With Ram: రామ్ పోతినేని హీరోగా.. గౌతమ్ మీనన్ దర్శకత్వలో ఓ సినిమా రాబోతుంది. ఈ విషయాన్ని గౌతమ్‌నే తెలిపారు. వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కే అవకాశముంది.
Gautham Menon Movie With Ram Pothineni: తెలుగులో ఘర్షణ, ఏం మాయ చేశావే, సాహసం శ్వాసగా సాగిపో లాంటి సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు గౌతమ్ మీనన్. ఈ చిత్రాలు స్ట్రైట్‌గా తెలుగులో ఆయన చేసినవి కాగా.. సూర్య సన్నాఫ్ కృష్ణన్, రఘువరన్ లాంటి డబ్బింగ్ చిత్రాలతోనూ మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం శింబు హీరోగా ఆయన తెరకెక్కించిన ది లైఫ్ ముత్తు అనే అనువాద సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబరు 17 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో మాట్లాడిన గౌతమ్ మీనన్.. తన తదుపరి ప్రాజెక్టుల గురించి ఆసక్తిరక విషయాలను పంచుకున్నారు.
త్వరలో టాలీవుడ్ యాక్టర్ రామ్ పోతినేనితో ఓ సినిమా చేయబోతున్నట్లు గౌతమ్ మీనన్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై వచ్చే ఏడాది పట్టాలెక్కనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తున్న జోషువా ఇమై పోల్ కాఖా, విక్రమ్‌తో దృవ నక్షత్రం లాంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇవి పూర్తయిన తర్వాత రామ్‌తో సినిమాకు రెడీ అవనున్నారు. వచ్చే ఏడాది మధ్య భాగంలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశముంది.
రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా గౌతమ్ మీనన్ తెలుగులో మంచి గుర్తింపు సాధించారు. వెంకటేశ్‌తో ఘర్షణ, నాగచైతన్యతో ఏం మాయ చేశావే, సాహసం శ్వాసగా సాగిపో లాంటి సినిమాలతో ఆకట్టుకున్నారు. ఇదే మాదిరిగా ఛాక్లెట్ బాయ్‌గా పేరున్న రామ్‌తో గౌతమ్ మీనన్ సినిమా చేస్తే అది సూపర్ రొమాంటిక్ చిత్రంగా ఉంటుందని ప్రేక్షకులు అంచనా వేసుకుంటున్నారు.
ఈ సినిమాలో శింబు, సిధి ఇద్నానీ, రాధికా శరత్ కుమార్ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. సిద్ధార్థ నూని సినిమాటోగ్రాఫర్‌గా నపిచేయగా.. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. అనంత శ్రీరామ్, కృష్ణ కాంత్ సాహిత్యాన్ని అందించగా.. శ్రేయా ఘోషల్, చిన్మయి పాటలను ఆలపించారు. సెప్టెంబరు 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కే గణేశ్ నిర్మించారు.
సంబంధిత కథనం
టాపిక్