Simbu and Gautam Movie Dubbed in Telugu: శింబు-గౌతమ్ మీనన్ కాంబోలో మరో సినిమా.. ‘ముత్తు’గా తెలుగులో రానున్న చిత్రం-simbu and gautam menon new movie the life of muthu release in telugu by sravanthi movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Simbu And Gautam Movie Dubbed In Telugu: శింబు-గౌతమ్ మీనన్ కాంబోలో మరో సినిమా.. ‘ముత్తు’గా తెలుగులో రానున్న చిత్రం

Simbu and Gautam Movie Dubbed in Telugu: శింబు-గౌతమ్ మీనన్ కాంబోలో మరో సినిమా.. ‘ముత్తు’గా తెలుగులో రానున్న చిత్రం

Maragani Govardhan HT Telugu
Sep 09, 2022 06:17 PM IST

The Life of Muthu in Telugu: శింబు, గౌతమ్ మీనన్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా రానుంది. అదే ది లైఫ్ ఆఫ్ ముత్తు. ఈ సినిమాను తెలుుగులో స్రవంతి మూవీస్ సంస్థ విడుదల చేయనుంది.

ది లైఫ్ ఆఫ్ ముత్తు
ది లైఫ్ ఆఫ్ ముత్తు (Twitter)

The Life of Muthu: కోలీవుడ్ స్టార్ శింబు సినిమాలు చాలా వరకు తెలుగులోనూ డబ్ అయి మంచి విజయాలను అందుకున్నాయి. గతేడాది అతడు నటించిన మానాడు చిత్రం తెలుగులోనూ మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించాడు. ఏమాయే చేశావే, సాహసం శ్వాసగా సాగిపో తమిళ వెర్షన్లలో శింబునే హీరో. తాజాగా ముచ్చటగా మూడో సారి వీరి కాంబోలో సినిమా రాబోతుంది. అదే ది లైఫ్ ఆఫ్ ముత్తు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేయనున్నారు. ఇక్కడ ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ విడుదల చేయనుంది.

ఈ సందర్భంగా నిర్మాత స్రవంతి రవి కిషోర్ మాట్లాడుతూ.. "సినిమా ట్రైలర్ నాకు ఎంతో నచ్చింది. ఎంతో గొప్పగా ఉంది. శింబు పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా నేను మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అతడిలో మ్యాజిక్ ఉంది. గౌతమ్ మీనన్ డైరెక్షన్, ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు హైలెట్. తెలుగులో శింబు, గౌతమ్ మీనన్‌కు మంచి మార్కెట్ ఉంది. గతంలో మేము నాయకుడు, పుష్పక విమానం, రెండు తోకల పిట్ట, రఘువరన్ బీటెక్ లాంటి చిత్రాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేసింది. ఈ చిత్రంతో అదే రికార్డు పునరావృతమవుతుందని ఆశిస్తున్నాం. ది లైఫ్ ఆఫ్ ముత్తు సినిమా కాన్సెప్ట్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నాం. సినిమా సెప్టెంబరు 15న విడుదల కానుంది." అంటూ స్రవంతి రవి కిషోర్ స్పష్టం చేశారు.

ఈ సినిమాలో శింబు, సిధి ఇద్నానీ, రాధికా శరత్ కుమార్ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. సిద్ధార్థ నూని సినిమాటోగ్రాఫర్‌గా నపిచేయగా.. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. అనంత శ్రీరామ్, కృష్ణ కాంత్ సాహిత్యాన్ని అందించగా.. శ్రేయా ఘోషల్, చిన్మయి పాటలను ఆలపించారు. సెప్టెంబరు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కే గణేశ్ నిర్మించారు. ది లైఫ్ ఆఫ్ ముత్తు సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ సీక్వెల్‌ను నిర్మించనున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్