Gadar 2 Collections : 300 కోట్ల క్లబ్‌లో గదర్ 2.. కేజీఎఫ్ 2, పఠాన్ రికార్డులు హాంఫట్-gadar 2 box office collections gadar 2 movie beats kgf 2 and pathan records ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Gadar 2 Box Office Collections Gadar 2 Movie Beats Kgf 2 And Pathan Records

Gadar 2 Collections : 300 కోట్ల క్లబ్‌లో గదర్ 2.. కేజీఎఫ్ 2, పఠాన్ రికార్డులు హాంఫట్

Anand Sai HT Telugu
Aug 19, 2023 12:11 PM IST

Gadar 2 Collections : ఏదైనా సినిమా తొలి శుక్రవారం భారీ కలెక్షన్లను రాబడుతుంది. రెండో శుక్రవారం వ‌స్తే సినిమాకు హైప్‌ తగ్గుతుంది. కానీ గదర్ 2 చిత్రం మాత్రం దూసుకెళ్తోంది. ఆగస్ట్ 11 నుంచి ఇప్పటి వరకు భారీ వసూళ్లను రాబడుతోంది.

గదర్ 2 మూవీ కలెక్షన్స్
గదర్ 2 మూవీ కలెక్షన్స్

బాలీవుడ్ హీరో సన్నీడియోల్(sunny deol) నటించిన గదర్ 2 చిత్రం బాక్సాఫీసుపై కనక వర్షం(Gadar 2 Box Office Collections) కురిపిస్తోంది. ఆగస్టు 11న ప్రేక్షకుల మందుకు వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాపై ఉన్న హైప్ ఏమాత్రం తగ్గడం లేదు. భారతీయ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కేవలం ఎనిమిది రోజుల్లో 300 కోట్ల రూపాయలను రాబట్టింది. యష్ నటించిన కేజీఎఫ్ 2(KGF 2), షారుక్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రాల(Patan Movie) రికార్డులను గదర్ 2 అధిగమించింది . శనివారం (ఆగస్టు 19), రేపు (ఆగస్టు 20) సినిమాకు మరిన్ని కలెక్షన్లు రాబోతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

తొలి శుక్రవారం ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టింది. రెండో శుక్రవారం వరకూ వసూళ్లు తగ్గలేదు. శుక్రవారం రోజున 20 కోట్ల రూపాయలను వసూలు చేసింది. సినిమా విడుదలైన రెండో శుక్రవారం కూడా గదర్ 2 సినిమా జోరు పెరిగింది. గతంలో విడుదలై రెండో శుక్రవారం మంచి వసూళ్లు సాధించిన ది కాశ్మీర్ ఫైల్స్ (రూ. 19 కోట్లు), దంగల్ (రూ. 18 కోట్లు), పీకే (రూ. 15 కోట్లు), కేజీఎఫ్ 2 (రూ. 11.25 కోట్లు) సినిమాలను గదర్ 2 అధిగమించింది.

సన్నీ డియోల్ చాలా సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో చురుకుగా ఉన్నాడు. అయితే అంత భారీ స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు. గదర్ 2 సినిమా(Gadar 2 Cinema)తో బిగ్గెస్ట్ గెలుపుని అందుకున్నాడు. ఈ విజయంతో అతనికి ఆఫర్లు పెరిగాయి. గదర్ ఏక్ ప్రేమ్ కహానీ సినిమాకు సీక్వెల్ గా గదర్ 2 వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండానే.. బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టించింది. ఈ చిత్రాన్ని అనిల్ శర్మ డైరెక్ట్ చేశాడు. తారా సింగ్ పాత్రలో కనిపించి.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు సన్నీడియోల్.

ఇటీవలే గదర్ 2 ప్రమోషన్స్ లో భాగంగా.. హైదరాబాద్(Hyderabad) వచ్చాడు సన్నీడియోల్. తెలుగు ప్రేక్షకులు తనపై చూపించే అభిమానానికి కృతజ్ఞతలు తెలిపాడు. సినిమాను సక్సెస్ చేసినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. ఈ చిత్రంలో అమీషా పటేల్ హీరోయిన్ గా నటించగా.. ఉత్కర్ష్ శర్మ, సిమ్రత్ కౌర్, మనీష్ వాద్వా, అర్జున్ ద్వివేది కీలక పాత్రల్లో కనిపించారు. జీ స్టూడియోస్ సమర్పణలో అనిల్ శర్మ, కమల్ ముకుత్ ఈ సినిమాను నిర్మించారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.