Amigos First Single: అమిగోస్ నుంచి మొదటి పాట వచ్చేసింది.. ట్రెండీగా సాంగ్-first single released from kalyan ram new movie amigos ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  First Single Released From Kalyan Ram New Movie Amigos

Amigos First Single: అమిగోస్ నుంచి మొదటి పాట వచ్చేసింది.. ట్రెండీగా సాంగ్

Maragani Govardhan HT Telugu
Jan 20, 2023 09:44 PM IST

Amigos First Single: నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న అమిగోస్ చిత్రం నుంచి మొదటి పాట విడుదలైంది. యెకా యెకా అంటూ సాగే ఈ సాంగ్ ఆకర్షణీయంగా ఉంది. ఈ సినిమా ఫిబ్రవరి 10న విడుదల కానుంది.

అమిగోస్ నుంచి మొదటి పాట
అమిగోస్ నుంచి మొదటి పాట

Amigos First Single: నందమూరి కల్యాణ్ రామ్ గతేడాది బింబిసారతో అద్భుత విజయాన్ని అందుకున్నారు. తన కెరీర్‌లో అదిరిపోయే హిట్‌ను సొంతం చేసుకున్న ఈ హీరో.. ప్రస్తుతం తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఆయన అమిగోస్ అనే సినిమాను చేస్తున్నారు. ఇందులో కన్నడ హీరోయిన్ అషికా రంగనాథ్ ఈ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. అమిగోస్ నుంచి మొదటి పాట విడుదల చేసింది చిత్రబృందం.

అమిగోస్ నుంచి యెకా యెకా అంటూ సాగే వీడియోను సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రెండీ సాంగ్ ఆకట్టుకుంటోంది. యువతను ఆకట్టుకునే విధంగా ఈ పాట ఆకట్టుకుంటోంది. జీబ్రాన్ సంగీతం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ పాటను సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రీ రాశారు.

ఈ సినిమాలో కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. సిద్ధార్థ్, మంజునాథ్, మైఖేల్ అనే పాత్రల్లో మెరిశారు. ఈ మూడు క్యారెక్టర్లలోనూ కల్యాణ్ రామ్ స్టైలిష్‌గా కనిపించారు. తన లుక్‌తో ఆడియెన్స్‌ను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేశారు.

అమిగోస్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. నవీన్ యెర్నీని, వై రవిశంకర్ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రాజేంద్ర రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ నటి అషికా రంగనాథ్ తెలుగులోకి ఈ సినిమా ద్వారా అరంగేట్రం చేస్తోంది. జీబ్రాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్