Ashika Ranganath Telugu Debut: కల్యాణ్ రామ్ సినిమాలో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్.. టాలీవుడ్‌లో అరంగేట్రం-ashika rangaath selected as heroin in in kalyan ram amigos ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Ashika Rangaath Selected As Heroin In In Kalyan Ram Amigos

Ashika Ranganath Telugu Debut: కల్యాణ్ రామ్ సినిమాలో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్.. టాలీవుడ్‌లో అరంగేట్రం

Maragani Govardhan HT Telugu
Dec 24, 2022 01:34 PM IST

Ashika Ranganath Telugu Debut: కన్నడ హీరోయిన్ ఆషికా రంగనాథ్ తెలుగులో అరంగేట్రం చేస్తోంది. కల్యాణ్ రామ్ నటిస్తోన్న అమిగోస్ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

కల్యాణ్ రామ్  సినిమాలో ఆషికా రంగనాథ్
కల్యాణ్ రామ్ సినిమాలో ఆషికా రంగనాథ్

Ashika Ranganath Telugu Debut: నందమూరి హీరో కల్యాణ్ రామ్ ఈ ఏడాది బింబిసారతో సాలిడ్ హిట్ అందుకున్నారు. దీంతో ఆయన నటించే తదుపరి ప్రాజెక్టుపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఆయన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ వచ్చేసి అమిగోస్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సరికొత్త అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో నటించబోయో హీరోయిన్‌ ఎవరో తెలియజేశారు. అంతేకాకుండా సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

కల్యాణ్ రామ్ సరసన ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇషికా అనే పాత్రలో ఆమె నటిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆమె పోస్టర్‌ను విడుదల చేశారు. క్యూట్ ఫోజుతో ఆమె ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. చాలా తక్కువ సమయంలోనే ఆషికా కన్నడ చిత్రాల్లో అగ్ర హీరోయిన్లలో ఒకరిగా చేరింది. దీంతో ఇతర చిత్ర సీమల నుంచి కూడా ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు భారీగా వస్తున్నాయి. దీంతో డిమాండ్ ఉన్న నటిగా గుర్తింపు పొందారు.

ప్రస్తుతం కల్యాణ్ రామ్ సరసన నటిస్తూ సాలిడ్ ప్రాజెక్టుతో తెలుగులో అరంగేట్రం చేస్తోంది ఆషికా. ఈ చిత్రం కల్యాణ్ రామ్ 19వ సినిమా కావడం విశేషం. రాజేంద్ర రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రం ద్వారా చిత్రసీమకు పరిచయమవుతున్నారు. జనవరి నుంచి ఈ సినిమా ప్రమోషన్లను ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 2023 ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకొచ్చేందుకు చిత్రబందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన ఆషికా హీరోయిన్‌గా చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేనీ, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.