Amigos Teaser: క‌ల‌వ‌డం అద్భుతం విడిపోవ‌డం అవ‌స‌రం - క‌ళ్యాణ్‌రామ్‌ అమిగోస్ టీజ‌ర్ రిలీజ్‌ -amigos teaser out kalyan ram plays triple role in this action thriller
Telugu News  /  Entertainment  /  Amigos Teaser Out Kalyan Ram Plays Triple Role In This Action Thriller
క‌ళ్యాణ్ రామ్
క‌ళ్యాణ్ రామ్

Amigos Teaser: క‌ల‌వ‌డం అద్భుతం విడిపోవ‌డం అవ‌స‌రం - క‌ళ్యాణ్‌రామ్‌ అమిగోస్ టీజ‌ర్ రిలీజ్‌

08 January 2023, 11:33 ISTNelki Naresh Kumar
08 January 2023, 11:33 IST

Amigos Teaser: క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టించిన అమిగోస్ టీజ‌ర్ ఆదివారం రిలీజైంది. ఈ టీజ‌ర్‌లో ఒకే పోలిక‌ల‌తో కూడిన ముగ్గురు వ్యక్తులుగా క‌ళ్యాణ్‌రామ్ క‌నిపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది.

Amigos Teaser: క‌ళ్యాణ్ రామ్ (Kalyan Ram Nandamuri) అమిగోస్ టీజ‌ర్ వ‌చ్చేసింది. ఆదివారం ఈ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో మూడు పాత్ర‌ల్లో క‌ళ్యాణ్ రామ్ క‌నిపిస్తున్నాడు. హాయ్ దిస్ ఈజ్ మైఖేల్ ఫ్ర‌మ్ కోల్‌క‌తా అనే డైలాగ్‌తో ఇంట్రెస్టింగ్‌గా టీజ‌ర్ ప్రారంభ‌మైంది. మైఖేలా ఏం కావాలి అని అడ‌గ్గా యూ అని స‌మాధానం చెప్ప‌డం ఆస‌క్తిని పంచుతోంది.

ఆ త‌ర్వాత త్రిబుల్ రోల్‌లో క‌ళ్యాణ్‌రామ్ టీజ‌ర్‌లో క‌నిపించ‌డం, వారిని చూసి అస‌లు సంబంధం లేని ముగ్గురు వ్య‌క్తులు ఒకేలా ఉండ‌టం, ఇలా క‌ల‌వ‌డం అంటూ బ్ర‌హ్మాజీ చెప్పే డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది. మ‌నం క‌ల‌వ‌డం ఓ అద్భుతం విడిపోవ‌డం అవ‌స‌రం అంటూ ఎమోష‌న‌ల్‌గా క‌ళ్యాణ్‌రామ్ చెప్పిన డైలాగ్ టీజ‌ర్‌కు హైలైట్‌గా నిలుస్తోంది.

యాక్ష‌న్ స‌స్పెన్స్ అంశాల‌తో టీజ‌ర్ థ్రిల్‌ను పంచుతోంది. టీజ‌ర్ చివ‌ర‌లో త‌న పోలిక‌ల‌తో ఉన్న వ్య‌క్తి నుంచి క‌ళ్యాణ్ రామ్ త‌ప్పించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం ఉత్కంఠ‌ను పంచుతోంది. ఇందులో సిద్ధార్థ్‌, మంజునాథ్‌, మైఖేల్ అనే మూడు పాత్ర‌ల్లో క‌ళ్యాణ్ రామ్ క‌నిపించ‌బోతున్నాడు. ఈ మూడు క్యారెక్ట‌ర్స్ మ‌ధ్య క‌ళ్యాణ్‌రామ్ చ‌క్క‌టి వేరియేష‌న్‌ను చూపించారు.

అమిగోస్ సినిమాకు రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అత‌డికి ఇదే తొలి సినిమా కావ‌డం గ‌మ‌నార్హం. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అమిగోస్ సినిమా ఫిబ్ర‌వ‌రి 10న రిలీజ్ కానుంది.

బింబిసార స‌క్సెస్ త‌ర్వాత క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టిస్తోన్న సినిమా ఇది. బింబిసార‌లో డ్యూయ‌ల్ రోల్‌లో క‌ళ్యాణ్ రామ్ న‌టించ‌గా అమిగోస్‌లో త్రిబుల్ రోల్ చేయ‌డం ఆస‌క్తిని పంచుతోంది.

అమిగోస్ సినిమాకు జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తోన్నాడు. ప్ర‌స్తుతం డెవిల్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు క‌ళ్యాణ్‌రామ్‌. బ్రిటీష్ టైమ్ పీరియడ్‌లో సాగే ఈ సినిమాకు న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

టాపిక్