Kalyan Ram Devil Movie Update: స్పీడు పెంచిన క‌ళ్యాణ్ రామ్ - డెవిల్ అప్‌డేట్ వ‌చ్చేసింది-nandamuri kalyan ram devil movie updates third schedule completes ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalyan Ram Devil Movie Update: స్పీడు పెంచిన క‌ళ్యాణ్ రామ్ - డెవిల్ అప్‌డేట్ వ‌చ్చేసింది

Kalyan Ram Devil Movie Update: స్పీడు పెంచిన క‌ళ్యాణ్ రామ్ - డెవిల్ అప్‌డేట్ వ‌చ్చేసింది

Nelki Naresh Kumar HT Telugu
Dec 31, 2022 10:22 AM IST

Kalyan Ram Devil Movie Update: బింబిసార త‌ర్వాత క‌ళ్యాణ్‌రామ్ హీరోగా న‌టిస్తోన్న సినిమా డెవిల్‌. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా తాజా అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది.

 క‌ళ్యాణ్‌రామ్
క‌ళ్యాణ్‌రామ్

Kalyan Ram Devil Movie Update: బింబిసార సినిమాతో లాంగ్ గ్యాప్ త‌ర్వాత బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ అందుకున్నాడు నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్‌. సోషియా ఫాంట‌సీ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా 2022లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

ఈ స‌క్సెస్ అందించిన జోష్‌లో త‌న త‌దుప‌రి సినిమాను చ‌క‌చ‌కా పూర్తి చేస్తున్నాడు క‌ళ్యాణ్‌రామ్‌. ప్ర‌స్తుతం డెవిల్ పేరుతో ఓ పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఫిల్మ్ చేస్తున్నాడు క‌ళ్యాణ్‌రామ్‌.

1945 మ‌ద్రాస్ ప్రెసెడెన్సీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ క‌నిపించబోతున్నారు. ఈ సినిమా మూడో షెడ్యూల్ పూర్త‌యిన‌ట్లు చిత్ర నిర్మాత శ‌నివారం ప్ర‌క‌టించారు. ఈ మూడో షెడ్యూల్‌లో బ్రిటీష్ కాలాన్ని త‌ల‌పించేలా హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో క‌ళ్యాణ్‌రామ్‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించిన‌ట్లు తెలిసింది.

డెవిల్ సినిమాను పాన్ ఇండియ‌న్ లెవ‌ల్‌లో తెలుగుతో పాటు త‌మిళం, హిందీతో పాటు మిగిలిన భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. డెవిల్ సినిమాకు న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అభిషేక్ నామా నిర్మిస్తున్నాడు. వ‌చ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది

డెవిల్‌తో పాటు అమిగోస్ సినిమాలో న‌టిస్తోన్నాడు క‌ళ్యాణ్‌రామ్‌. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 10న రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

టాపిక్