Telugu News  /  Entertainment  /  Farzi Trailer Released As The Raj And Dk Director Duo Come Up With Another Interesting Web Series
ఫర్జీలో షాహిద్ కపూర్
ఫర్జీలో షాహిద్ కపూర్

Farzi Trailer: రాజ్ అండ్‌ డీకే మరో సూపర్‌ సిరీస్‌.. ఫర్జీ ట్రైలర్‌ రిలీజ్‌

13 January 2023, 16:55 ISTHari Prasad S
13 January 2023, 16:55 IST

Farzi Trailer: రాజ్ అండ్‌ డీకేలాంటి టాలెంటెడ్‌ క్రియేటర్స్‌ నుంచి మరో సూపర్‌ సిరీస్‌ వస్తోంది. ఈ వెబ్‌ సిరీస్‌ పేరు ఫర్జీ. ఈ సిరీస్‌ ట్రైలర్‌ శుక్రవారం (జనవరి 13) రిలీజ్‌ అయింది.

Farzi Trailer: రాజ్‌ అండ్‌ డీకే.. ఎంతో టాలెంట్‌ ఉన్న తెలుగు డైరెక్టర్లు వీళ్లు. రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే వీళ్ల పూర్తి పేర్లు. అయితే ఫిల్మ్‌ ఇండస్ట్రీలో రాజ్‌ & డీకే జోడీగా పేరుగాంచారు. ఇటు ఓటీటీ స్పేస్‌తోపాటు అటు సినిమాల్లోనూ తమదైన స్టైల్‌ టేకింగ్‌తో దుమ్మ రేపుతున్నారు. బాలీవుడ్‌లో 99, షోర్ ఇన్‌ ద సిటీ, హ్యాపీ ఎండింగ్‌, అన్‌పాజ్డ్‌లాంటి సినిమాలు తీశారు.

ట్రెండింగ్ వార్తలు

ఇక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌ ఎంత పెద్ద సక్సెస్‌ సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ మూడో సీజన్‌ కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆలోపు ఈ దర్శక ద్వయం మరో ఇంట్రెస్టింగ్ వెబ్‌ సిరీస్‌తో రాబోతోంది. ఈ సిరీస్‌ పేరు ఫర్జీ. దొంగనోట్ల చుట్టూ తిరిగే కథ ఇది.

బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ ఈ సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెడుతున్నాడు. అతనితోపాటు తమిళ స్టార్‌ నటుడు విజయ్‌ సేతుపతి, కేకే, రాశీ ఖన్నా, రెజీనాలాంటి నటీనటులు ఇందులో ఉన్నారు. ఈ ఫర్జీ ట్రైలర్‌ శుక్రవారం (జనవరి 13) రిలీజైంది. ఊహించినట్లే రాజ్‌ & డీకే మార్క్‌ టేకింగ్‌ ఇందులో కనిపిస్తోంది. ఎలాగైనా డబ్బు సంపాదించాలనుకునే హీరో.. దాని కోసం దొంగ నోట్లనే ముద్రించే క్రైమ్‌ చేస్తుంటాడు.

మంచి ఆర్టిస్ట్‌ అయిన షాహిద్‌.. తన టాలెంట్‌ను ఇలా దొంగ నోట్లు క్రియేట్‌ చేయడానికి ఉపయోగిస్తుంటాడు. అతన్ని పట్టుకునే పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌లో విజయ్‌ సేతుపతి కనిపించాడు. ఈ ఫర్జీ సిరీస్‌కు స్టోరీ అందించడంతోపాటు రాజ్‌ & డీకేనే డైరెక్ట్‌ చేశారు. ఈ ట్రైలర్‌ చాలా ఉత్కంఠ రేపేలా ఉంది. ఈ కొత్త సిరీస్‌ ఫిబ్రవరి 10 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమ్‌ కానుంది.