Emergency Release Date: సర్టిఫికెట్ వచ్చేసింది.. త్వరలోనే రిలీజ్ డేట్: ఎమర్జెన్సీపై కంగనా ట్వీట్-emergency movie release date kangana ranut starrer gets cbfc certificate to release soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Emergency Release Date: సర్టిఫికెట్ వచ్చేసింది.. త్వరలోనే రిలీజ్ డేట్: ఎమర్జెన్సీపై కంగనా ట్వీట్

Emergency Release Date: సర్టిఫికెట్ వచ్చేసింది.. త్వరలోనే రిలీజ్ డేట్: ఎమర్జెన్సీపై కంగనా ట్వీట్

Hari Prasad S HT Telugu

Emergency Release Date: కంగనా రనౌత్ తన రాబోయే చిత్రం ఎమర్జెన్సీకి సీబీఎఫ్‌సీ సర్టిఫికేషన్ పొందినట్లు ధృవీకరించింది. ఈ మూవీ రిలీజ్ చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ కంగనా వెల్లడించనుంది.

సర్టిఫికెట్ వచ్చేసింది.. త్వరలోనే రిలీజ్ డేట్: ఎమర్జెన్సీపై కంగనా ట్వీట్

Emergency Release Date: కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ మూవీకి మొత్తానికి సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్ వచ్చేసింది. ఈ విషయాన్ని ఆమెనే వెల్లడించింది. పొలిటికల్ డ్రామా అయిన ఎమర్జెన్సీ సినిమాలోని కొన్ని సున్నితమైన సన్నివేశాలపై సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) అభ్యంతరం వ్యక్తం చేయడంతో అనేక సవాళ్లు ఎదురయ్యాయి.

అయితే సెన్సార్ బోర్డుతో సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకు తన హోమ్ ప్రొడక్షన్ కు సర్టిఫికేట్ లభించిందని సోషల్ మీడియా అకౌంట్ ద్వారా కంగనా తెలిపింది.

ఎమర్జెన్సీకి సీబీఎఫ్‌సీ గ్రీన్ సిగ్నల్

కంగనా రనౌత్ ఇందిరా గాంధీ పాత్రలో నటించి, డైరెక్ట్ చేసిన మూవీ ఎమర్జెన్సీ. ఈ మూవీకి ఎట్టకేలకు సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్ రావడంతో తనకు చాలా ఆనందంగా ఉందంటూ కంగనా ఎక్స్ ద్వారా తన అభిప్రాయాన్ని షేర్ చేసుకుంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ వెల్లడించనున్నట్లు తెలిపింది.

“మా సినిమా ఎమర్జెన్సీకి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. రిలీజ్ తేదీని త్వరలోనే అనౌన్స్ చేస్తాం. మీ సహనం, మద్దతుకు చాలా ధన్యవాదాలు” అనే ట్వీట్ తో కంగనా ఈ విషయం తెలిపింది. దీనిపై పలువురు అభిమానులు కామెంట్స్ చేశారు.

ఓ అభిమాని 'ఇది గొప్ప వార్త' అని కామెంట్ చేశాడు. ఎమర్జెన్సీ సమయంలో ఏం జరిగిందన్నది తెలుసుకోవడానికి తాము ఎదురు చూస్తున్నట్లు మరో యూజర్ అన్నారు. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ వచ్చినందుకు కంగనాకు శుభాకాంక్షలు చెప్పారు.

ఆ కట్స్‌కు అంగీకరించిన ఎమర్జెన్సీ టీమ్

కంగనా ఇటీవల సెన్సార్ బోర్డు సూచించిన కొన్ని కట్స్ కు అంగీకరించింది. ఎమర్జెన్సీ సహ నిర్మాతలు జీ స్టూడియోస్ దాఖలు చేసిన పిటిషన్ పై బాంబే హైకోర్టులో విచారణ సందర్భంగా బోర్డు రివైజింగ్ కమిటీ సూచనలకు కంగనా అంగీకరించిందని సీబీఎఫ్ సీ తెలిపింది. సిక్కు కమ్యూనిటీని తప్పుగా చూపించారనే కారణంతో ఈ ప్రాజెక్టును నిషేధించాలని కొందరు డిమాండ్ చేయడంతో ఈ పిటిషన్ దాఖలైంది.

ఎమర్జెన్సీ మూవీ గురించి..

1975 నుండి 1977 వరకు 21 నెలల ఎమర్జెన్సీని విధించిన భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో కంగనా.. ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తోంది. జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్‌పేయీగా శ్రేయాస్ తల్పాడే, మొరార్జీ దేశాయ్ గా అశోక్ చాబ్రా, ఇందిరాగాంధీ సన్నిహితుడు పుపుల్ జయకర్ గా మహిమా చౌదరి, ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్షాగా మిలింద్ సోమన్, సంజయ్ గాంధీగా విశాక్ నాయర్, జగ్జీవన్ రామ్ పాత్రలో దివంగత సీనియర్ నటుడు సతీష్ కౌశిక్ నటించారు.