Bigg Boss 7 Telugu: బిగ్‍బాస్‍లో దసరా సంబరాలు.. డ్యాన్సులు, పాటలు, ఆటలు.. కన్నీళ్లు కూడా: వీడియో.. ఎపిసోడ్ టైమ్ మార్పు-dussehra bathukamma celebrations in bigg boss telugu 7 house ratika may re enter puja murthy reportedly eliminated ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 7 Telugu: బిగ్‍బాస్‍లో దసరా సంబరాలు.. డ్యాన్సులు, పాటలు, ఆటలు.. కన్నీళ్లు కూడా: వీడియో.. ఎపిసోడ్ టైమ్ మార్పు

Bigg Boss 7 Telugu: బిగ్‍బాస్‍లో దసరా సంబరాలు.. డ్యాన్సులు, పాటలు, ఆటలు.. కన్నీళ్లు కూడా: వీడియో.. ఎపిసోడ్ టైమ్ మార్పు

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 22, 2023 04:25 PM IST

Bigg Boss 7 Telugu Promo: బిగ్‍బాస్ హౌస్‍లో దసరా, బతుకమ్మ సంబురాలు ఫుల్ జోష్‍గా జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రోమో వచ్చింది. అలాగే, నేటి ఎపిసోడ్ టైమింగ్ కూడా మారింది. ఆ వివరాలివే..

Bigg Boss 7 Telugu: బిగ్‍బాస్‍లో దసరా సంబరాలు.. డ్యాన్సులు, పాటలు, ఆటలు
Bigg Boss 7 Telugu: బిగ్‍బాస్‍లో దసరా సంబరాలు.. డ్యాన్సులు, పాటలు, ఆటలు

Bigg Boss 7 Telugu Promo: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్‍లో దసరా, బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా సాగాయి. నేటి ఎపిసోడ్ (అక్టోబర్ 22)లో ఈ సెలెబ్రేషన్స్ ప్రసారం కానున్నాయి. సాధారణంగా ఆదివారం ఎపిసోడ్‍లో కంటెస్టెంట్లతో ఫన్నీ గేమ్స్, టాస్కులు ఆడిస్తుంటారు హోస్ట్ కింగ్ నాగార్జున. అయితే, ఈసారి దసరా, బతుకమ్మ సెలెబ్రేషన్స్ ఉండనున్నాయి. నేడు (అక్టోబర్ 22) సాయంత్రం 7 గంటలకే బిగ్‍బాస్ మెగా ఎపిసోడ్ మొదలుకానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను స్టార్ మా వెల్లడించింది. ప్రోమోలో ఏముందంటే..

డ్యాన్స్ చేసుకుంటూ ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. ఆ తర్వాత కంటెస్టెంట్లు బతుకమ్మ ఆడారు. అనంతరం కంటెస్టెంట్లకు హ్యాపీ దసరా చెప్పారు. అందరూ ఆయనకు కూడా శుభాకాంక్షలు చెప్పారు. ఆ తర్వాత కొందరు హీరోయిన్లతో డ్యాన్స్ పర్ఫార్మెన్సులు బిగ్‍బాస్ స్టేజీపై ఉండనున్నాయి. యమా జోష్‍తో ఈ ఎపిసోడ్ సాగేలా కనిపిస్తోంది. అలాగే, కొందరు సింగర్స్ పాటలు కూడా పాడారు. మొత్తంగా బిగ్‍బాస్ వేదికపై దసరా సంబరాలు ఉత్సాహంగా సాగినట్టు కనిపిస్తోంది.

హౌస్‍లో కంటెస్టెంట్లు కూడా డ్యాన్సులు చేశారు. శోభాశెట్టి, ప్రియాంకతో నాగినీ డ్యాన్స్ వేయించారు నాగ్. అర్జున్, అశ్వినీతో పోల్ డ్యాన్స్ చేయించారు. ఎక్కడో ఎక్స్‌పీయన్స్ ఉన్నట్టుంది అంటూ అర్జున్‍కు పంచ్ వేశారు నాగార్జున. ఆ తర్వాత కంటెస్టెంట్లతో కొన్ని గేమ్స్ కూడా ఆడించారు.

తమతమ కుటుంబాల నుంచి వచ్చిన ఉత్తరాలను కంటెస్టెంట్లకు ఇచ్చారు బిగ్‍బాస్. లెటర్లను చదువుతూ కొందరు కంటెస్టెంట్లు ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. శోభా శెట్టి కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె ఉత్తరాన్ని గౌతమ్ చదివారు. ప్రిన్స్ యావర్ అయితే.. లెటర్ చదువుతూ గుక్కపట్టి ఏడ్చేశారు. శివాజీ అతడిని ఓదార్చారు. ఇక, ఇప్పటికే ఎలిమినేట్ అయిన ఓ కంటెస్టెంట్ తిరిగి హౌస్‍లోకి రానున్నారని బ్యాలెట్ బాక్స్ ఓట్లను గుర్తు చేశారు నాగార్జున. దీంతో ప్రోమో ముగిసింది. అయితే, హౌస్‍లోకి రతికా రోజ్ రీ-ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. బిగ్‍బాస్‍లో దసరా సంబరాలు ఎలా జరిగాయి.. ఎవరు రీ-ఎంట్రీ ఇచ్చారో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 22) బిగ్‍బాస్ ఎపిసోడ్ చూడాలి. సాధారణంగా ఆదివారం ఎపిసోడ్ రాత్రి 9 గంటలకు మొదలవుతుంది. అయితే, దసరా సెలెబ్రేషన్స్ కావడంతో ఈ ఎపిసోడ్ సాయంత్రం 7 గంటలకే మొదలుకానుంది.

మరోవైపు, ఈ వారం పూజా మూర్తి ఎలిమినేట్ అవుతారని లీకులు బయటికి వచ్చాయి.

IPL_Entry_Point