Bigg Boss 7 Elimination Today : అయ్యో మరో లేడీ కంటెస్టెంట్ ఔట్.. బిగ్ బాస్ హౌస్‍లోకి రతిక ఇన్!-bigg boss 7 eliminations puja murthy eliminate from bigg boss house and rathika rose re entry confirm ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 7 Elimination Today : అయ్యో మరో లేడీ కంటెస్టెంట్ ఔట్.. బిగ్ బాస్ హౌస్‍లోకి రతిక ఇన్!

Bigg Boss 7 Elimination Today : అయ్యో మరో లేడీ కంటెస్టెంట్ ఔట్.. బిగ్ బాస్ హౌస్‍లోకి రతిక ఇన్!

Anand Sai HT Telugu
Oct 22, 2023 07:53 AM IST

Bigg Boss 7 Elimination : బిగ్ బాస్‍ నుంచి ఈసారి వరుసగా లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతున్నారు. తాజాగా మరో లేడీ కంటెస్టెంట్ బయటకు వెళ్తున్నట్టుగా సమాచారం. ఇక.. రతిక రోజ్ హౌస్‍లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది.

రతిక రోజ్
రతిక రోజ్ (Instagram)

బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss Season 7) ఉల్టాపుల్టా అని ముందునుంచే చెబుతున్నారు. దీనికి తగ్గట్టుగానే ప్లాన్ చేస్తున్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో తెలియకుండా ఉంది. ఊహించింది ఒకరైతే.. ఎలిమినేట్ అయ్యేది మరొకరు ఉంటున్నారు. దీంతో ప్రేక్షకులకు కూడా ఆసక్తిగా ఉంటుంది. ఈసారి కూడా లేడీ కంటెస్టెంట్‍నే ఎలిమినేట్ చేస్తున్నారు. కిందటి సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన నయని పావనిని ఎలిమినేట్ అయింది. ఈ వారం పూజా మూర్తి ఎలిమినేట్ అవుతోందని సమాచారం. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని తెలుస్తోంది.

పూజా మూర్తి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే కంటెస్టెంట్లతో ఎక్కువగా కలిసినట్టుగా అనిపించడం లేదు. టాస్కుల్లోనూ పెద్దగా చురుకుగా ఉండటం లేదు. మెున్న నామినేషన్స్ సమయంలో ప్రశాంత్‍ను ఎలిమినేట్ చేసేందుకు చెప్పిన కారణం కూడా జనాలకు పెద్దగా ఎక్కలేదు. కంటెస్టెంట్లతో ఆమె సరిగా కలిసిపోవడం లేదని ప్రేక్షకులు అనుకుంటున్నారు. దీంతో ఆమెను బయటకు పంపించేందుకు సిద్ధమయ్యారు. దీంతో వరుసగా మరోసారి లేడీ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేయనుంది.

ఇక హౌస్‍లోకి ఎవరు వస్తారా అని అందరికీ ఆసక్తిగా ఉంది. రతికను బిగ్ బాస్‍ హౌస్‍లోకి(Rathika In Bigg Boss House) మళ్లీ తీసుకుని రానున్నారు. రతిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెుదట్లో పల్లవి ప్రశాంత్‍తో బాగుంది. తర్వాత యావర్‌కు దగ్గరైంది. కొన్ని రోజులు శివాజీతో స్నేహం చేసింది. అయితే ఆమె ఎవరికి దగ్గర అవుతుందో వారినే నామినేషన్ చేస్తూ ఉంటుంది. ఈ విషయం ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో ఆమెను బయటకు పంపించేశారు.

అయితే బయటకు వెళ్లిన కంటెస్టెంట్లను మళ్లీ తీసుకొచ్చేందుకు బిగ్ బాస్ ప్లాన్ చేశాడు. ఇక్కడే మరో ట్విస్ట్ ఇచ్చాడు. హౌస్‍లోకి కంటెస్టెంట్లు వచ్చేందుకు హౌస్‍మేట్స్ తో ఓటింగ్ పెట్టాడు. ఇందులో శుభ శ్రీ, దామిని, రతిక ఉన్నారు. మళ్లీ ఎంట్రీ ఇచ్చేందుకు శుభ శ్రీ, దామినికి హౌస్ మేట్స్ ఎక్కువగా ఓట్లు వేశారు. కానీ ఇది ఉల్టాపుల్టా సీజన్ కదా.. తక్కువ ఓట్లు వచ్చిన వారికి హౌస్‍లోకి ఎంట్రీ ఇవ్వాలని బిగ్ బాస్ నిర్ణయించాడు. ఎందుకంటే ఎక్కువ ఓట్లు వస్తే.. వచ్చినవారు.. ఎవరితోనూ సరిగా గొడవ పెట్టుకోలేరు. అదే తక్కువ ఓట్లు వేసిన వ్యక్తి వస్తే.. గొడవలు ఎక్కువే ఉంటాయి.

ఇక రతిక గురించి ప్రేక్షకులకు బాగా తెలుసు. ఆమె ఎంట్రీ ఇస్తే.. ప్రశాంత్, యావర్ పరిస్థితి ఏంటని అందరూ ఆలోచనల్లో పడ్డారు. మళ్లీ వారిని ఆడుకుంటుందా? లేదా అనేది ఆసక్తిగా మారింది. బయటకు వచ్చిన రతిక.. తనపై వ్యతిరేకత ఎందుకు వచ్చిందని పరిశీలించుకుని.. ప్రశాంత్, యావర్‍తో బాగుండే అవకాశం ఉంది. మళ్లీ అలానే ఆడితే.. ప్రేక్షకులు మరోసారి పంపించే ఛాన్స్ ఉంది. ఈ వారం ఎంట్రీ ఇవ్వనున్న రతిక ఎపిసోడ్‍ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురచూస్తున్నారు. తనపై వచ్చిన నెగెటివిటీని రతిక ఎలా పోగొట్టుకుంటుందో చూడాలిక.

IPL_Entry_Point