Dil Raju: ఆర్య కథ లాంటి ఫీలింగ్ కలిగింది ఈ మూవీ స్టోరీ విన్నప్పుడు: దిల్ రాజు-dil raju comments on love me if you dare and comparing with arya story ashish reddy vaishnavi chaitanya love me teaser ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Dil Raju Comments On Love Me If You Dare And Comparing With Arya Story Ashish Reddy Vaishnavi Chaitanya Love Me Teaser

Dil Raju: ఆర్య కథ లాంటి ఫీలింగ్ కలిగింది ఈ మూవీ స్టోరీ విన్నప్పుడు: దిల్ రాజు

Sanjiv Kumar HT Telugu
Mar 09, 2024 07:47 AM IST

Dil Raju About Love Me If You Dare: దిల్ రాజు సోదరిడి కుమారుడు ఆశిష్ హీరోగా నటించిన మరో సినిమా లవ్ మీ. ఇఫ్ యూ డేర్ అనేది ట్యాగ్ లైన్. ఇటీవల జరిగిన లవ్ మీ ఇఫ్ యు డేర్ టీజర్ లాంచ్‌లో దిల్ రాజు చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఆర్య కథ లాంటి ఫీలింగ్ కలిగింది ఈ మూవీ స్టోరీ విన్నప్పుడు: దిల్ రాజు
ఆర్య కథ లాంటి ఫీలింగ్ కలిగింది ఈ మూవీ స్టోరీ విన్నప్పుడు: దిల్ రాజు

Dil Raju Love Me If You Dare Arya: యంగ్ హీరో ఆశిష్, బేబి సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య నటించిన చిత్రం లవ్ మీ. ఇఫ్ యు డేర్ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రాన్నిశిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిది నిర్మించారు. ఈ మూవీకి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను గురువారం (మార్చి 7) విడుదల చేశారు. గురు నానక్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

"ఆర్య సినిమాతో సుకుమార్‌ను ఇంట్రడ్యూస్ చేశాం. ఆర్య విన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో.. లవ్ మీ ఇఫ్ యూ డేర్ కథ విన్నప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ కలిగింది. ఇదొక న్యూ ఏజ్ లవ్ స్టోరీ. ఇలాంటి పాయింట్‌తో ఇంత వరకు కథ రాలేదు. పీసీ శ్రీరామ్ గారి కెమెరా, కీరవాణి గారి సంగీతం ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. త్వరలోనే పాటను రిలీజ్ చేయబోతోన్నాం. అది యూత్‌కు బాగా నచ్చేస్తుంది. ఈ చిత్రానికి హీరోయిన్ చాలా ముఖ్యం" అని దిల్ రాజు అన్నారు.

"బేబీ మూవీ అప్పుడే సూపర్ హిట్ అయింది. వైష్ణవి దొరుకుతుందో లేదో అనుకున్నాం. స్క్రిప్ట్ విను నచ్చితేనే చేయ్ అని అన్నాను. మళ్లీ ఆఫీస్‌కు వచ్చి నాలుగు గంటలు స్క్రిప్ట్ చదివింది. వైష్ణవి లేకుంటే ఈ సినిమాను ఇంత ఎంజాయ్ చేసే వాళ్లం కాదు. ఫస్ట్ ఈవెంట్ ఇక్కడ చేశాం. సక్సెస్ మీట్‌ను కూడా ఇక్కడే నిర్వహిస్తాం" అని లవ్ మీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో దిల్ రాజు తెలిపారు.

"నేను మాట్లాడే దాని కన్నా నా సినిమా మాట్లాడాలని అనుకుంటున్నాను. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారికి థాంక్స్. థియేటర్‌కు రండి. మా సినిమాను చూడండి. ఎంజాయ్ చేయండి" అని లవ్ మీ డైరెక్టర్ డైరైరెక్టర్ అరుణ్ భీమవరపు నమ్మకంగా చెప్పారు.

"లవ్ మీ టీజర్‌కు ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్న స్టూడెంట్స్‌కి థాంక్స్. ఈ చిత్రంలో నేను దెయ్యం అని తెలిసి లవ్ చేస్తాను. అమ్మాయిలు దెయ్యాలు కాదు దేవతలు. లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే సినిమా అరుణ్, నాగ వల్ల మా వద్దకు వచ్చింది. కాలేజ్ స్టూడెంట్స్‌కి నచ్చే కథ వస్తే దిల్ రాజు గారు వెంటనే ముందుకు వస్తారు. ఆయన ఇంకా యంగ్ కుర్రాడిలానే ఉంటారు. మా సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. పీసీ శ్రీరామ్ గారు మా సినిమాకు పని చేయడం అదృష్టం" అని హీరో ఆశిష్ రెడ్డి తెలిపాడు.

"గురు నానక్ కాలేజ్‌లోనే బేబి సినిమాను షూట్ చేశాం. ఇప్పుడు మా సినిమా టీజర్‌ను రిలీజ్ చేశాం. ఇది నాకు చాలా లక్కీ కాలేజ్. లవ్ మీ టీజర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. బేబి వల్లే నాకు ఈ చిత్రంలో ఛాన్స్ వచ్చింది. ‘లవ్ మీ’ స్కేరీ, రొమాంటిక్ లవ్ స్టోరీ. ఇలాంటి పాయింట్, స్టోరీ ఇంత వరకు నేను చూడలేదు. వినలేదు. థియేటర్‌లో చూసేటప్పుడు నవ్వుకుంటారు. షాక్ అవుతారు. కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. పీసీ శ్రీరామ్ సర్, కీరవాణి సర్, అవినాష్ కొల్ల సర్ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లారు. ఏప్రిల్ 27న మా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం" అని హీరోయిన్ వైష్ణవి చైతన్య పేర్కొంది.

IPL_Entry_Point