Nani Yellamma Movie: నాని నెక్ట్స్ మూవీ ఎల్లమ్మ.. బలగం వేణు డైరెక్షన్‌ కన్ఫమ్ చేసిన దిల్ రాజు-nani yellamma movie balagam venu to direct producer dil raju confirmed the details at love me teaser launch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nani Yellamma Movie: నాని నెక్ట్స్ మూవీ ఎల్లమ్మ.. బలగం వేణు డైరెక్షన్‌ కన్ఫమ్ చేసిన దిల్ రాజు

Nani Yellamma Movie: నాని నెక్ట్స్ మూవీ ఎల్లమ్మ.. బలగం వేణు డైరెక్షన్‌ కన్ఫమ్ చేసిన దిల్ రాజు

Hari Prasad S HT Telugu

Nani Yellamma Movie: టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ లో మూవీ రాబోతోంది. బలగం వేణు డైరెక్షన్ లో నేచురల్ స్టార్ నాని నటించబోతున్న సినిమాకు ఎల్లమ్మ అనే టైటిల్ పెట్టినట్లు ప్రొడ్యూసర్ దిల్ రాజు వెల్లడించాడు.

నాని నెక్ట్స్ మూవీ ఎల్లమ్మ.. బలగం వేణు డైరెక్షన్‌ కన్ఫమ్ చేసిన దిల్ రాజు

Nani Yellamma Movie: టాలీవుడ్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ లలో ఇదీ ఒకటని చెప్పొచ్చు. ఇది అలాటిలాంటి కాంబినేషన్ కాదు. నేచురల్ స్టార్ నానితో బలగంలాంటి సూపర్ డూపర్ హిట్ మూవీ అందించిన వేణు యెల్దండి తీయబోతున్న మూవీ. ఈ సినిమాకు ఎల్లమ్మ అంటూ ఓ మాస్ టైటిల్ కూడా పెట్టేశారు. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ దిల్ రాజు వెల్లడించడం విశేషం.

నాని, వేణు ఎల్లమ్మ

బలగం వేణు డైరెక్షన్ లో నాని సినిమా చేయబోతున్నాడని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ దిల్ రాజు గురువారం (మార్చి 7) కన్ఫమ్ చేశాడు. లవ్ మి మూవీ టీజర్ లాంచ్ సందర్భంగా అతడు ఈ విషయాన్ని చెప్పాడు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ సినిమా పైనల్ అయినట్లు తెలిపాడు.

"నాని, వేణు యెల్దండి మూవీ అప్డేట్ ఏంటి" అని ఓ అభిమాని దిల్ రాజును ప్రశ్నించాడు. దీనికి అతడు స్పందిస్తూ.. "ఫైనల్ అయింది ఎల్లమ్మ వస్తది" అని చెప్పడం విశేషం. అది వినగానే అక్కడున్న ఫ్యాన్స్ అంతా గట్టిగా అరిచారు. నాని, వేణు మూవీ రావడమే కాదు.. సినిమా టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు దిల్ రాజు చెప్పడం అభిమానులను ఆనందానికి గురి చేసింది.

దసరా తర్వాత మరో మాస్

బలగం మూవీ డైరెక్టర్ వేణు డైరెక్షన్ లో తాను నటించాలని అనుకుంటన్నట్లు గతంలో ఓసారి నాని చెప్పాడు. అప్పటి నుంచీ వీళ్ల కాంబినేషన్ లో మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ప్రొడ్యూసరే ఆ విషయాన్ని కన్ఫమ్ చేశాడు. గతేడాది దసరా మూవీతో ఊర మాస్ అవతారంలో కనిపించిన నాని.. మరోసారి ఈ ఎల్లమ్మలో అలాంటి పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఎల్లమ్మ మూవీ స్టోరీ, బ్యాక్‌డ్రాప్ ఏంటన్నది మాత్రం ప్రస్తుతానికి బయటకు రాలేదు. ఇప్పుడు నాని సరిపోదా శనివారం మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత నాని32 కూడా లైన్లో ఉంది. ఈ రెండు సినిమాల తర్వాతే ఈ నాని, వేణు మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సినిమా వస్తది అని మాత్రం దిల్ రాజు చెప్పాడు తప్ప.. దీని గురించి ఇంకా ఏ వివరాలూ బయటపెట్టలేదు.

నాని నటిస్తున్న సరిపోదా శనివారం మూవీ ఆగస్ట్ 29న రిలీజ్ కు సిద్ధమవుతోంది. వివేక్ ఆత్రేయ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదొక సూపర్ హీరో సినిమాగా చెబుతున్నారు. ఈ సినిమా తర్వాత సాహో, ఓజీ ఫేమ్ సుజీత్ డైరెక్షన్ లో నాని మరో సినిమా చేయనున్నాడు.

మరోవైపు అడపాదడపా సినిమాల్లో కమెడియన్ పాత్రల ద్వారా ప్రేక్షకుల పరిచయమై జబర్దస్త్ షో ద్వారా దగ్గరయ్యాడు వేణు యెల్దండి. అయితే గతేడాది బలగం సినిమా ద్వారా అతనిలోని టాలెంటెడ్ దర్శకుడు కూడా పరిచయమయ్యాడు. అలాంటి డైరెక్టర్ నానిలాంటి హీరోతో సినిమా చేయబోతున్నాడంటే ఏదో గట్టి సబ్జెక్ట్ తోనే వస్తాడన్న నమ్మకం అభిమానుల్లో ఉంది.