Devara Second Single: దేవర సెకండ్ సింగిల్ వచ్చేది ఆ రోజే.. తారక్, జాన్వీ రొమాంటిక్ పోస్టర్‌తో అనౌన్స్‌మెంట్-devara second single on august 5th jr ntr janhvi kapoor romantic poster released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devara Second Single: దేవర సెకండ్ సింగిల్ వచ్చేది ఆ రోజే.. తారక్, జాన్వీ రొమాంటిక్ పోస్టర్‌తో అనౌన్స్‌మెంట్

Devara Second Single: దేవర సెకండ్ సింగిల్ వచ్చేది ఆ రోజే.. తారక్, జాన్వీ రొమాంటిక్ పోస్టర్‌తో అనౌన్స్‌మెంట్

Hari Prasad S HT Telugu
Aug 02, 2024 07:29 PM IST

Devara Second Single: దేవర మూవీ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది. శుక్రవారం (ఆగస్ట్ 2) ఈ సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ రొమాంటిక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

దేవర సెకండ్ సింగిల్ వచ్చేది ఆ రోజే.. తారక్, జాన్వీ రొమాంటిక్ పోస్టర్‌తో అనౌన్స్‌మెంట్
దేవర సెకండ్ సింగిల్ వచ్చేది ఆ రోజే.. తారక్, జాన్వీ రొమాంటిక్ పోస్టర్‌తో అనౌన్స్‌మెంట్

Devara Second Single: దేవర మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలుసు కదా. ఇప్పుడీ పాన్ ఇండియా మూవీ నుంచి సెకండ్ సింగిల్ కూడా రాబోతోంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఈ మూవీలోని సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ.. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ రొమాంటిక్ పోజులో ఉన్న పోస్టర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

దేవర సెకండ్ సింగిల్

దేవర మూవీ నుంచి సెకండ్ సింగిల్ ఆగస్ట్ 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఎన్నో రోజులుగా ఈ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే అంటూ ఊరిస్తూ వచ్చిన మేకర్స్.. మొత్తానికి మరో మూడు రోజుల్లోనే ఈ పాటను రిలీజ్ చేయనున్నారు. మొదటి సాంగ్ దేవర గొప్పతనాన్ని చెబుతూ సాగిన మాస్ సాంగ్ కాగా.. రెండోది రొమాంటిక్ సాంగ్ కానుంది.

అందుకే ఈ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ చెబుతూ.. తారక్, జాన్వీ రొమాంటిక్ పోజులో ఉన్న పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఇద్దరి కెమెస్ట్రీ అదుర్స్ అనిపించేలా ఉంది. తొలిసారి ఓ తెలుగు సినిమాలో నటిస్తున్న జాన్వీ.. తన అందంతో ఇక్కడి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుంది. జాన్వీ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్ లో కనిపించింది.

ఇక తారక్ అయితే హాఫ్ స్లీవ్స్ షర్ట్ లో స్టైలిష్ గా కనిపించాడు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ పోషిస్తున్నాడు. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. దేవర పార్ట్ 1 ఇది. పార్ట్ 2 కూడా రాబోతోంది. పార్ట్ 1లో బాబీ డియోల్ కూడా మరో విలన్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దేవర సెకండ్ సింగిల్ రిలీజ్ గురించి ఎన్టీఆర్ ఆర్ట్స్ తోపాటు దేవర మూవీ అకౌంట్, అనిరుధ్ రవిచందర్ లాంటి వాళ్లు తమ ఎక్స్ అకౌంట్ల ద్వారా షేర్ చేశారు. ఆగస్ట్ 5 నుంచి క్రేజీ అయిపోదాం అనే క్యాప్షన్ తో దేవర మూవీ అధికారిక ఎక్స్ అకౌంట్ ఈ సెకండ్ సింగిల్ రిలీజ్ విషయాన్ని వెల్లడించింది. 

దేవర భారీ బిజినెస్

ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటిస్తున్న మూవీ ఇదే కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అదే తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ భారీగా జరగడానికి కారణమైంది. తెలుగు రాష్ట్రాల్లో దేవర డిస్ట్రిబ్యూషన్ హక్కుల మొత్తం రూ.110 కోట్లుగా అంచనా వేస్తున్నారు.

ఏపీలో సితారా ఎంటర్టైన్మెంట్స్ థియేట్రికల్ హక్కులను సంపాదించింది. ఇక తెలంగాణలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయనున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ హక్కుల విలువ రూ.110 కోట్లు కాగా.. ఓవర్సీస్ హక్కులు మరో రూ.27 కోట్లు పలికాయి. దీంతో ఈ సినిమా కేవలం తెలుగు వెర్షనే రూ.150 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్ వసూలు చేస్తే కానీ హిట్ జాబితాలో నిలవదు. ఇది నిజంగా చాలా పెద్ద మొత్తమే అని చెప్పాలి.