Deepika New Home: రూ.100 కోట్లు పెట్టి కొత్త ఇల్లు కొన్న కల్కి హీరోయిన్.. తన తొలి హీరో ఇంటి పక్కనే..-deepika padukone new home kalki 2898 ad actress bought 100 crores apartment beside shah rukh khan home mannat ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Deepika New Home: రూ.100 కోట్లు పెట్టి కొత్త ఇల్లు కొన్న కల్కి హీరోయిన్.. తన తొలి హీరో ఇంటి పక్కనే..

Deepika New Home: రూ.100 కోట్లు పెట్టి కొత్త ఇల్లు కొన్న కల్కి హీరోయిన్.. తన తొలి హీరో ఇంటి పక్కనే..

Hari Prasad S HT Telugu
Aug 29, 2024 02:40 PM IST

Deepika New Home: కల్కి 2898 ఏడీ హీరోయిన్ ఏకంగా రూ.100 కోట్లు పెట్టి ఓ లగ్జరీ ఇల్లు కొనుక్కుంది. అది కూడా తన తొలి సినిమా హీరో ఇంటి పక్కనే కావడం విశేషం. త్వరలోనే భర్తతో కలిసి గృహ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతోంది.

రూ.100 కోట్లు పెట్టి కొత్త ఇల్లు కొన్న కల్కి హీరోయిన్.. తన తొలి హీరో ఇంటి పక్కనే..
రూ.100 కోట్లు పెట్టి కొత్త ఇల్లు కొన్న కల్కి హీరోయిన్.. తన తొలి హీరో ఇంటి పక్కనే..

Deepika New Home: కల్కి 2898 ఏడీ మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన హీరోయిన్ దీపికా పదుకోన్. త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్న ఆమె.. ముంబైలో ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసింది. దీని విలువ ఏకంగా రూ.100 కోట్లు కావడం విశేషం. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన బాంద్రాలో ఉన్న ఈ ఇంటి నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది.

దీపికా పదుకోన్ లగ్జరీ ఇల్లు

బాలీవుడ్ నటి దీపికా పదుకోన్, ఆమె భర్త రణ్‌వీర్ సింగ్ కలిసి ఈ ఇంటిని కొనుగోలు చేశారు. అయితే ఈ ఇల్లు బాంద్రాలో బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ ఇల్లు మన్నత్ పక్కనే కావడం విశేషం.

ఈ కింగ్ ఖాన్ తో కలిసి ఓం శాంతి ఓం మూవీ ద్వారానే దీపిక సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఈ మధ్యే కల్కి 2898 ఏడీ మూవీ ద్వారా తొలిసారి తెలుగు సినిమాలో నటించింది. దీపిక కొత్త ఇంటి గురించి మనీ కంట్రోల్ తన రిపోర్టులో ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

దీపిక కొత్త ఇల్లు ఇలా..

ఆ రిపోర్టు ప్రకారం దీపిక, రణ్‌వీర్ అపార్ట్‌మెంట్ ముంబైలోని బాంద్రా బ్యాండ్‌స్టాండ్ లో ఉంది. సముద్రానికి అభిముఖంగా ఉన్న క్వాడ్రాప్లెక్స్ అపార్ట్‌మెంట్ ఇది. ఏకంగా 11266 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ ఆ బిల్డింగ్ లోని 16 నుంచి 19వ అంతస్తు వరకు ఉండటం విశేషం.

దీని విలువ సుమారు రూ.100 కోట్లు అని ఆ రిపోర్టు వెల్లడించింది. మూడేళ్ల కిందట అలీబాగ్ లోనూ ఈ జంట రూ.22 కోట్లతో ఓ బంగ్లా తీసుకుంది.

దీపిక, రణ్‌వీర్ రిలేషన్‌షిప్ ఇలా..

దీపిక, రణ్‌వీర సింగ్ కలిసి 2013లో వచ్చిన రామ్‌లీలా మూవీలో తొలిసారి నటించారు. ఆ మూవీ సెట్స్ లోనే వీళ్లు ప్రేమలో పడ్డారు. ఐదేళ్ల పాటు డేటింగ్ చేసిన జంట.. 2018లో పెళ్లి చేసుకుంది. ఇక ఈ ఏడాది మొదట్లోనే దీపిక తన తొలి ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది. సెప్టెంబర్ లోనే ఆమె తొలి సంతానానికి వెల్‌కమ్ చెప్పనుంది. ఈ ఇద్దరూ రామ్‌లీలాతోపాటు బాజీరావ్ మస్తానీ, పద్మావత్, ఫైండింగ్ ఫ్యానీ, 83, సర్కస్ లాంటి సినిమాల్లో నటించారు.

ఇక నవంబర్ 1న రిలీజ్ కానున్న సింగం అగైన్ మూవీలోనూ వీళ్లు కలిసి నటించారు. ఈ మూవీలో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్, టైగర్ ష్రాఫ్, జాకీ ష్రాఫ్ లాంటి వాళ్లు నటించారు. ఇక దీపిక కల్కి 2898 ఏడీ మూవీ సీక్వెల్లోనూ నటించనుంది. తొలి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె మళ్లీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.