OTT Thriller Series: ఓటీటీలో దూసుకెళుతున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. మైలురాయిని దాటేసిన సిరీస్
Gyaarah Gyaarah OTT Thriller Series: ‘గ్యారా గ్యారా’ వెబ్ సిరీస్ ఓటీటీలో అదరగొడుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సిరీస్‍కు భారీ వ్యూస్ దక్కుతున్నాయి. అప్పుడే ఈ సిరీస్ ఓ మైల్‍స్టోన్ దాటేసింది.
ఓటీటీల్లో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ వెబ్ సిరీస్‍లకు సాధారణంగానే మంచి క్రేజ్ ఉంటుంది. ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తే మంచి వ్యూస్ దక్కించుకుంటుంటాయి. ఈ జాబితాలోనే చేరింది గ్యారా గ్యారా వెబ్ సిరీస్. మూడు టైమ్‍లైన్‍ల మధ్య సాగే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో మంచి ఆరంభాన్ని అందుకుంది. ఈ సిరీస్‍కు ఉమేశ్ బిస్త్ దర్శకత్వం వహించారు. ‘గ్యారా గ్యారా’ స్ట్రీమింగ్‍కు వచ్చిన మూడో రోజుల్లోగానే ఓ మైల్‍స్టోన్ దాటేసింది.
‘100’ మైలురాయి అధిగమించి..
గ్యారా గ్యారా వెబ్ సిరీస్ ఆగస్టు 9వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. మూడు రోజులు ముగియకుండానే ఈ సిరీస్ ఓ మైలురాయి దాటింది. ఈ సిరీస్ 100 మిలియన్ వాచ్ మినిట్స్ దాటేసింది. ఈ విషయాన్ని జీ5 ఓటీటీ అధికారికంగా వెల్లడించింది.
గ్యారా గ్యారా సిరీస్ మూడు రోజుల్లో 100 మిలియన్ వాచ్ మినిట్స్ దాటిందంటూ ఓ పోస్టర్‌ను నేడు (ఆగస్టు 12) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది జీ5 ఓటీటీ. ఈ సిరీస్‍లో ప్రధాన పాత్రలు చేసిన రాఘవ్ జుయల్, ధైర్య కర్వా, కృతిక కర్మతో ఈ పోస్టర్ తీసుకొచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‍లో ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లుగా నటించారు.
మూడు టైమ్‍లైన్లతో..
గ్యారా గ్యారా వెబ్ సిరీస్‍ను ఇంట్రెస్టింగ్ స్టోరీతో థ్రిల్లర్ సిరీస్‍గా రూపొందించారు దర్శకుడు ఉమేశ్ బిస్త్. సౌత్ కొరియా సిరీస్ సిగ్నల్ ఆధారంగా ఈ సిరీస్‍ను తెరకెక్కించారు. 1990, 2001, 2016 ఇలా మూడు టైమ్ లైన్ల మధ్య గ్యారా గ్యారా సిరీస్‍ను నడిపారు డైరెక్టర్. వాకీ టాకీ ద్వారా ఒక కాలం నుంచి మరొక కాలానికి మాట్లాడే కాన్సెప్ట్ కూడా ఉంది. ఈ టైమ్‍లైన్ల మధ్య సమాచారాన్ని షేర్ చేసుకుంటూ కేసులను ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తారు. ఈ సిరీస్‍కు కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా మంచి వ్యూస్ దక్కించుకుంటోంది.
గ్యారా గ్యారా సిరీస్‍లో రాఘవ్ జుయల్, కృతిక, ధైర్యతో పాటు గౌతమి కపూర్, హర్ష్ ఛాయ, ఆకాశ్ దీక్షిత్, విదూషి మనదులీ కీలకపాత్రలు పోషించారు. ధర్మ ప్రొడక్షన్స్, షిఖ్యా ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకాలపై కరణ్ జోహ్రా, అపూర్వ మెహతా, గుణీత్ మోంగా, అచిన్ జైన్ సంయుక్తంగా ప్రొడ్యూజ్ చేశారు.
ఈ వారమే ‘మనోరతంగల్’ సిరీస్
జీ5 ఓటీటీలో ఈ వారం మనోరతంగల్ వెబ్ సిరీస్ రానుంది. ఆగస్టు 15వ తేదీన ఈ ఆంథాలజీ వెబ్ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ సిరీస్‍పై చాలా హైప్ ఉంది. కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్, ఫాహల్ ఫాజిల్ లాంటి స్టార్ నటులు ఈ సిరీస్‍లో నటించటంతో భారీ అంచనాలు ఉన్నాయి. మనోరతంగల్ వెబ్ సిరీస్‍లో 9 విభిన్న కథలు ఉంటాయి. ఈ సిరీస్ కోసం మొత్తం 8 మంది దర్శకులు పని చేశారు. ఈ భారీ వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మరో మూడు రోజుల్లో ఆగస్టు 15న ఈ సిరీస్ జీ5 ఓటీటీలో మనోరతంగల్ స్ట్రీమింగ్‍కు రానుంది. మలయాళంలో రూపొందిన ఈ సిరీస్ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల వెర్షన్‍లోనూ అందుబాటులో ఉంటుంది.