OTT Crime Thriller: మర్డర్ మిస్టరీతో వస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-crime thriller web series gyaarah gyaarah release date on zee5 ott mystery series ott streaming date kill fame raghav ju ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Crime Thriller: మర్డర్ మిస్టరీతో వస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Crime Thriller: మర్డర్ మిస్టరీతో వస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 04, 2024 09:41 PM IST

Gyaarah Gyaarah OTT Crime Thriller: గ్యారా.. గ్యారా వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. ఈ వారంలోనే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అడుగుపెట్టనుంది. డిఫరెంట్ టైమ్‍లైన్‍లతో ఈ సిరీస్ స్టోరీ ఉంటుంది. ఏ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుందంటే..

OTT Crime Thriller: మర్డర్ మిస్టరీతో వస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
OTT Crime Thriller: మర్డర్ మిస్టరీతో వస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

ఓటీటీల్లోకి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‍లు వరుసగా వస్తూనే ఉన్నాయి. వీటికి ఆదరణ కూడా ఇదే విధంగా దక్కుతోంది. ఇప్పుడు మరో థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్‍కు సిద్ధమైంది. ‘గ్యారా గ్యారా’ పేరుతో వెబ్ సిరీస్ వస్తోంది. ఇటీవలే కిల్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జుయల్ ఈ సిరీస్‍లో ప్రధాన పాత్ర పోషించారు. ధైర్య కర్వా, కృతిక కర్మ కూడా మెయిన్ రోల్స్ చేశారు. గ్యారా గ్యారా సిరీస్ స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

గ్యారా గ్యారా సిరీస్ ఆగస్టు 9వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సిరీస్‍కు సంబంధించిన కొత్త ప్రోమోను నేడు (ఆగస్టు 4) ఆ ఓటీటీ తీసుకొచ్చింది. డిఫరెంట్ టైమ్‍లైన్ల మధ్య ఈ మర్డర్ మిస్టరీ స్టోరీ సాగుతుందని ప్రోమోలో అర్థమవుతోంది. హత్య కేసులను పోలీసులు దర్యాప్తు చేస్తుంటారు. జీ5 ఓటీటీలో ఆగస్టు 9 నుంచి గ్యారా గ్యారా సిరీస్‍‍ను చూడొచ్చు.

కొరియన్ సిరీస్ ఆధారంగా..

గ్యారా గ్యారా వెబ్ సిరీస్‍కు ఉమేశ్ బిస్త్ దర్శకత్వం వహించారు. దక్షిణ కొరియా సిరీస్ సిగ్నల్ ఆధారంగా ఈ సిరీస్‍ను తెరకెక్కిస్తున్నారు. ఒకేసారి విభిన్న టైమ్‍లైన్‍ల మధ్య ఈ కథ సాగుతుంది. ఈ సిరీస్‍లో రాఘవ్ జుయల్, కృతిక, ధైర్య ప్రధాన పాత్రలు చేశారు. గౌతమి కపూర్, గౌరవ్ శర్మ, హర్ష్ ఛాయ, ముక్తి మోహన్, పూర్ణేందు భట్టాచార్య కీలక పాత్రలు పోషించారు.

స్టోరీ లైన్

గ్యారా గ్యారా సిరీస్ మూడు డిఫరెంట్ టైమ్‍ లైన్ల చుట్టూ నడుస్తూ ఉంటుంది. రాఘవ్ జుయెల్, కృతిక సర్మ, ధైర్య కర్వా పోలీస్ ఆఫీసర్లుగా పని చేస్తుంటారు. చాలా ఏళ్లుగా మిస్టరీగానే ఉన్న ఓ మర్డర్ కేసు విచారణను చేపడతారు. ఈ క్రమంలో ఓ బాలిక మృతదేహం లభ్యమవుతుంది. వాకీ టాకీల ద్వారా ఈ సిరీస్‍లో ఒక కాలం నుంచి మరో కాలానికి మాట్లాడుతుంటారు పోలీసులు. ఈ కేసుల మిస్టరీని వారు ఛేదిస్తారా? నిజాలను బయటికి తెస్తారా? అనేది ఈ సిరీస్‍లో చూడాలి.

గ్యారా గ్యారా సిరీస్‍ను కరణ్ జోహార్, అపూర్వ మెహతా, గునీత్ మోంగ్రా కపూర్, అచిన్ జైన్ సంయుక్తంగా నిర్మించారు. ట్రైలర్, ప్రోమోలతో ఈ సిరీస్‍పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

జీ5లో అదరగొడుతున్న త్రిష వెబ్ సిరీస్

స్టార్ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్ర పోషించిన బృంద వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో వచ్చింది. ఈ సిరీస్‍కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో భారీగా వ్యూస్ దక్కించుకుంటోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఆగస్టు 2వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ సిరీస్ కూడా మర్డర్ మిస్టరీని ఛేదించడం చుట్టే సాగుతుంది. త్రిష, రవీంద్ర విజయ్ ఈ సిరీస్‍లో ప్రధాన పాత్రలు పోషించారు. సూర్య మనోజ్ వంగల దర్శకత్వం వహించారు. బృంద సిరీస్‍ను యాడింగ్ అడ్వర్టైజింగ్ ఎల్ఎల్‍పీ బ్యానర్‌ నిర్మించగా.. శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ ఇచ్చారు.