Inception 2: నోలాన్ మాస్టర్‌పీస్ మూవీ ఇన్‍సెప్షన్‍కు సీక్వెల్ రానుందా?-christopher nolan inception 2 hopes sparked after a cryptic teaser ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Inception 2: నోలాన్ మాస్టర్‌పీస్ మూవీ ఇన్‍సెప్షన్‍కు సీక్వెల్ రానుందా?

Inception 2: నోలాన్ మాస్టర్‌పీస్ మూవీ ఇన్‍సెప్షన్‍కు సీక్వెల్ రానుందా?

Chatakonda Krishna Prakash HT Telugu
May 14, 2024 03:58 PM IST

Inception 2: ఇన్‍సెప్షన్ సినిమాకు సీక్వెల్ విషయంలో ఆశలు చిగురించాయి. ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్‍ అది ఇన్‍సెప్షన్ 2 గురించే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆ వివరాలివే.

Inception 2: నోలాన్ మాస్టర్‌పీస్ మూవీ ఇన్‍సెప్షన్‍కు సీక్వెల్ రానుందా?
Inception 2: నోలాన్ మాస్టర్‌పీస్ మూవీ ఇన్‍సెప్షన్‍కు సీక్వెల్ రానుందా?

Inception 2: హాలీవుడ్‍‍లో ‘ఇన్‍సెప్షన్’ ఓ గ్రేట్ మూవీలా నిలిచిపోయింది. ఈ మాస్టర్‌పీస్ సినిమాను దిగ్గడ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలాన్ తెరకెక్కించారు. 2010లో రిలీజైన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ప్రేక్షకులను ఆశ్చర్యపోయేలా చేసింది. అందరి మెదళ్లకు కూడా ఈ మూవీ బాగా పని చెప్పింది. లినార్డో డికాప్రియో ప్రధాన పాత్ర పోషించిన ‘ఇన్‍సెప్షన్’ గొప్ప సినిమాగా పేరు తెచ్చుకోవడంతో పాటు కమర్షియల్‍గా కూడా బ్లాక్‍బస్టర్ అయింది.

సీక్వెల్ రానుందా?

ఈ క్లాసిక్ మూవీకి సీక్వెల్ వస్తుందని తాజాగా ఆశలు చిగురించాయి. ఎంపైర్ మ్యాగజీన్ చేసిన ఓ ట్వీట్‍తో ఇన్‍సెప్షన్ 2 వస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇన్‍సెప్షన్ సినిమాలో ఉండే లాంటి బొంగరాన్ని (స్పిన్) ఎంపైర్ మ్యాగజీన్ పోస్ట్ చేసింది. టాప్ నుంచి స్పిన్ అవుతున్నట్టుగా ఉంది. ‘త్వరలో వచ్చేస్తోంది’ అంటూ పేర్కొంది.

సోషల్ మీడియాలో బజ్

ఈ పోస్ట్‌తో సోషల్ మీడియాలో ఫుల్ బజ్ నడుస్తోంది. ఇది ఇన్‍సెప్షన్ 2 గురించేనా అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. సీక్వెల్ గురించే అని ఊహించుకుంటుంటేనే చాలా హ్యాపీగా ఉందని అని మరికొందరు అంటున్నారు. క్రిస్టఫర్ నోలాన్ కొత్త ప్రింట్ ఇంటర్వ్యూతో రానున్న స్పెషల్ మ్యాగజీన్ ఎడిషన్ గురించేమో అని ఓ యూజర్ అనుమానం వ్యక్తం చేశారు.

మొత్తంగా ఇన్‍సెప్షన్ సీక్వెల్ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, ఇప్పటికీ ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు.

ఇప్పటివరకు హింట్ ఇవ్వని నోలాన్

ఇన్‍సెప్షన్ సినిమాకు సీక్వెల్ తీసుకొస్తామని క్రిస్టఫర్ నోలాన్ ఇప్పటి వరకు హింట్ ఇవ్వలేదు. రూమర్లు వస్తున్నా ఆయన ఈ విషయంపై ఎప్పుడూ కన్ఫర్మ్ చేయలేదు. ఇన్‍సెప్షన్ సినిమా క్లైమాక్స్‌ను కావాలనే నోలాన్ మిస్టరీగా.. అందరి ఊహలకు వదిసేశారు. 

క్రిస్టఫర్ నోలాన్ స్టోరీ టెల్లింగ్‍కు, విజన్‍కు ఇన్‍సెప్షన్ సినిమా మరో ఉదాహరణగా నిలిచింది. ఈ చిత్రం చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఆ లోకంలోకి వెళ్లి.. మెదడుకు పని చెప్పేలానే ఉంటుంది. కలల చుట్టూ తిరిగే ఈ చిత్రం మాస్టర్ పీస్‍గా నిలిచింది. అయితే, క్రిస్టఫర్ నోలాన్‍కు ఈ మూవీకి ఆస్కార్ రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

క్రిస్టఫర్ నోలాన్ సీక్వెల్స్ విషయంలో అంత ఆసక్తిగా ఉన్నట్టు కనిపించరు. తన కెరీర్లో కేవలం ది డార్క్ నైట్ సినిమాకు మాత్రమే ది డార్క్ నైట్ రైజెస్ అంటూ సీక్వెల్ తీసుకొచ్చారు. ఇక మిలిగిన చిత్రాలకు ఇప్పటి వరకు సీక్వెల్ తెరకెక్కించలేదు. తాను తెరకెక్కించిన మొమెంటో, ఇంటర్‌స్టెల్లార్ లాంటి గొప్ప చిత్రాలకు కూడా సీక్వెల్ గురించి నోలాన్ ఆలోచించలేదు. మరి, ఈ ఇన్‍సెప్షన్‍కు ఆయన సీక్వెల్ తీసుకొస్తారా.. లేదా అనేది చూడాలి.

ఓపెన్‍హైమర్‌తో ‘ఆస్కార్’

ఓపెన్‍హైమర్ సినిమాతో క్రిస్టఫర్ నోలాన్ ఆస్కార్ ఆశ నెరవేరింది. అణుబాంబు సృష్టికర్త రాబర్ట్ ఓపెన్‍హైమర్ జీవితంపై నోలాన్ తెరకెక్కించిన ఈ చిత్రం 2023లో థియేటర్లలో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించింది. ఓపెన్‍హైమర్ మూవీకి గాను ఉత్తమ డైరెక్టర్‌గా ఈ ఏడాది ఆస్కార్ అవార్డు అందుకున్నారు క్రిస్టఫర్ నోలాన్. ఆయనకు ఇదే తొలి ఆస్కార్. మొత్తంగా ఓపెన్‍హైమర్ మూవీకి ఏడు ఆస్కార్ అవార్డులు దక్కాయి.

IPL_Entry_Point