Urvashi Rautela: చిరంజీవి చెప్పింది చాలా కరెక్ట్: ఊర్వశి రౌతేలా-chiranjeevi is absolutely correct says urvashi rautela ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Urvashi Rautela: చిరంజీవి చెప్పింది చాలా కరెక్ట్: ఊర్వశి రౌతేలా

Urvashi Rautela: చిరంజీవి చెప్పింది చాలా కరెక్ట్: ఊర్వశి రౌతేలా

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 19, 2023 10:51 PM IST

Urvashi Rautela: మెగాస్టార్ చిరంజీవి తనతో గతంలో చెప్పిన ఓ మాట నిజమేనని చెప్పారు ఊర్వశీ రౌతేలా. స్కంద సినిమాలో రామ్‍ పోతినేనితో కల్ట్ మామ స్పెషల్ సాంగ్‍లో చిందేశారు ఊర్వశి.

ఊర్వశి రౌతేలా
ఊర్వశి రౌతేలా

Urvashi Rautela: తెలుగు సినిమాల్లో ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ అంటే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలానే ఫస్ట్ చాయిస్‍గా అనుకుంటున్నారు మేకర్స్. వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో సినిమాల్లో స్పెషల్ పాటల్లో ఊర్వశి చిందేశారు. తాజాగా, రామ్ పోతినేని హీరోగా నటించిన స్కంద సినిమాలో కల్ట్ మామ పాటలో డ్యాన్స్ తో అదరగొట్టారు ఊర్వశి రౌతేలా. హాట్ డ్రెస్‍లో దుమ్మురేపారు. రామ్ పోతినేనితో నువ్వానేనా అన్నట్టుగా డ్యాన్స్ చేశారు. సెప్టెంబర్ 18న వచ్చిన కల్ట్ మామ లిరికల్ వీడియో సాంగ్ ఫుల్ పాపులర్ అయింది. దీంతో, ఈ పాట కోసం పని చేసిన ఎక్స్‌పీరియన్స్ గురించి ఊర్వశి చెప్పారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి తనతో చెప్పిన మాటను గుర్తు చేసుకున్నారు.

కల్ట్ మామ పాట సూపర్ హిట్ అవుతుండటంతో ఆ పాటలో డ్యాన్స్ చేసిన ఊర్వశీ రౌతేలా అభిప్రాయాన్ని తీసుకుంది స్కంద మూవీ టీమ్. ఊర్వశి చెప్పిన మాటలతో ఉన్న వీడియోను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న శ్రీనివాస స్విలర్ స్క్రీన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రామ్ పోతినేని గ్రేట్ డ్యాన్సర్ అని వాల్తేరు వీరయ్య సినిమా చేస్తున్నప్పుడు చిరంజీవి తనతో చెప్పారని, అది చాలా కరెక్ట్ అని ఊర్వశి అన్నారు. "రామ్ పోతినేనితో కలిసి పని చేయడం చాలా బాగా అనిపించింది. ఆయన అద్భుతమైన డ్యాన్సర్. నేను బాస్ పార్టీ పాట (వాల్తేరు వీరయ్య) కోసం చిరంజీవి సర్‌తో పని చేస్తున్నప్పుడు ఆయన నాతో ఒక మాట చెప్పారు. ఇండస్ట్రీలోని ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్లతో నువ్వు పని చేస్తున్నావని అన్నారు. ఒకటి నేను, ఆ తర్వాత రామ్ పోతినేని అని చిరంజీవి చెప్పారు. చిరంజీవి చెప్పిన ఆ మాట కచ్చితంగా కరెక్ట్” అని ఊర్వశి రౌతేలా అన్నారు. చిరంజీవి చెప్పినట్టే రామ్ గొప్ప డ్యాన్సర్ అని ఆమె చెప్పారు.

రామ్ పోతినేని ఫస్ట్ షాట్‍లోనే చాలా కష్టమైన డ్యాన్స్ మూవ్‍మెంట్స్ చేసేవారని ఊర్వశి రౌతేలా చెప్పారు. రామ్‍‍తో కలిసి పనిచేయడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. స్కంద సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నానని ఊర్వశి అన్నారు.

స్కంద సినిమా నుంచి కల్ట్ మామ లిరికల్ సాంగ్ సెప్టెంబర్ 18న వచ్చింది. ఒక్కరోజునే తెలుగులో ఈ పాటకు 10 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఫుల్ మాస్ బీట్‍ను ఈ పాటకు ఇచ్చారు. స్కంద చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.

స్కంద సినిమా సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది.