Chiranjeevi helping hand: మరోసారి పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. నటుడి చికిత్సకు సాయం
Chiranjeevi helping hand: మరోసారి పెద్ద మనసు చాటుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. సీనియర్ నటుడి చికిత్సకు సాయం చేశాడు. ఈ విషయాన్ని ఆ నటుడే వెల్లడించడం విశేషం.
Chiranjeevi helping hand: టాలీవుడ్ కు పెద్దదిక్కుగా, ఓ పెద్ద హీరోగా ఉండటమే కాదు.. తనది నిజంగానే పెద్ద మనసు అని మరోసారి నిరూపించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. తాను సినిమాల్లో ఓస్థాయికి ఎదిగిన తర్వాత అతడు చేసినన్ని విరాళాలు, సమాజానికి చేసిన సేవ మరే ఇతర హీరో చేయలేదంటే అతిశయోక్తి కాదు. తాజాగ ఓ సీనియర్ నటుడి చికిత్సకు సాయం చేసి వార్తల్లో నిలిచాడు.
ఆ సీనియర్ నటుడి పేరు పొన్నంబలం. 1980, 1990లలో నెగటివ్ పాత్రల్లో ఎక్కువగా కనిపించాడు ఈ తమిళ నటుడ. అతడు కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. పొన్నంబలం కిడ్నీ ఫెయిలైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని సాయం అడగాలో అతనికి తెలియలేదు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి.. వెంటనే అతనికి సాయం చేశాడు.
పొన్నంబలంకు ఆ వెంటనే అపోలో హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. తన రిపోర్టులను తీసుకొని రావాల్సిందిగా వాళ్లు అడిగారు. చిరంజీవి తనకు తోచినంత సాయం చేస్తాడని సదరు నటుడు భావించాడు. కానీ చిరు ఏకంగా హాస్పిటల్ మొత్తం బిల్లయిన రూ.45 లక్షలు చెల్లించడం గమనార్హం. హాస్పిటల్లోకి వెళ్లేందుకు కూడా పొన్నంబలం నుంచి ఫీజు వసూలు చేయలేదు.
ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో పొన్నంబలం ఈ విషయాన్ని వెల్లడించాడు. నిజానికి అతడు చెప్పే వరకూ ఈ విషయం చాలా మందికి తెలియదు. పొన్నంబలం చెప్పిన తర్వాత మరోసారి చిరంజీవి పెద్ద మనసు తెలుసుకొని అతన్ని అభినందిస్తున్నారు. ఈ మధ్యే ఓ సినిమాటోగ్రాఫర్ కు కూడా చిరంజీవి సాయం చేసిన విషయం తెలిసిందే.
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న దేవరాజ్ అనే సినిమాటోగ్రాఫర్ కు చిరు రూ.5 లక్షల చెక్కు అందించారు. దేవరాజ్ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్న చిరంజీవి.. వెంటనే తనకు తోచిన సాయం చేయాలని నిర్ణయించారు. చిరంజీవి నటించిన నాగు సినిమాకు కూడా దేవరాజ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశాడు.
సంబంధిత కథనం
టాపిక్