Bhola Shankar Final Collections: భోళా శంక‌ర్ ఫైన‌ల్ క‌లెక్ష‌న్స్ - చిరంజీవి మూవీకి వ‌చ్చిన న‌ష్టాలు ఎంతంటే?-chiranjeevi bhola shankar movie closing collections and total losses ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Chiranjeevi Bhola Shankar Movie Closing Collections And Total Losses

Bhola Shankar Final Collections: భోళా శంక‌ర్ ఫైన‌ల్ క‌లెక్ష‌న్స్ - చిరంజీవి మూవీకి వ‌చ్చిన న‌ష్టాలు ఎంతంటే?

HT Telugu Desk HT Telugu
Aug 31, 2023 02:25 PM IST

Bhola Shankar Closing Collections: చిరంజీవి భోళాశంక‌ర్ ఈ ఏడాది నిర్మాత‌ల‌కు అత్య‌ధిక న‌ష్టాల‌ను మిగిల్చిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. థియేట్రిక‌ల్ ర‌న్ ద్వారా ఈ సినిమాకు వ‌చ్చిన ఫైన‌ల్ క‌లెక్ష‌న్స్ ఎంతంటే...

చిరంజీవి భోళాశంక‌ర్
చిరంజీవి భోళాశంక‌ర్

Bhola Shankar Closing Collections: చిరంజీవి భోళాశంక‌ర్ మూవీ డ‌బుల్ డిజాస్ట‌ర్‌గా మిగిలిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల‌తో రిలీజైన ఈ మూవీ నిర్మాత‌ల‌కు పెద్ద ఎత్తున‌ న‌ష్టాల‌ను మిగిల్చింది. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి యాక్ష‌న్ అంశాల‌ను జోడించి రూపొందించిన భోళా శంక‌ర్ మూవీకి మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఆగ‌స్ట్ 11న రిలీజైన ఈ సినిమా ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది.

ట్రెండింగ్ వార్తలు

టోట‌ల్ థియేట్రిక‌ల్ ర‌న్‌లో కేవ‌లం ముప్పై కోట్ల వ‌సూళ్ల‌ను మాత్ర‌మే రాబ‌ట్టి నిర్మాత‌కు పెద్ద షాక్ ఇచ్చింది. వాల్తేర్ వీర‌య్య స‌క్సెస్ త‌ర్వాత చిరంజీవి న‌టించిన మూవీ కావ‌డంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ భారీగానే జ‌రిగింది. దాదాపు 80 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో భోళాశంక‌ర్‌ను నిర్మాత అనిల్ సుంక‌ర‌ రిలీజ్ చేశారు. కానీ పేవ‌ల‌మైన క‌థ‌, క‌థ‌నాలు, కామెడీ కార‌ణంగా అందులో స‌గం కూడా వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌లేక‌పోయింది.

నిర్మాత‌కు యాభై కోట్ల మేర న‌ష్టాల‌ను మిగిల్చిన‌ట్లు స‌మాచారం. అఖిల్ ఏజెంట్ త‌ర్వాత ఈ ఏడాది ఎక్కువ న‌ష్టాల‌ను మిగిల్చిన టాలీవుడ్ మూవీగా భోళాశంక‌ర్ నిలిచింది. ఈ రెండు సినిమాల్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాంక‌పై అనిల్ సుంక‌ర నిర్మించ‌డం గ‌మ‌నార్హం. భోళాశంక‌ర్ సినిమాలో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌గా చిరంజీవి సోద‌రి పాత్ర‌లో కీర్తిసురేష్ న‌టించింది. శ్రీముఖితో పాటు జ‌బ‌ర్ధ‌స్థ్ బ్యాచ్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత డైరెక్ట‌ర్‌గా భోళాశంక‌ర్‌ మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు మెహ‌ర్ ర‌మేష్‌. కానీ ఈ సినిమా కూడా అత‌డికి స‌క్సెస్‌ను తెచ్చిపెట్ట‌లేక‌పోయింది. కాగా భోళాశంక‌ర్ మూవీ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ది. సెప్టెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లోనే ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.