Bro 100 Crore Collection: వంద కోట్ల క్లబ్‌లో పవన్ కళ్యాణ్ బ్రో - ఐదో రోజు భారీగా తగ్గిన కలెక్షన్స్
Bro 100 Crore Collection: పవన్ కళ్యాణ్ బ్రో మూవీ 100 కోట్ల వసూళ్లను రాబట్టింది. వకీల్‌సాబ్, భీమ్లానాయక్ తర్వాత వంద కోట్ల వసూళ్లను రాబట్టిన పవన్ కళ్యాణ్ మూవీగా బ్రో నిలిచింది.
Bro 100 Crore Collection: పవన్ కళ్యాణ్ బ్రో మూవీ వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. ఐదు రోజుల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకున్నది. సోమవారం నాటి కలెక్షన్స్‌తో వరల్డ్ వైడ్‌గా 102 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే రోజు రోజుకు బ్రో మూవీ వసూళ్లు మాత్రం భారీగా తగ్గుముఖం పడుతోన్నాయి. రిలీజ్ రోజు వరల్డ్ వైడ్‌గా 30 కోట్లకుపైగా షేర్‌ను రాబట్టిన ఈ మూవీ సోమవారం రోజు కేవలం రెండు కోట్ల యాభై లక్షల కలెక్షన్స్ మాత్రం సొంతం చేసుకున్నది.
ఐదో రోజు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మూడు కోట్లకుపైగా గ్రాస్‌ను, కోటి ఎనభై లక్షల షేర్ కలెక్షన్స్‌ను దక్కించుకున్నది. ఓవరాల్‌గా తెలంగాణ, ఆంధ్రాలో ఐదు రోజుల్లో ఈ మూవీ 80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను, 49 కోట్ల వరకు షేర్‌ను దక్కించుకున్నది. వరల్డ్ వైడ్‌గా ఐదు రోజుల్లో 102 కోట్ల గ్రాస్, 60 కోట్ల వరకు షేర్ వసూళ్లు బ్రో సినిమాకు వచ్చాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి నిర్మాతలు, ఎగ్జిబిటర్లు లాభాల బాట పట్టాలంటే ఇంకో 38 కోట్ల వరకు కలెక్షన్స్ రావాలని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
వరుసగా మూడో సినిమా...
పవన్ కళ్యాణ్ గత సినిమాలు వకీల్‌సాబ్, భీమ్లానాయక్ కూడా వంద కోట్ల వసూళ్లను సాధించాయి. వరుసగా మూడు సినిమాలతో ఈ ఘనతను సాధించిన టాలీవుడ్ హీరోల్లో ఒకరిగా బ్రో మూవీతో పవన్ కళ్యాణ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. బ్రో మూవీలో పవన్ కళ్యాణ్‌తో పాటు మరో మెగా హీరో సాయిధరమ్‌తేజ్ కథానాయకుడిగా నటించాడు.
ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు. కుటుంబబాధ్యతల్ని నెరవేర్చకుండా హఠాత్తుగా కన్నుమూసిన ఓ యువకుడికి దేవుడు 90 రోజుల పాటు బతికే ఛాన్స్ ఇస్తే ఏం జరిగిందన్నదే ఈ మూవీ కథ. తమిళంలో విజయవంతమైన వినోదయసిత్తం ఆధారంగా బ్రో మూవీ తెరకెక్కింది. బ్రో మూవీలో కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రల్లో నటించారు.