Brahmastra Box office Collection: వంద కోట్ల మైలురాయిని దాటిన బ్రహ్మాస్త్ర – బాలీవుడ్ లో కొత్త రికార్డ్
Brahmastra Box office Collection: బ్రహ్మాస్త్ర చిత్రం ఫస్ట్ వీకెండ్ లోనే హిందీలో వంద కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఎంతంటే...
Brahmastra Box office Collection: రణ్‌భీర్‌కపూర్ (Ranbir kapoor) హీరోగా నటించిన బ్రహ్మాస్త్ర నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నా చక్కటి వసూళ్లతో దూసుకుపోతున్నది. బాలీవుడ్‌లో ఫస్ట్ వీకెండ్‌లోనే వంద కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకున్నది. హిందీ వెర్షన్‌కు మొదటిరోజు 31.5 కోట్ల వసూళ్లు రాగా, రెండో రోజు 37.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఊహించని విధంగా ఆదివారం రోజు వసూళ్లు గణనీయంగా పెరిగాయి.
బాలీవుడ్‌లోనే 42 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. మొత్తంగా ఒక్క హిందీలోనే 110 కోట్లకుగా వసూళ్లను రాబట్టింది. ఫస్ట్ వీకెండ్‌లోనే వంద కోట్ల కలెక్షన్స్ సాధించిన ఏడో బాలీవుడ్ సినిమాగా బ్రహ్మాస్త్ర రికార్డ్ క్రియేట్ చేసింది. భజరంగీ భాయిజాన్, సుల్తాన్, దంగల్, టైగర్ జిందా హై, రేస్ 3, సంజూ మాత్రమే గతంలో ఈ ఘనతను సాధించాయి.
తెలుగులో రెండు రోజుల్లోనే 6.30 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 5. 50 కోట్ల వరకు జరిగినట్లు తెలిసింది. రెండు రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను మిగిల్చింది. మూడు భాగాలుగా విడిపోయిన బ్రహ్మాస్త్రాన్ని రక్షించే భాద్యతను చేపట్టిన ఓ యువకుడి కథతో మైథలాజికల్ ఫాంటసీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర సినిమాను తెరకెక్కించాడు. కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మించారు.
ఇందులో రణ్‌భీర్‌కపూర్, అలియా (Alia bhatt) కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంటోంది. వీరిద్దరి పెళ్లి తర్వాత విడుదలైన తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. అమితాబ్ బచ్చన్, నాగార్జున (Nagarjuna) కీలక పాత్రలను పోషించారు. మూడు భాగాలుగా ఈ సినిమా రూపొందనున్నది. సెకండ్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టబోతున్నట్లు తెలిసింది. కాగా దక్షిణాది వెర్షన్స్ కు అగ్ర దర్శకుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించారు.