Boycott Laal Singh Chaddha: రిలీజ్‌ రోజూ ట్విటర్‌ టాప్‌ ట్రెండింగ్‌లో బాయ్‌కాట్‌ లాల్‌ సింగ్‌ చడ్డా-boycott laal singh chaddha still one of the top trending in twitter ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Boycott Laal Singh Chaddha Still One Of The Top Trending In Twitter

Boycott Laal Singh Chaddha: రిలీజ్‌ రోజూ ట్విటర్‌ టాప్‌ ట్రెండింగ్‌లో బాయ్‌కాట్‌ లాల్‌ సింగ్‌ చడ్డా

HT Telugu Desk HT Telugu
Aug 11, 2022 09:32 AM IST

Boycott Laal Singh Chaddha: బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ నటించిన లాల్‌ సింగ్ చడ్డా మూవీ గురువారం (ఆగస్ట్‌ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాను వ్యతిరేకిస్తున్న వాళ్లు మాత్రం బాయ్‌కాట్‌ లాల్‌ సింగ్‌ చడ్డా హ్యాష్‌ట్యాగ్‌ను ప్రమోట్‌ చేస్తున్నారు.

లాల్ సింగ్ చడ్డా మూవీలో ఆమిర్ ఖాన్, కరీనా కపూర్
లాల్ సింగ్ చడ్డా మూవీలో ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ (twitter)

లాల్‌ సింగ్‌ చడ్డా మూవీపై ఆమిర్‌ఖాన్‌ భారీ ఆశలే పెట్టుకున్నాడు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపిస్తున్న అతడు.. సొంతంగా సినిమాను నిర్మించాడు. అయితే అతడో దేశ వ్యతిరేకి అంటూ కొన్నాళ్లుగా బాయ్‌కాట్‌ లాల్‌ సింగ్‌ చడ్డా హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో ఉంటోంది. సినిమా రిలీజ్‌ రోజైన గురువారం (ఆగస్ట్‌ 11) కూడా ఉదయం నుంచి ఇదే టాప్‌ ట్రెండింగ్స్‌లో ఒకటిగా ఉంటోంది. బాయ్‌కాట్‌ బాలీవుడ్‌ కంప్లీట్లీ అనే మరో హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు.

తాను దేశ వ్యతిరేకిని కాదని, తనను తప్పుగా అర్థం చేసుకున్నారని, దయచేసి తన మూవీని బాయ్‌కాట్‌ చేయొద్దని ఆమిర్‌ఖాన్‌ వివరణ ఇచ్చినా.. ఈ బాయ్‌కాట్‌ నినాదం మాత్రం సద్దుమణగలేదు. సినిమా రిలీజ్‌కు ఒక రోజు ముందు అంటే బుధవారం (ఆగస్ట్‌ 10) స్పెషల్‌ స్క్రీనింగ్‌ సందర్భంగా కూడా ఆమిర్‌ఖాన్‌ మరోసారి దీనిపై వివరణ ఇచ్చాడు.

సినిమా చూడొద్దని అనుకుంటున్న వాళ్ల సెంటిమెంట్‌ను కూడా తాను గౌరవిస్తానని, అయితే ఎక్కువ మంది తన మూవీని థియేటర్లలో చూసి ఆనందించాలన్నదే తన ఆశ అని ఆమిర్‌ అన్నాడు. మరోవైపు ఈ సినిమా ఇప్పటికే చూసిన సెలబ్రిటీలు మాత్రం పాజిటివ్‌ రివ్యూలు ఇస్తున్నారు. హాలీవుడ్‌ ఒరిజినల్ అయిన ఫారెస్ట్‌ గంప్‌ కంటే కూడా ఈ సినిమా బాగుందని వాళ్లంటున్నారు.

అటు ట్విటర్‌లో బెటర్‌ దాన్‌ ఒరిజినల్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ కూడా ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. అయితే నిజానికి ఈ లాల్‌ సింగ్ చడ్డాకు ఉండాల్సినంత బజ్‌ మాత్రం లేదన్నది నిజం. ఆమిర్‌ఖాన్‌ సినిమాకు ఉండాల్సినంత హడావిడి కనిపించడం లేదు. ఈ మూవీ తెలుగులోనూ రిలీజ్ అయింది. నాగ చైతన్య స్పెషల్‌ క్యారెక్టర్‌లో కనిపించాడు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆమిర్‌తో కలిసి దేశమంతా తిరిగాడు.

IPL_Entry_Point