Laal Singh Chaddha: 'లాల్ సింగ్ చడ్ఢా'కు ట్వీటర్‌లో విషెస్ చెప్పిన ఫారెస్ట్ గంప్-forrest gump twitter announces the release date of its hindi remake laal singh chaddha ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Forrest Gump Twitter Announces The Release Date Of Its Hindi Remake Laal Singh Chaddha

Laal Singh Chaddha: 'లాల్ సింగ్ చడ్ఢా'కు ట్వీటర్‌లో విషెస్ చెప్పిన ఫారెస్ట్ గంప్

Maragani Govardhan HT Telugu
Aug 03, 2022 10:55 AM IST

ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన లాల్ సింగ్ చడ్ఢా.. హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ రీమేక్‌గా తెరకెక్కింది. తాజాగా ఫారెస్ట్ గంప్ అధికారిక ట్విటర్ హ్యాండిల్ లాల్ సింగ్ చడ్ఢా చిత్రానికి విషెస్ చెప్పింది.

లాల్ సింగ్ చడ్ఢా
లాల్ సింగ్ చడ్ఢా (Twitter)

ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం లాల్ సింగ్ చడ్ఢా. కరీనా కపూర్ హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాలో టాలీవుడ్ హీరో నాగచైతన్య కూడా కీలక పాత్ర పోషించాడు. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది 1994లో హాలీవుడ్‌లో వచ్చిన ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా తెరకెక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఫారెస్ట్ గంప్ అధికారిక ట్విటర్ హ్యాండిల్ కూడా ఈ బాలీవుడ్ సినిమా గురించి ప్రస్తావించింది. ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కాబోతుందని, అందరూ చూడాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

"మీలో ప్రేమ, ఆనందాన్ని నింపే ఓ వ్యక్తి అసాధారణ ప్రయాణాన్ని చూడండి. ఫారెస్ట్ గంప్ అధికారిక ఇండియన్ రీమేక్ లాల్ సింగ్ చడ్ఢా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న థియేటర్లలో విడుదల కానుంది." అని ఫారెస్ట్ గంప్ అధికారిక ట్విటర్ హ్యాడింల్ పేర్కొంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకుల ముందుక వచ్చి అలరించింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది. పాన్ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో నాగచైతన్య బాలరాజు అనే మిలిటరీ అధికారి పాత్రలో నటించారు. ఇప్పటికే చైతన్య లుక్‌ ఆకట్టుకుంటోంది. రూ.180 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. కరీనాతో పాటు మోనా సింగ్, నాగచైతన్య తదితరులు నటించారు.

 

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.